- ఆందోళన చేపట్టిన దళిత సంఘాలు ∙
- విగ్రహానికి దొరబాబు క్షీరాభిషేకం
అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
Published Sun, Dec 4 2016 11:01 PM | Last Updated on Fri, Aug 17 2018 8:12 PM
పిఠాపురం రూరల్ :
పిఠాపురం మండలం పి.తిమ్మాపురం ఎస్సీ కాలనీలోని అంబేడ్కర్ విగ్రహం చూపుడువేలును ఆదివారం తెల్ల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా విగ్రహంపై పేడను చల్లారు. విషయం తెలుసుకున్న దళిత సంఘ నేతలు ఆదివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. రెండు రోజుల వ్యవధిలో పిఠాపురం మండల పరిధిలోని పి.తిమ్మాపురం, చిత్రాడ గ్రామాల్లోని అంబేడ్కర్ విగ్రహాలపై దాడులు జరపడం దారుణమన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు, పిఠాపురం సీఐ ఉమర్, రూరల్ ఎస్సై వి.సుభాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి చూపుడు వేలుకు మరమ్మతులు చేయించారు. దళిత సంఘ నేతలు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎ¯ŒS వర్మలు పూలమాలలు వేసి అంబేడ్కర్‌కు ఘన నివాళులర్పించారు. దళిత సంఘ నేతలు ఆర్‌ఎస్.దయాకర్, గుబ్బల రాజు, దానం లాజర్‌బాబు, దారా వెంకట్రావు, మూరా కరుణ, బోను దేవ, పాల్గొన్నారు.
దోషులను కఠినంగా శిక్షించాలి
అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని నియోజక వర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే అంబేడ్కర్‌కు అవమానాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా విగ్రహాల వద్ద పోలీసు పహరా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట పైలా సత్యనారాయణమూర్తి, పైలా నాయుడు, లోకారపు సతీష్ తదితరులు ఉన్నారు.
Advertisement