సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు వ్యవహారం ఇంకా చల్లబడలేదు. ఈ విషయంపై ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఈ విషయంపై అఖిలపక్ష నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశాయి. అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిశామని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసి డంపింగ్‌యార్డ్ పడేయడం యావత్ తెలంగాణ చూసిందన్నారు. అదే స్థలంలో తిరిగి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్‌మేదావి మాత్రమే కాదని కోట్లాది మంది ఆయనను దైవంగా పూజిస్తారని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని కూల్చివేశారన్నారు. వీటిని ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చమని ఆదేశించిన అధికారులపై కేసులు నమోదు చేయాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment