statue issue
-
విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్
-
ఇక జాంబవ క్షేత్రంగా ఒంటిమిట్టకు ఖ్యాతి
కడప కల్చరల్ : ఒంటిమిట్ట దివ్య క్షేత్రానికి కొత్త హంగు కలగనుంది. జాంబవ ప్రతిష్టగా పేరున్న ఈ క్షేత్రంలో జాంబవంతుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని చాలా కాలంగా భక్తులు కోరుతున్నారు. వారి వినతులకు స్పందించిన టీటీడీ అదికారులు ఇటీవలి పర్యటన సందర్భంగా ఈ మేరకు విగ్రహ ప్రతిష్ట చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రానికి తలమానికంగా, జిల్లాకు గర్వ కారణంగా నిలిచిన శ్రీమద్ ఒంటిమిట్టకు జాంబవ క్షేత్రంగా పేరుంది. ఈ ఆలయానికి అధికార హోదా దక్కేందుకు స్థానిక పరిశోధకులు ఆలయ ప్రాచీనత గురించి చెబుతూ క్షేత్ర పాలకుడిగా రామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టించినది జాంబవంతుడేనని స్పష్టం చేశారు. ఇందుకు పురాణ గాథలను ఉదాహరణగా చూపారు. తిరుమల క్షేత్రానికి వరాహ స్వామి, దేవునికడపకు హనుమంతుడు క్షేత్ర పాలకులు. అలాగే ఒంటిమిట్ట ఆలయానికి జాంబవంతుడు క్షేత్ర పాలకుడని స్థానిక చరిత్రకారుడు స్పష్టం చేశారు. ఒంటిమిట్ట జాంబవ క్షేత్రమని పేర్కొనేందుకు జిల్లాలో పలు ఆధారాలు లభించాయి. సిద్దవటం మండలం జ్యోతి గ్రామంలో రోడ్డు వారగా జాంబవంతుని శిలాచిత్రం గల శాసనం లభించింది. పలు తరాలుగా తాము జాంబవంతుడిని పూజిస్తున్నామని, ఒంటిమిట్ట తిరునాలకు గ్రామ వాసులంతా తప్పక వెళతామని తెలిపారు. అంబవరంలో.. కడప నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో అంబవరం గ్రామం ఉంది. గ్రామం మధ్యలో గల చిన్న దిమ్మెపై రెండు అడుగుల జాంబవంతుని విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. ఒకప్పుడు ఈ స్థలంలో చిన్న రాయి ఉండేదని, దాన్నే జాంబవంతునిగా పూజించేవారమని, పెద్దల కాలం నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. తరతరాలుగా తమ గ్రామంలో జాంబవంతుని పూజలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. వరుసగా రెండేళ్లుగా వర్షాలు రాకపోతే నెల రోజుల పాటు ఇంటికొక బిందె చొప్పున నీళ్లు తెచ్చి జాంబవంతుని విగ్రహాన్ని అభిషేకిస్తామని, తప్పక మంచి ఫలితం ఉంటోందని వారు వివరించారు. తాడిగొట్లలో.. కడప నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తాడిగొట్ల గ్రామం ఉంది. ఊరి మధ్య విశాలమైన అరుగుపై ఆ గ్రామ ప్రజలు జాంబవంతుని విగ్రహం ఉంది. గ్రామంలో ఏ ఇంటిలోనైనా శుభ కార్యాలు జరిగితే తొలిపూజ జాంబవంతునికే నిర్వహిస్తామని తెలిపారు. వర్షాభావ పరిస్థితి ఏర్పడితే స్వామికి అభిషేకాలు చేస్తామని, తప్పక వర్షాలు కురుస్తాయన్న విశ్వాసం ఉందన్నారు. ఈ గ్రామాలే గాక చిట్వేలితోపాటు కడప నగరానికి సమీపంలోని మరికొన్ని గ్రామాలలో కూడా జాంబవంతుని విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఒంటిమిట్ట క్షేత్ర పాలకుడు జాంబవంతుడు గనుక జిల్లాలోని ఆ క్షేత్రానికి సమీపంలో గల చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న గ్రామాలలో నేటికీ పూజిస్తూ ఉండడంతో.. ఒంటిమిట్ట క్షేత్రానికి జాంబవంతుని గల అనుబంధాన్ని భావితరాలకు శాశ్వతంగా తెలిపేందుకు అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని రామయ్య భక్తులు చిరకాలంగా కోరుతున్నారు. ఇటీవల ఆలయాన్ని పరిశీలించిన టీటీడీ అధికారులకు కూడా విన్నవించడంతో.. వావిలకొలను సుబ్బారావు తపం చేసిన శృంగిశైలంపై జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కొండపైనే తొలుత జాంబవంతుడు నివసించినట్లు కైఫీయత్తుల పరిష్కర్త, చరిత్ర పరిశోధకులు దివంగత విద్వాన్ కట్టా నరసింహులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గిరి ప్రదర్శన ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అరుణాచలం, సింహాచలంతోపాటు మరికొన్ని దివ్య క్షేత్రాలలో ఆయా దేవతామూర్తుల పూజలో భాగంగా అక్కడ గిరి ప్రదర్శన నిర్వహిస్తుండడం తెలిసిందే. అదే పద్ధతిలో ఒంటిమిట్టలోని శృంగిశైలానికి కూడా గిరి ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదిజాంబవ మఠాల పెద్దలు పలు సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్నారు. కొండపై జాంబవంతుని ప్రతిష్ట జరిగితే ఇక్కడ కూడా గిరి ప్రదర్శన ఏర్పాటు చేయాలని వారు మరోమారు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, ఒంటిమిట్ట తిరునాల సందర్బంగా తాము తమ శిష్య గణాలతో కలిసి శృంగిశైలం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని గుర్తు చేశారు. మంచి నిర్ణయం తీసుకున్నట్లు హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీ అధికారులను అభినందించారు. ఇదీ చదవండి: శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం -
‘తక్షణమే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి’
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు వ్యవహారం ఇంకా చల్లబడలేదు. ఈ విషయంపై ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఈ విషయంపై అఖిలపక్ష నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశాయి. అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిశామని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసి డంపింగ్‌యార్డ్ పడేయడం యావత్ తెలంగాణ చూసిందన్నారు. అదే స్థలంలో తిరిగి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్మేదావి మాత్రమే కాదని కోట్లాది మంది ఆయనను దైవంగా పూజిస్తారని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని కూల్చివేశారన్నారు. వీటిని ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చమని ఆదేశించిన అధికారులపై కేసులు నమోదు చేయాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. -
అంబేడ్కర్ విగ్రహ తొలగింపు యత్నం
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: మండలంలోని కోడిగూడెంలో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించేందుకు వచ్చిన రెవెన్యూ సిబ్బందిని, పోలీసులను స్థానికులు శుక్రవారం అడ్డుకున్నారు. తమ ప్రాణాలు పోయినా సరే విగ్రహ తొలగింపునకు ఒప్పుకునేది లేదంటూ జేసీబీకి అడ్డుపడ్డారు. దీంతో అక్కడున్న అధికారులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. చివరకు రెవెన్యూ సిబ్బంది,పోలీసులు అక్కడి నుంచి వెనుతిరగడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ద్వారకాతిరుమల మండలం కోడిగూడెంలో ఎస్సీ కమ్యూనిటీ హాలు వద్ద ఈ ఏడాది అక్టోర్ 24న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ స్థలంలో సుమారు రూ. 6 లక్షలతో వెలుగు గ్రామ సంఘం కార్యాలయ భవనాన్ని నిర్మించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని సోంబాబు మరికొందరు నిర్ణయించారు. అయితే ఆ స్థలంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించాలని రెవిన్యూ, పోలీస్ అధికారులపై సోంబాబు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్సీ కాలనీ వాసులంతా కలసి కొద్దిరోజుల క్రితం సోంబాబు, చెలికాని వేణుగోపాలరావు, డొక్కా ధర్మరాజు, బొబ్బిలి గంగాధరరావు, మానుకొండ ఏసోబులపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే శుక్రవారం తహసీల్దారు టీడీఎల్ సుజాత, ఆర్ఐ వెంకటరమణ, ద్వారకాతిరుమల, భీమడోలు ఎస్సైలు ఐ.వీర్రాజు, బి.మోహనరావు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అంబేడ్కర్ విగ్రహాన్ని జేసీబీ సహాయంతో తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఎస్సీ కాలనీ వాసులంతా కలిసి జేసీబీని, అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అక్కడి నుంచి వెనుతిరగడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. చావడానికైనా సిద్ధమే అధికారం చేతిలో ఉంది కదా అన్న ధీమాతో సోంబాబు అతని అనుచరులు విగ్రహ తొలగింపునకు పట్టుబట్టడం సరికాదని ఎస్సీ కాలనీ వాసులు ధ్వజమెత్తుతున్నారు. విగ్రహ ఏర్పాటుకు అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్న విషయం తెలియక విగ్రహాన్ని నిర్మించామని, ఇప్పుడు తమ మనోభావాలు దెబ్బతినే విధంగా విగ్రహాన్ని తొలగిస్తానంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కోసం తమ ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధమేనని అంటున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు దౌర్జన్యం ఆపాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని వారు ధ్వజమెత్తారు. కాసులకోసం కక్కుర్తి! ఏదైనా ప్రభుత్వ భవనం నిర్మించాలంటే ముందు గ్రామ సభ నిర్వహించి, ప్రజలకు అనుకూలమైన ప్రాంతంలో దాన్ని నిర్మించాల్సి ఉంటుందని, అయితే దానికి విరుద్ధంగా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో నుయ్యి ఉండేదని, దాన్ని ఇటీవలే పూడ్చారని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో భవనం ఎలా కడతారని ప్రశ్నిస్తున్నారు. భవనాలు నిర్మించడం ద్వారా వచ్చే కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాయకులు తమపై ఇలా అధికారులతో దౌర్జన్యాలు చేయిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు విగ్రహ తొలగింపు చర్యలను విరమించకుంటే తాము పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని దిర్శిపాం తాతయ్య, డొక్కా ఎర్రవెంకటేష్, డొక్కా దుర్గారావు, డొక్కా పెద్దిరాజు, డి.నాగసుబ్బారావు తదితరులు హెచ్చరిస్తున్నారు. -
బెంజ్ సర్కీల్‌లో మళ్లీ ఉద్రిక్తత.. నేతలు అరెస్టు
సాక్షి, విజయవాడ : బెంజ్ సర్కీల్‌లో ఆదివారం ఉదయం మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. జై ఆంధ్ర ఉద్యమనేత కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. విగ్రహాం తొలగింపునకు నిరసనగా ప్రజాసంఘాలు, కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఏ సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని నేతలు ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేసి గన్నవరం పీఎస్‌కు తరలించారు. జై ఆంధ్ర ఉద్యమనేత కాకాని విగ్రహాం తొలగింపుపై మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాకాని గుర్తులే లేకుండా చేయాలనుకోవడం దారుణమని ఆయన అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేయాలని శివాజీ డిమాండ్ చేశారు. అర్ధరాత్రి ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేత అరెస్టు -
అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
ఆందోళన చేపట్టిన దళిత సంఘాలు ∙ విగ్రహానికి దొరబాబు క్షీరాభిషేకం పిఠాపురం రూరల్ : పిఠాపురం మండలం పి.తిమ్మాపురం ఎస్సీ కాలనీలోని అంబేడ్కర్ విగ్రహం చూపుడువేలును ఆదివారం తెల్ల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా విగ్రహంపై పేడను చల్లారు. విషయం తెలుసుకున్న దళిత సంఘ నేతలు ఆదివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. రెండు రోజుల వ్యవధిలో పిఠాపురం మండల పరిధిలోని పి.తిమ్మాపురం, చిత్రాడ గ్రామాల్లోని అంబేడ్కర్ విగ్రహాలపై దాడులు జరపడం దారుణమన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు, పిఠాపురం సీఐ ఉమర్, రూరల్ ఎస్సై వి.సుభాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి చూపుడు వేలుకు మరమ్మతులు చేయించారు. దళిత సంఘ నేతలు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎ¯ŒS వర్మలు పూలమాలలు వేసి అంబేడ్కర్‌కు ఘన నివాళులర్పించారు. దళిత సంఘ నేతలు ఆర్ఎస్.దయాకర్, గుబ్బల రాజు, దానం లాజర్‌బాబు, దారా వెంకట్రావు, మూరా కరుణ, బోను దేవ, పాల్గొన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలి అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని నియోజక వర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే అంబేడ్కర్‌కు అవమానాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా విగ్రహాల వద్ద పోలీసు పహరా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట పైలా సత్యనారాయణమూర్తి, పైలా నాయుడు, లోకారపు సతీష్ తదితరులు ఉన్నారు.