G Srikanth Reddy
-
‘అబద్దాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు’
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు నాయుడు తన అబద్దాలను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయంపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 2 కోట్ల ఎకరాలు సేంద్రియ ప్రకృతి సాగులోకి తెస్తామని చంద్రబాబు చెప్పారని, కానీ సోసియో ఎకనామిక్ సర్వే ప్రకారం 61వేల హెక్టార్ల భూమినే మాత్రమే వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారని, ఎరువుల వాడకంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆరో స్థానంలో ఉందని, ఇలాంటప్పుడు 2 కోట్ల ఎకరాల్లో సేంద్రియ సాగు ఎలా చేస్తారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో పశువులను అమ్ముకుంటున్నారని, రాయలసీమలో రైతులు ఆత్మహత్యచేసుకుంటుంటే అక్కడేమో చంద్రబాబు ఫిడెల్ వాయిస్తున్నారని ఎద్దేవ చేశారు. చంద్రబాబు తన భాషతో దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నారని, ఆయన పబ్లిసిటి మనిషి అని దుయ్యబట్టారు. అంతర్జాతీయ వేదికపైనే అసత్యాలు చెప్పారన్నారు. ఎలక్షన్ పాలసీ, రహస్య ఎజెండాతోనే విదేశాలకు వెళ్లడం చంద్రబాబుకు అలవాటేనని తెలిపారు. అధికారంలోకి వస్తే ఇంటికి రూ 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో లక్షమంది మాత్రమే అర్హులైన వారున్నారని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి రూ.12వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై ఎదురుదాడి చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. దివంగత వైఎస్సార్ వారుసులమని, తప్పు చేసిన వారు ఎవరైనా వారిపై విచారణ చేయాలని కోరుతామన్నారు. 2016లో జరిగిన రక్షణ ఒప్పందంపై విచారణ జరిపించాలని తమ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాపై అనేక ఉద్యమాలు చేసింది వైఎస్సార్సీపీనే అని, హోదాను తాకట్టు పెట్టింది టీడీపీనే అని తెలిపారు. -
అబద్ధాలు చెప్పడంలో బాబుది ప్రపంచఖ్యాతి
-
'ఇక త్యాగాలు చేసే ఓపిక రాయలసీమ వాసులకు లేదు'
కడప: టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషాలు శనివారం కడపలో నిప్పులు చెరిగారు. ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తూ మరో ఉద్యమానికి ఉతమిస్తుందని వారు ఆరోపించారు. అప్పట్లో కృష్ణాజలాలు, రాజధానికి తరలించుకుపోయారని విమర్శించారు. ప్రస్తుతం తరలిస్తున్న సచివాలయ ఉద్యోగుల్లో రాయలసీమ ఉద్యోగుల వాటా ఎంతా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగుల వాటాపై శ్వేతపత్రం విడుదల చేయాలని వారు చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొత్త నియామకాల్లో రాయలసీమకు నష్టం జరగకుండా చూడాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఇక త్యాగాలు చేసే ఓపిక రాయలసీమ వాసులకు లేదని ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్ బాషా స్పష్టం చేశారు. -
'గొప్పలు చెప్పడం తప్ప బాబు చేసిందేమీ లేదు'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాచరిక పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఆరోపించారు. చంద్రబాబు పాలనను ప్రవాస భారతీయులు కూడా అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో చోటు చేసుకోంటున్న పరిణామాలపై యూఎస్‌లోని ఉన్నవారిలో ఆందోళన నెలకొందని చెప్పారు. రాజధాని వ్యవహారాన్ని చంద్రబాబు కుటుంబ వ్యవహారంలా భావిస్తున్నారని విమర్శించారు. టీడీపీ వాళ్లకు ఓ న్యాయం మిగతా పార్టీలకు మరో న్యాయం చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. గొప్పలు చెప్పడం తప్ప చంద్రబాబు చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రలోభాలు, వలసలను అందరూ తప్పుబడుతున్నారన్నారు. చంద్రబాబు అవినీతి గురించి యూఎస్‌లోనూ చర్చించుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు అమలు చేయలేదని ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ విషయాన్ని నిలదీస్తే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాతో సహా అన్నింటినీ ఢిల్లీలో తాకట్టు పెట్టారని చంద్రబాబుపై శ్రీకాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. -
