దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన
Published Sun, Aug 28 2016 12:13 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. వాకదారిపేటలో ఏర్పాటు చేయనున్న దివీస్ ల్యాబొరేటరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. గ్రామస్థులు ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు.
తమ గోడు వినకుండా.. పరిశ్రమ నిర్మాణం చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని గ్రామస్థులు హెచ్చరించారు. పరిశ్రమ ఏర్పాటు చేసే స్థలంలో ఉన్న గుడిసెలకు కొందరు మహిళలు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మద్దతు తెలిపారు. దివీస్ ల్యాబొరేటరీ ఏర్పాటును నిలిపివేయాలని రాజా డిమాండ్ చేశారు.
Advertisement