leaders arrested
-
బెంజ్ సర్కీల్‌లో మళ్లీ ఉద్రిక్తత.. నేతలు అరెస్టు
సాక్షి, విజయవాడ : బెంజ్ సర్కీల్‌లో ఆదివారం ఉదయం మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. జై ఆంధ్ర ఉద్యమనేత కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. విగ్రహాం తొలగింపునకు నిరసనగా ప్రజాసంఘాలు, కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఏ సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని నేతలు ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేసి గన్నవరం పీఎస్‌కు తరలించారు. జై ఆంధ్ర ఉద్యమనేత కాకాని విగ్రహాం తొలగింపుపై మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాకాని గుర్తులే లేకుండా చేయాలనుకోవడం దారుణమని ఆయన అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేయాలని శివాజీ డిమాండ్ చేశారు. అర్ధరాత్రి ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేత అరెస్టు -
విజయనగరంలో ఉద్రిక్తత
-
హామీలు నెరవేరలేదు..
♦ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్ ♦ లెక్టరేట్ ఎదుట సీపీఐ జైల్‌భరో ♦ నాయకుల అరెస్టు.. విడుదల ఆదిలాబాద్‌అర్బన్: అధికారంలోకి రాకముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ నెరవేరలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్ అన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వల్ల దేశంలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడుతోందని విమర్శించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో జైల్‌భరో నిర్వహించారు. ముందుగా పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి పలు చౌక్ల గుండా ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గుండా మల్లేష్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో వ్యవసాయ సంక్షోభం నివారణకు రూ.లక్ష కోట్ల నిధితో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో 70 నుంచి 80 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని, అందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని రైతులు మొరపెట్టుకుంటే లాఠీచార్జీలు, బేడీలు వేయిస్తున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వం గోరక్షణ పేరుతో దౌర్జాన్యాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి భూములు లాక్కోవద్దని, వారికి పట్టాలు ఇచ్చి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్, జయతీఘోష్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, వ్యవసాయ సంబంధ వస్తువులు, విత్తనాలు, ఎరువులను జీఎస్టీ నుంచి మినహాయించాలని అన్నారు. 2013 భూసేకరణ, నిర్వాసితుల చట్టాన్ని అమలు చేసి నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని పేర్కొన్నారు . రైతులను రుణవిముక్తులను చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి 14 రకాల నిత్యావసరాలను పంపిణీ చేయాలని, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లోని సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, పశువధ నిషేధ చట్టాన్ని రద్దు చేయాలని అన్నారు. కాగా, కలెక్టరేట్ లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.విలాస్, నాయకులు ముడుపు నళినిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
దివీస్‌పై జనాగ్రహం
-
దివీస్‌పై జనాగ్రహం
నేతల అరెసై్టనా రోడ్డెక్కిన బాధిత గ్రామాల ప్రజలు పంపాదిపేట బీచ్‌రోడ్డుపై ఆందోళన దివీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఆందోళనకారులపై పోలీసుల హుకుం పంపాదిపేటలో సభ జరగకుండా అడ్డుకున్న పోలీసులు సీపీఎం, సీపీఐ(ఎం.ఎల్),ఐద్వా సంఘం మహిళలతో పాటు నేతల అరెస్టు తొండంగి / పిఠాపురం : కోన తీరంలో తలపెట్టిన దివీస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పంపాదిపేట బీచ్‌రోడ్డుపై బాధిత గ్రామాల ప్రజల ఆగ్రహం మరోసారి పెల్లుబికింది. కొద్ది రోజుల క్రితం దివీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కోన తీర ప్రాంతంలో బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన చే సిన సంగతి విదితమే. పంపాదిపేట వద్ద పోలీసుల అరెస్టు, లాఠీచార్జి సంఘటనల నేపధ్యంలో బాధిత గ్రామాల్లో పది రోజులపాటు విధించిన 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. బాధిత గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మంగళవారం పంపాదిపేటలో బహిరంగ సభ నిర్వహించేందుకు అఖిల పక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో మంగళవారం వివిధ పరిణామాలు చోటుచేసుకుని చివరకు బాధిత గ్రామాల ప్రజలు బీచ్‌రోడ్డుపై దివీస్‌కు వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపించారు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు... అఖిలపక్ష నేతలు ఇచ్చిన పిలుపు మేరకు సభ జరుగుతుందని భావించిన పోలీసులు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో సోమవారం రాత్రికే జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి పోలీసులను ఒంటిమామిడి వద్దకు భారీ సంఖ్యలో తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం నుంచే మండలంలోని నలువైపులా ప్రధాన రహదారుల వద్ద బందోబస్తును ఏర్పాటు చేసి సభకు హాజరయ్యే వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. దీంతో తొండంగి ప్రధాన రహదారిలో ఏ.