దివీస్ నిర్మాణంపై యథాతథ స్థితి కొనసాగాలని హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న దివీస్ నిర్మాణంపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దివీస్‌ను నిర్మించొద్దంటూ గతకొంతకాలంగా అక్కడి స్థానికులు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దివీస్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికులు కోర్టును ఆశ్రయించారు. దివీస్ పొల్యుషన్‌తో తాము తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్టు వారు కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన హైకోర్టు దివీస్ నిర్మాణం యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.