న్యూఢిల్లీ: ఆటో, గృహోపకరణాల సంస్థ బాష్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో లాభాల్లో 14 శాతం వృద్ధిని చూపించింది. రూ.399 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.350 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.3,311 కోట్ల నుంచి రూ.4,063 కోట్లకు వృద్ధి చెందింది. ఇక 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.1,424 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని బాష్ ప్రకటించింది.
ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.1,217 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.11,781 కోట్ల నుంచి రూ.14,929 కోట్లకు పెరిగింది. ‘‘2022 సంవత్సరాన్ని భారత్‌లో శతాబ్ది సంవత్సరంగా జరుపుకున్నాం. అదే ఏడాది మార్కెట్లో ఎన్నో సవాళ్లను చవిచూశాం. ఎన్నో అవరోధాలు ఉన్నా బలమైన వృద్ధితో సానుకూలంగా ముగించాం’’ అని బాష్ లిమిటెడ్ ఎండీ సౌమిత్రా భట్టాచార్య తెలిపారు.
(చదవండి: అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?)
ఎన్నో సవాళ్లు ఉన్నా కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఆటోమోటివ్ మార్కెట్ పట్ల ఆశావహ అంచనాలతో ఉన్నట్టు చెప్పారు. ఒక్కో షేరుకు తుది డివిడెండ్ కింద రూ.280 చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా ఒక్కో షేరుకు రూ.480 డివిడెండ్ ప్రకటించినట్టు అవుతుంది.
ఇదీ చదవండి: సగానికి పైగా అవే కొంపముంచుతున్నాయి: సంచలన సర్వే
Comments
Please login to add a commentAdd a comment