కొత్తపల్లి వద్ద, కృష్ణాపురం జంక్షన్ వద్ద, బీచ్‌రోడ్డులో తాటియాకులపాలెం, పెరుమాళ్లపురం పరిసర ప్రాంతాల్లో పోలీసులను బందోబస్తు పెట్టారు. వచ్చీపోయేవాహనాలను తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ™ èlనిఖీల నేపధ్యంలో సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఖాకీల దండుతో కోనప్రాంతం ఉలిక్కిపడింది. పంపాదిపేటలో నేతల బలవంతపు అరెస్టులు... దివీస్ వ్యతిరేకిత గ్రామాల ఆందోళనకు మద్దతుగా సభ నిర్వహించేందుకు పంపాదిపేట రామాలయం వద్దకు సీపీఎం, సీపీఐ (ఎం.ఎల్. లిబరేషన్), పి.వి.రావు మాలమహానాడు సంఘం, ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) నేతలతోపాటు బాధిత గ్రామాల ప్రజలు చేరుకున్నారు. అప్పటికే అడిషనల్ ఎస్పీ దామోదరం ఆధ్వర్యంలో అక్కడకు పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. రామాలయం వద్ద బహిరంగ సభ జరపడానికి అనుమతులు లేవని, సభ పెట్టడం కుదరదని డీఎస్పీ, సీఐలు చర్చలు జరిపారు. సభ నిర్వహణకు అనుమతి కోసం జిల్లా పోలీసులు అధికారులకు దరఖాస్తు చేశామని, తాము ఎటువంటి ఆందోళన చేయకుండా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సభను నిర్వహించుకుంటామని నేతలు వివరించారు. సుమారు గంట సేపు ఈచర్చలు, వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపధ్యంలో సభకు వచ్చిన ఐద్వా సంఘం మహిళా నేతలు, బాధిత గ్రామాల మహిళలు బైఠాయించి ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘దివీస్ పరిశ్రమ తమకు వద్దంటూ’ ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, పి.వి.రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పండు అశోక్, సీపీఐ(ఎం.ఎల్.లిబరేషన్) జిల్లా కార్యదర్శి బుగతా బంగార్రాజు, సీపీఐ ఎంఎల్ తుని ఏరియా కోఆర్డినేటర్ శివకోటిరాజు, కె.జనార్ధన్, మాజీ జెడ్పీటీసీ అంగుళూరి అరుణ్‌కుమార్ తదితర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మహిళల ఆందోళన తీవ్రతరం చేయడంతో మహిళలను జడపట్టుకుని లాగుతూ, వస్త్రాలను పట్టుకుని విచక్షణా రహితంగా లాగి వ్యానులోకి కుక్కారు. శాంతియుత వాతావరణంలో సభ నిర్వహించుకునేందుకు వస్తే పోలీసులు జులుం ప్రదర్శించి, దౌర్జన్యంగా తమను అదుపులోకి తీసుకున్నారంటూ ఉద్యమకారులు మండిపడ్డారు. ఈ సంఘటనలో ఐద్వా సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్.రమణి, ఇతర సభ్యులు సుభాషిణి, ఇతర మహిళలను అదుపులోకి తీసుకున్నారు. బండిపై వెళ్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శిపై దురుసుతనం సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ మహిళా కానిస్టబుల్ మధు చొక్కాను లాగడంతో స్కూటర్ అదుపు తప్పింది. కిందపడేలోగానే ఎలాగోలా బైక్ అదుపుచేసి నిలిపే లోపే మిగిలిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బలవంతంగా లాక్కెళ్లి జీపులో ఎక్కించారు. ఆయనతోపాటు సీపీఎం జిల్లా నాయకులు అప్పారెడ్డి, మరొకొంత మందిని అదుపులోకి తీసుకుని కాకినాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పలువురి మందుస్తు అరెస్టులు... M సభకు హాజరయ్యేందుకు వస్తున్న పలువురిని పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. తునిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెటి ్టరాజాను, పెరుమాళ్లపురంలో సీఐటీయూ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బీబీరాణి, ఏ.కొత్తపల్లిలో మాజీ ఎం.పీ హర్షకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బీచ్‌రోడ్డుపై నిరసన గళాలు... పంపాదిపేట రామాలయం వద్ద బహిరంగ సభను జరగనివ్వకుండా పోలీసులు ముఖ్య నేతలను, మహిళా సంఘం నేతలతోపాటు ఇతర మహిళలను అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇది జరిగిన గంటసేపటికి పాఠశాల భవనం సమీపంలో వీధుల్లో బాధిత గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. సీపీఎం అనుబంధ సం«స్ధ వ్యవసాయ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం అడ్డగోలుగా భూసేకరణ చేపట్టిందని, ఇక్కడి రాజకీయ నాయకుల పోత్సాహంతోనే పరిశ్రమ ఏర్పాటు జరుతుందన్నారు. ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా, హెచరీల్లో ఉపాధి పొందుతున్న యువతకు పత్నామ్నాయ ఉపాధి కల్పించకుండా అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారంతా పాదయాత్రగా సుమారు కిలోమీటరు వరకూ బీచ్‌రోడ్డు గుండా దివీస్ భూముల వరకూ వచ్చారు. అక్కడ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కాసేసు తోపులాట జరిగింది. నరసింహరావు కొంత అస్వస్ధతకు గురయ్యారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలంతా అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈలోపుగా ఒంటిమామిడి, పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీసులను వ్యాన్లపై రప్పించి ఆందోళనకారులను చుట్టుముట్టారు. సుమారు మూడొందల మందికిపైగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. డీఎస్పీ రాజశేఖర్ ఆదేశాలతో నరసింహారావును పోలీసులు మోసుకుంటూ వాహనంలో ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మరో 20 మంది వరకూ ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తీరంలో 144 సెక్షన్‌ను పోలీసులు కొనసాగిస్తున్నారు. మత్స్యకారుల నిరసన... శాంతియుతంగా పంపాదిపేటలో జరిగే బహిరంగ సభకు తమ మత్స్యకారులను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ నర్సిపేటలో మత్స్యకారులు నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకుడు మేరుగు ఆనందహరి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చొక్కా కాశీలతోపాటు సుమారు రెండొందలమంది మత్స్యకారులు నిరసన తెలిపారు. అనంతరం కొందరి మత్స్యకారులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆందోళన చేస్తామని మత్స్యకార నాయకులు హెచ్చరించడంతో వారిని వదిలేశారు. -
రాష్ట్ర వ్యాప్తంగా బంద్ విజయవంతం
-
రాష్ట్రవ్యాప్తంగా బంద్ విజయవంతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు అన్ని జిల్లాల వ్యాప్తంగా బంద్ విజయవంతంగా ముగిసింది. బంద్‌లో పాల్గొన్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. అయినా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. వాణిజ్య, వ్యాపార సంస్థలు పనిచేయలేదు. విద్యా సంస్థలను మూసివేశారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ నాయకులు బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. నేతలు వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పార్థసారథి, పి.గౌతంరెడ్డి, నాగిరెడ్డి తదితరులు ఆర్టీసీ ప్రయాణికులు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బందికి గులాబీలు ఇచ్చి బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఆర్టీసీ బస్సుల్లో వీరి ప్రచారానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా పార్థసారథితోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బంద్ పాటించాలని కోరుతున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా పది మంది పార్టీనేతలను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి మంగళగిరి ఆర్టీసీ డిపో నుంచి బయటకు బస్సులు రాకుండా అడ్డుకున్నారు. బస్టాండ్ ఎదుట రెండు గంటలపాటు ధర్నా చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే ఆర్కే సహా నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో స్థానిక యువకులు బైక్ ర్యాలీ చేపట్టారు. బంద్‌కు సహకరించాలని పట్టణంలో తిరుగుతూ ప్రజలను కోరారు. సత్తెనపల్లిలో బంద్ పాటి ంచాలని కోరుతూ నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు 20 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున ఆందోళకు దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా రేపల్లెలో బంద్ పాటిస్తున్న పార్టీ పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌కుమార్, మైనారిటీ నేత షేక్ సుభానీ తదితర వైఎస్సార్సీపీ నేతలు 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సహా నాయకులు ధర్నాకు దిగారు. బస్సులు బయటకు రాకుండా ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ జిల్లా కేంద్రంలో కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు బస్టాండ్‌వద్ద ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలో హైవేపై వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలం సురేష్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. పీలేరులో బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా 200 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో నిరసనలు, ఆందోళనలతో పీలేరు పట్టణ బంద్ విజయంతమైంది. కాణిపాకంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్‌రెడ్డి, నేతలు చిన్నారెడ్డి, భాస్కరయ్య, ఆర్ముగం, అజీజ్ తదితరులను అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. మదనపల్లిలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకుని, ఆయన్ను స్టేషన్‌కు తరలించారు. కడప జిల్లా రాయచోటి బంద్‌లో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. స్థానిక నేతలతో కలిసి ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. జమ్మలమడుగులో బంద్ ప్రశాంతంగా ముగిసింది. వాణిజ్య, వ్యాపారసంస్థల వారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బస్సులను ఆపేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట నాయకులు బైఠాయించారు. దీంతో బస్సులు బయటకు రాలేదు. బంద్‌కు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. అనంతపురం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి సహా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైఎస్సార్సీపీ నేతలు రాస్తారోకో చేపట్టారు. తమ్మినేని సీతారాం సహా పార్టీనేతలను పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన చేస్తున్న పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. సుమారు 12మంది నేతలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. విశాఖ జిల్లా కేంద్రం మద్దిలపాలెంలో ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేస్తున్న గుడివాడ అమర్నాథ్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌కు సహకరించాలని కోరుతూ తాటిచెట్లపాలెంలో వైఎస్సార్సీపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్టీసీ డిపోను ముట్టడించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత, వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వామపక్షల పార్టీల నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. -
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
హైదరాబాద్ : అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. రైతన్నల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, ఒకేసారిగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ర్ట బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ ప్రభావంతో పలు డిపోల్లోంచి బస్సులు బయటకు రాలేదు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నా లాభం లేకపోయింది. తెల్లవారుజామునుంచే ప్రతిపక్ష నాయకులు డిపోల వద్దకు చేరుకొని బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ అదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నగరంలోని పలు డిపోల ఎదుట అఖిలపక్ష కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాలలో బంద్‌కు నాయకత్వం వహిస్తున్న పలు పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఎంజీబీఎస్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దానం నాగేందర్, అంజన్‌కుమార్, పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ నేత నారాయణ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. దిల్సుఖ్నగర్ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు ఇంద్రసేనారెడ్డి సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే విధంగా జూబ్లీ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్: కల్వకుర్తి బస్ డిపో ముందు వైఎస్ఆర్ సీపీ నేత ఎడ్మ కిష్టారెడ్డి బైఠాయించడంతో బస్సులు రోడ్డెక్కలేదు. వనపర్తి డిపో ఎదుట అఖిలపక్ష నేతలు బైఠాయించడంతో బస్సులు డిపోకే పరిమతమయ్యాయి. వరంగల్: వరంగల్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా చేపట్టారు. అయితే పోలీసులు అడ్డుకునేందుకు యత్నించడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. మెదక్: సంగారెడ్డి ఆర్టీసీ డిపో ముందు ప్రతిపక్షాల బైఠాయించాయి. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. దుబ్బాక డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. రంగారెడ్డి: బంద్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో ఎదుట కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ నాయకులు బైఠాయించారు. డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా తెల్లవారుజాము నుంచే రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్: జిల్లాలోని 11 డిపోల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హుజూరాబాద్‌లో డిపో ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ బంద్‌కు మద్దతుగా విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. నల్లగొండ: జిల్లా వ్యాప్తంగా 7 డిపోలలో బస్సులు రోడ్డేక్కలేదు. డిపోల ఎదుట అఖిలపక్షాలు బైఠాయించాయి. సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. డిపోల వద్దకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీసీఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్: ఈ జిల్లాలో బంద్ పాక్షికంగా నడుస్తోంది. బైంసా బస్ డిపో ఎదుట వామపక్షాల నేతలు బస్సులను అడ్డుకుంటున్నారు. బస్ డిపోల ఎదుట బైఠాయించిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. జిల్లాలోని 6 డిపోలకు చెందిన 680 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. -
రాష్ట్ర బంద్.. నగరంలో ఉద్రిక్తత
హైదరాబాద్ : రాష్ట్రబంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో డిపోల ఎదుట బైఠాయించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఎంజీబీఎస్ వద్ద బస్సుల రాకపోకలను అడ్డుకునేందుకు అక్కడ బైఠాయించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్ లను అదుపులోకి తీసుకుని బలవంతంగా అక్కడినుంచి తరలిస్తున్నారు. రైతు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేసేంత వరకు పోరాడుతామని ఉత్తమ్ పేర్కొన్నారు. మెహిదిపట్నంలో షబ్బీర్ అలీని అరెస్ట్ చేసి బస్సులకు దారిచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీ బస్టాండ్ వద్ద బైఠాయించిన టీటీడీపీ, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్ రమణ, చింతల రాంచంద్రారెడ్డి, లక్ష్మణ్, తదితరులను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు. దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి అంబర్ పేట పీఎస్‌కు తరలించారు. కూకట్పల్లి డిపో వద్ద విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలిస్తున్నారు. -
వైఎస్ఆర్ జిల్లాలో కార్యకర్తలు అరెస్ట్
-
గాంధీమార్గంలో నిరసన తెలిపితే అరెస్టులా
ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేస్తుంటే.. పోలీసులు వచ్చి నాయకులను ఎందుకు అరెస్టు చేస్తారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎవరైనా తప్పుచేస్తే శిక్షించాలి గానీ.. గాంధీ మార్గంలో శాంతియుతంగా నిరసన తెలిపేవాళ్లను అరెస్టు చేయడం, వారిపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... పదే పదే చట్టాలను ఉల్లంఘించేవారిని వెనకేసుకు రావడం ఎంతవరకు సమంజసం ఇసుక విషయంలో మహిళా ఎమ్మార్వోపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే, ఆమెను ఇంటికి పిలిపించి పంచాయతీ చేసే స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది ప్రజాస్వామ్యంలో ఒకరు అధికారంలో, మరొకరు ప్రతిపక్షంలో ఉంటారు, అవి తారుమారు అవుతాయి. అధికారులు మాత్రం అధికారంలో ఉన్నవాళ్లకు కొమ్ము కాస్తాం అంటే కురదదు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేస్తుంటే.. నాయకులను ఎందుకు అరెస్టు చేస్తారు? రిషితేశ్వరి ఘటనలో దోషులను శిక్షించలేదు. కడపలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నా ఆ విద్యా సంస్థ యజమాని ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి చర్య తీసుకోవట్లేదు తప్పు ఎవరు చేసినా శిక్షించేలా పోలీసులు ఉండాలి శాంతియుతంగా పోరాటం చేసేవాళ్లను అరెస్టులు చేయకపో్వడం మంచిది అహింసాయుత నిరసనకు గాంధీజీ ఒక గుర్తింపు తెచ్చారు కానీ ఇప్పుడు మాత్రం నాలుగు కేసులు పెట్టి, రౌడీషీట్ ఓపెన్ చేస్తామనడం కరెక్టు కాదు ఇప్పటికైనా మారి.. తప్పులు చేసినవాళ్ల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం పుష్కరాల్లో వాళ్ల స్వార్థం కోసం 27 మంది మరణించినప్పుడు ప్రశ్నిస్తే.. శవరాజకీయం అంటారు -
'నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తాం'
జిల్లాలో రెండవ దశ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, ఎస్పీ సెంథిల్‌కుమార్ తెలిపారు. గురువారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో లోకేష్ కుమార్, సెంథిల్‌కుమార్ మాట్లాడుతూ... రెండు దశ పోలింగ్‌కు 5 వేల మందితో భద్రత సిబ్బందిని వినియోగించనున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 34 వేల మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. జిల్లాలో 467 గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా, భద్రత పెంచినట్లు చెప్పారు. అందుకోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఎవరైన రెండో సారి ఓటు వేసేందుకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ రోజున నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తామన్నారు. -
కావూరి కక్ష సమైక్యవాదులకు సంకెళ్లేనా !
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : సమైక్యవాదం వినిపిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులకు, సమ్యైదులకు అరెస్ట్‌లు తప్పటం లేదు. వారు చేసిన తప్పల్లా రాష్టాన్ని ముక్కలు కానీయకుండా ప్రయత్నించమని కోరటమే. కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు ఆదివారం జిల్లా పర్యటన సందర్భంగా ముందుగానే పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులను అరెస్టు చేయటాన్ని ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా విమర్శించాయి. గత నెల 17న చింతలపూడి పర్యటనకు వచ్చిన కావూరి సాంబశివరావును రాష్ట్ర విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకున్నందున సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించాలని కోరటానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్‌తో పాటు 20 మందిపై అక్రమ కేసులు బనాయించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కావూరి కక్షగట్టి అదే రోజు రాత్రి పోలీసు అధికారులతో మాట్లాడి వారిని అరెస్టుచేసి జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశార ని పలువురు విమర్శించారు. 18వ తేదీ ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ను పోలీసులు నిద్రలేసి మరీ అరెస్టు చేశారు. రాజేష్‌తో పాటు ఇతర నాయకులను కరుడుగట్టిన నేరస్తుల మాదిరిగా చెప్పులు కూడా వేసుకోనీయకుండా నడిరోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువె ళ్లారు. ఐపీసీలోని మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. తాజాగా ఆదివారం కేంద్రమంత్రి కావూరి బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మండలాల్లో పర్యటించనున్న సందర్భంగా ఉదయమే పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులను ముందస్తు చర్యగా గృహ నిర్బంధంలో ఉంచటంతోపాటు, పలువురిని అరెస్టుచేసి ప్రైవేట్ గదుల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంచారు. ఈ తీరుపట్ల ఆ పార్టీ శ్రేణులు తీవ్రం ఆగ్రహం వ్యక్తంచేశాయి. కావూరి పర్యటనను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురానికి చెందిన వైసీపీ నాయకుడు పోల్నాటి బాబ్జీని ఉదయం 6 గంటలకు అదుపులోకి తీసుకునే ప్రయత్నంచేశారు పోలీసులు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు పోలీసులను ప్రశ్నించటంతో వారు వెళ్లిపోయారు. అనంతరం ఉదయం 8 గంటలకు సీఐ, ఇద్దరు ఎస్సైలు, 15 మంది పోలీసులు వచ్చి బాబ్జిని అరెస్టుచేసేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం పట్టణ వైసీపీ నాయకులు శ్రీనివాసపురానికి చేరుకుని పోలీస్ వాహనానికి అడ్డంగాపడుకుని సమైక్య నినాదాలు చేసి నిరసన తెలిపారు. అక్రమ అరెస్టులు ూనుకోవాలని నినాదాలు చేశారు. గ్రామస్తులు, వైసీపీ నాయకులు భారీగా చేరుకోవటంతో పోలీసులు చేసేదేమీలేక బాబ్జితోపాటు పార్టీ నాయకులు బీవీఆర్ చౌదరి, చనమాల శ్రీనివాసరావు, మంగా రామకృష్ణ, పోల్నాటి ఉదయ్‌కుమార్, పంది రాజా, పీతల కృష్ణమూర్తి, చిప్పాడ వెంకన్న, పోల్నాటి శ్రీను, బుజ్జా పరమేశ్వరరావు, కూనపాం పండు, అడబాల రాంబాబు, కాసర సోమిరెడ్డి, పోల్నాటి చెల్లారావు, బల్లె రామచంద్రరావు, టి.శ్రీను, రాంబాబు, ఎం.హరీష్, శివలను పోల్నాటి బాబ్జిని ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు నిర్బంధంలో ఉంచి తరువాత విడుదలచేశారు. చింతలపూడిలో కావూరు పర్యటన సాయంత్రం అయినప్పటికీ వైసీపీ నాయకులను ఉదయం 6 గంటలకే 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని తొలుత పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి వారిని పోలీసుల ఆధీనంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో పెట్టారు. జీలుగుమిల్లి మండలంలో వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రేమ్‌కుమార్‌తో పాటు ఆరుగురిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని మధ్యాహ్నం వదిలిపెట్టారు. పోలీసులు అధికార పార్టీ నేతల చేతిలో కీలుబొమ్మల్లా మారి ప్రజాస్వామ్యబద్ధంగా సమైక్యవాదన వినిపించే వారి నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల పర్యటనల సందర్భంగా వైసీపీ నాయకులను అరెస్టుచేయటాన్ని వైసీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తీవ్రంగా ఖండించారు.