కోన తీరంలో తలపెట్టిన దివీస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పంపాదిపేట బీచ్‌రోడ్డుపై బాధిత గ్రామాల ప్రజల ఆగ్రహం మరోసారి పెల్లుబికింది. కొద్ది రోజుల క్రితం దివీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కోన తీర ప్రాంతంలో బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన చే సిన సంగతి విదితమే.