గాంధీమార్గంలో నిరసన తెలిపితే అరెస్టులా | why should police arrest leaders those protest peacefully, questions srikanth reddy | Sakshi
Sakshi News home page

గాంధీమార్గంలో నిరసన తెలిపితే అరెస్టులా

Published Wed, Aug 19 2015 3:28 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

గాంధీమార్గంలో నిరసన తెలిపితే అరెస్టులా - Sakshi

గాంధీమార్గంలో నిరసన తెలిపితే అరెస్టులా

ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేస్తుంటే.. పోలీసులు వచ్చి నాయకులను ఎందుకు అరెస్టు చేస్తారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. ఎవరైనా తప్పుచేస్తే శిక్షించాలి గానీ.. గాంధీ మార్గంలో శాంతియుతంగా నిరసన తెలిపేవాళ్లను అరెస్టు చేయడం, వారిపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లో శ్రీకాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

  • పదే పదే చట్టాలను ఉల్లంఘించేవారిని వెనకేసుకు రావడం ఎంతవరకు సమంజసం
  • ఇసుక విషయంలో మహిళా ఎమ్మార్వోపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే, ఆమెను ఇంటికి పిలిపించి పంచాయతీ చేసే స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది
  • ప్రజాస్వామ్యంలో ఒకరు అధికారంలో, మరొకరు ప్రతిపక్షంలో ఉంటారు, అవి తారుమారు అవుతాయి.
  • అధికారులు మాత్రం అధికారంలో ఉన్నవాళ్లకు కొమ్ము కాస్తాం అంటే కురదదు
  • ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేస్తుంటే.. నాయకులను ఎందుకు అరెస్టు చేస్తారు?
  • రిషితేశ్వరి ఘటనలో దోషులను శిక్షించలేదు.
  • కడపలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నా ఆ విద్యా సంస్థ యజమాని ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి చర్య తీసుకోవట్లేదు
  • తప్పు ఎవరు చేసినా శిక్షించేలా పోలీసులు ఉండాలి
  • శాంతియుతంగా పోరాటం చేసేవాళ్లను అరెస్టులు చేయకపో్వడం మంచిది
  • అహింసాయుత నిరసనకు గాంధీజీ ఒక గుర్తింపు తెచ్చారు
  • కానీ ఇప్పుడు మాత్రం నాలుగు కేసులు పెట్టి, రౌడీషీట్ ఓపెన్ చేస్తామనడం కరెక్టు కాదు
  • ఇప్పటికైనా మారి.. తప్పులు చేసినవాళ్ల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
  • పుష్కరాల్లో వాళ్ల స్వార్థం కోసం 27 మంది మరణించినప్పుడు ప్రశ్నిస్తే.. శవరాజకీయం అంటారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement