
సాక్షి, విజయవాడ : బెంజ్ సర్కీల్‌లో ఆదివారం ఉదయం మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. జై ఆంధ్ర ఉద్యమనేత కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. విగ్రహాం తొలగింపునకు నిరసనగా ప్రజాసంఘాలు, కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఏ సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని నేతలు ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేసి గన్నవరం పీఎస్‌కు తరలించారు.
జై ఆంధ్ర ఉద్యమనేత కాకాని విగ్రహాం తొలగింపుపై మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాకాని గుర్తులే లేకుండా చేయాలనుకోవడం దారుణమని ఆయన అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేయాలని శివాజీ డిమాండ్ చేశారు.