అమెరికాలో 'సేవ్ డెమొక్రసీ'
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 'వాషింగ్టన్ డీసీ మెట్రో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' ఆధ్వర్యంలో ఆదివారం 'సేవ్ డెమొక్రసీ' సంఘీభావ సభ నిర్వహించారు. ఈ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లోపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజకీయ వ్యభిచారమని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లను కట్టడి చేయకుంటే వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, తాగునీటి ఎద్దడితోపాటు అవినీతి తదితర సమస్యలపై తమ పార్టీ ప్రజల తరపున నిలదీస్తుందని ఆయన స్పష్టం చేశారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. 'తిరుగులేని నాయకత్వ పటిమ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిజాయతీ గల ఎమ్మెల్యేగా తాను ప్రజల్లో ఉన్నానని... మీ ప్రలోభాలకు తలొగ్గి పార్టీ మారితే నీతిమాలిన ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతానని తనను పార్టీలోకి రావాలంటూ సంప్రదించిన టీడీపీ నేతలకు స్పష్టం చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పుస్తకాన్ని శ్రీకాంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ పుస్తకం చంద్రబాబు అవినీతి కుంభకోణాలకు అక్షర రూపమని పేర్కొన్నారు. తాము చెప్పేదే వేదం, చేసేదే అభివృద్ధి అంటూ మూర్ఖంగా ముందుకు పోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పక గుణపాఠం నేర్పుతారని టీడీపీ నేతలను శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ అడ్వైజర్ అండ్ మిడ్ అట్లాంటిక్ రీజియన్ ఇన్చార్జ్ వల్లూరు రమేష్ రెడ్డి, సెంట్రల్ రీజియన్ ఇన్ ఛార్జ్ శ్రీ సురేష్‌రెడ్డి బత్తినపట్లతోపాటు వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ కన్వీనర్ రత్నాకర్ పండుగాయల, స్టూడెంట్ వింగ్ లీడర్ సాత్విక్ రెడ్డి, పలు రాష్టాల నుంచి విచ్చేసిన తెలుగు ఎన్ఆర్ఐలు, విద్యార్థులు, వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలో మెట్రో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరును సురేష్‌రెడ్డి బత్తినపట్ల వివరించారు. అలాగే ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్న క్రమంలో పొందిన అనుభవాలను ఈ కార్యక్రమానికి హాజరైన వారితో పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కాగానే దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. -
ప్రాజెక్టులలో వేల కోట్ల అవినీతి
ప్రాజెక్టుల అంచనాలను విచ్చలవిడిగా పెంచేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం నాడు ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశంపై ప్రశ్న వేశారు. రూ. 10 కోట్ల అంచనాలతో చేపట్టాల్సిన పనులను రూ. 150 కోట్లకు పెంచారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. హంద్రీనీవా సుజల స్రవంతి అంచనాలను ఐదింతలు పెంచారని చెప్పారు. రూ. 45 కోట్ల పనులను రూ. 180 కోట్లకు ఇచ్చారని, అది కూడా కాంట్రాక్టరుకు ఎలాంటి అనుభవం లేకపోయినా.. కేవలం రాజకీయ ఒత్తిడితో నామినేషన్ మీద ఈ పనులు అప్పగించారని ఆయన చెప్పారు. 150 కోట్లతో పూర్తి చేయాల్సిన కుప్పం బ్రాంచి కెనాల్ ప్రాజెక్టుకు సింగిల్ టెండర్ అనుమతించారని, ముఖ్యమంత్రికి ఈ విషయం తెలుసో, తెలియదో గానీ.. మొత్తం అన్నింటి వివరాలు తెప్పించుకుంటే ఈ అంశంలో వేలకోట్ల అవినీతి బయటకు వస్తుందని చెప్పారు. అయితే, ప్రశ్న ఇంకా పూర్తి కాకుండానే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమాధానం ప్రారంభమైంది. దీనిపై వివాదం వచ్చినప్పుడు సింగిల్ సప్లిమెంటరీ అవకాశం అయినా శ్రీకాంత్‌రెడ్డికి ఇవ్వాలి కదా అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు తమ పార్టీ సభ్యులేనని, వాళ్లకు కూడా ఇంకా అవకాశం రాలేదని చెప్పారు. అయినా స్పీకర్ మాత్రం తదుపరి ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందిగా మంత్రికి సూచించారు. -
'ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదు'
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రజా సమస్యలు టీడీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. రైతులు, అంగన్వాడీలు, డ్వాక్రా గ్రూపుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవని విమర్శించారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇష్టారాజ్యంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారని చెప్పారు. సభలోనే అప్రజాస్వామికంగా వ్యవహరించడం ఏ మేరకు సబబు అని అధికార పార్టీని శ్రీకాంత్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాజధాని పేరుతో ఒకే చోట అధికారాన్ని కేంద్రీకరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై సభలో చర్చకు ఈ ప్రభుత్వం సహకరించడం లేదంటూ టీడీపీపై శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. -
'ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదు'
-
గాంధీమార్గంలో నిరసన తెలిపితే అరెస్టులా
ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేస్తుంటే.. పోలీసులు వచ్చి నాయకులను ఎందుకు అరెస్టు చేస్తారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎవరైనా తప్పుచేస్తే శిక్షించాలి గానీ.. గాంధీ మార్గంలో శాంతియుతంగా నిరసన తెలిపేవాళ్లను అరెస్టు చేయడం, వారిపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... పదే పదే చట్టాలను ఉల్లంఘించేవారిని వెనకేసుకు రావడం ఎంతవరకు సమంజసం ఇసుక విషయంలో మహిళా ఎమ్మార్వోపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే, ఆమెను ఇంటికి పిలిపించి పంచాయతీ చేసే స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది ప్రజాస్వామ్యంలో ఒకరు అధికారంలో, మరొకరు ప్రతిపక్షంలో ఉంటారు, అవి తారుమారు అవుతాయి. అధికారులు మాత్రం అధికారంలో ఉన్నవాళ్లకు కొమ్ము కాస్తాం అంటే కురదదు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేస్తుంటే.. నాయకులను ఎందుకు అరెస్టు చేస్తారు? రిషితేశ్వరి ఘటనలో దోషులను శిక్షించలేదు. కడపలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నా ఆ విద్యా సంస్థ యజమాని ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి చర్య తీసుకోవట్లేదు తప్పు ఎవరు చేసినా శిక్షించేలా పోలీసులు ఉండాలి శాంతియుతంగా పోరాటం చేసేవాళ్లను అరెస్టులు చేయకపో్వడం మంచిది అహింసాయుత నిరసనకు గాంధీజీ ఒక గుర్తింపు తెచ్చారు కానీ ఇప్పుడు మాత్రం నాలుగు కేసులు పెట్టి, రౌడీషీట్ ఓపెన్ చేస్తామనడం కరెక్టు కాదు ఇప్పటికైనా మారి.. తప్పులు చేసినవాళ్ల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం పుష్కరాల్లో వాళ్ల స్వార్థం కోసం 27 మంది మరణించినప్పుడు ప్రశ్నిస్తే.. శవరాజకీయం అంటారు -
'ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్న బాబు'
హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాప అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. పేద ప్రజలపై ప్రతీకారాన్ని తీర్చుకుంటూ వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జి.శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. దొంగదారిలోనైనా అధికారంలోకి రావాలని ఎన్నికల్లో హామీలు ఇచ్చారని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను సంపూర్ణంగా మాఫీ చేస్తామని చెప్పి... ఇప్పటి వరకు మాఫీ చేయాలేదన్నారు. ఆహార సబ్సిడీల కింద దాదాపు రూ. 4200 కోట్లు అవసరం కాగా... రూ. 2318 కోట్లు మాత్రమే విడుదల చేశారని చెప్పారు. రేషన్ కార్డులు, పింఛన్లపై తీవ్రంగా కోత విధిస్తున్నారన్నారు. పెన్షన్లకు రౌడీషీటర్లనే ఎంపిక చేస్తున్నారని... అలాగే పచ్చచోక్కాలకు మాత్రమే పెన్షన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తరతమ భేదం లేకుండా పేదలందరికి సంక్షేమ పథకాలు వర్తింప చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అలాకాకుండా ఒకటి, రెండు కారణాలు సాకుగా చూపి లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు ఏరివేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆధార్ కార్డు వద్దని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ లింకేజీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం ఉండకూడదన్న అభిప్రాయం చంద్రబాబుకు స్పష్టంగా కనబడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మంగళం పలికే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుందన్నారు. రాష్ట్రంలో 5 నెలలుగా వేల టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారని... ఆ స్మగ్లింగ్‌లో టీడీపీ కార్యకర్తలు చాపకింద నీరులా పాలుపంచుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని రౌడీ రాజ్యం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల ఎంపిక కమిటీల్లోకి సామాజిక కార్యకర్తల ముసుగులో రౌడీలు వస్తున్నారన్నారు. అలిపిరి కేసులో కోర్టు దోషులుగా పేర్కొన్న ముగ్గురిలో ఒకరు టీడీపీ కార్యకర్తే అని ఆయన వివరించారు. కోర్టు దోషిగా పేర్కొన్న నర్సింహారెడ్డి.... చంద్రబాబు ఫొటోలతో ప్రచారంలో పాల్గొన్నారన్నారు. ఈ రోజుకు కూడా నరసింహారెడ్డి టీడీపీ కార్యకర్తగానే కొనసాగుతున్నారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ప్రజా సంక్షేమానికి చంద్రబాబు పూర్తి వ్యతిరేకని ఆరోపించారు. సంక్షేమానికి తాను వ్యతిరేకమంటూ చంద్రబాబు గతంలో రాసుకున్న మనసులోమాట పుస్తకంలో వివరించిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రజలకు సబ్సిడీలు కూడా అవసరం లేదని ఆ పుస్తకంలోనే బాబు వివరించారని చెప్పారు. గతంలో ఆ రోజు చెప్పినట్టుగానే బాబు ఇప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. -
బాబు ప్రాజెక్టులు కట్టకే ఈ దుస్థితి: గడికోట
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించకుండా నిర్లక్ష్యం చేసినందువల్లే ఈ రోజు కృష్ణా నదీ జలాల కేటాయింపుల విషయంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇలాంటి తీర్పు నిచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని, ప్రధానినీ, రాష్ట్రపతినీ తానే ఎంపిక చేశానని చెప్పుకునే చంద్రబాబు ఆయన హయాంలో కర్ణాటకలో చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను ఎందుకు ఆపలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రాజెక్టులు నిర్మిస్తుంటే బాబు ముఖ్యమంత్రిగా ఉండి వారికి సహకరించారన్నారు. బాబు పాలనలో అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆయనకు అనుకూలంగా ఉండే ఓ పత్రికతో పాటు మరిన్ని పత్రికలు వార్తలు రాశాయని, అవి పూర్తయితే తుపాను వస్తేనే ఇక మన ప్రాజెక్టులకు నీళ్లు అన్నట్లుగా కథనాలు కూడా వచ్చాయన్నారు. బాబు గాలేరు-నగరి, హంద్రీనీవా, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను నిర్మించి ఉంటే మనం కృష్ణా ట్రిబ్యునల్ నుంచి కేటాయింపులు పొందడానికి ఆస్కారం ఉండేదన్నారు. బాబు హయాంలో నిర్మించిన అల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519 నుంచి 524 అడుగుల నీటిని పెంచుకోవడానికి ఇపుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వటంతో రాష్ట్ర రైతుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ సీఎం కాగానే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో ప్రారంభించిన తెలుగుగంగ పథకాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తే వైఎస్ దానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి పూర్తి చేశారని అందువల్లే ఆ ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ ఇపుడు 33 టీఎంసీల నీటిని కేటాయించిందన్నారు. -
అసెంబ్లీ భేటీతో డ్రామా బట్టబయలు
* సమైక్య తీర్మానానికి జేఏసీ నేతలు ఒత్తిడి చేయాలి: వైఎస్సార్సీపీ * కిరణ్‌ను, రాజకీయ పార్టీలను గట్టిగా నిలదీయాలి * అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాలి * ఆ తర్వాత మా రాజీనామాలు ఆమోదింపజేసుకుంటాం * రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే సమర్థుడు కావాలి * అలాంటి నాయకుడు జగనేనని ప్రజలంతా నమ్ముతున్నారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభను తక్షణం సమావేశపరచి సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ‘‘కేంద్రం కేబినెట్ నోట్‌ను సిద్ధం చేసే లోపే.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మా నం ఆమోదించాలి. దాన్ని కేంద్రానికి పంపి విభజన ప్రక్రియను నిలిపేయించాలి’’ అని కోరింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలంటూ ముఖ్యమంత్రిని, ఇతర రాజకీయ పక్షాలను సీమాంధ్ర జేఏసీ నేతలు గట్టిగా నిల దీయాలని కోరింది. వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం తరఫున నేతలు భూమా శోభానాగిరెడ్డి, కె.శ్రీనివాసులు, జి.శ్రీకాంత్‌రెడ్డి, బి.గుర్నాథరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌లను స్వయంగా కలసి శాసనసభను సమావేశపరచాలని విన్నవిస్తామన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ మేరకు లేఖ రాయనున్నట్టు తెలిపారు. సమైక్య తీర్మానం ఆమోదం పొందాక తమ రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలని నిర్ణయించినట్టు శోభ స్పష్టం చేశారు. ‘‘అసెంబ్లీని సమావేశపరిస్తే విభజనపై కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆడుతున్న డ్రామాలు బయటపడతాయి. సమైక్య రాష్ట్రం కోసం ఎవరు నిజాయితీగా పోరాడుతున్నారో, ఎవరు దొంగ లో తేటతెల్లమవుతుంది’’ అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం పెట్టాలని ఇటీవలి వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో కూడా తీర్మానించిన విషయాన్ని శోభ ప్రస్తావించారు. రాష్ట్ర విభజన రాజకీయపరమైన నిర్ణ యం కాబట్టి అసెంబ్లీని సమావేశపరచాలంటూ కిరణ్‌ను నిలదీయాలని సీమాంధ్ర జేఏసీ నేతలకు సూచించారు. ‘‘ఎందుకంటే లక్షల మంది ఉద్యోగులు జీతాలు వదులుకుని, తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. నేతలు మాత్రం అధికారాన్ని అనుభవిస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. అసెంబ్లీని సమావేశపరిచేలా కిరణ్‌పై, విభజన లేఖను వెనక్కి తీసుకునేలా బాబుపై, సమైక్య తీర్మానం ఆమోదం పొందేలా కాంగ్రెస్, టీడీపీలపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. విభజనను ఆపడం చేతగాని నేతలు విభజనపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ప్రజలను మోసగిస్తోందని శోభ దుయ్యబట్టారు. ‘‘విభజన ప్రక్రియను కొనసాగిస్తున్నామని, కేబినెట్ నోట్ సిద్ధమవుతోందని కేంద్ర మంత్రులు ఒకవైపు అధికారికంగా ప్రకటిస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ నేతలు, కిరణ్ మాత్రం రాజీనామాలు చేయొద్దని చెబుతూ వస్తున్నారే తప్ప విభజన ప్రక్రియను ఆపే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఢిల్లీలో చెప్పిన కిరణ్, విభజన ప్రకటన తర్వాత 10 రోజుల పాటు ముఖం చాటేశారు. ‘సీఎం కనిపించడం లేదు’ అంటూ పత్రికా ప్రకటనలు వచ్చాక మీడియా ముందుకొచ్చి తాను సమైక్యవాదినంటూ కొత్త పల్లవి పాడుతున్నారు. కేంద్రాన్ని గట్టిగా ఎదిరించి, తమ పార్టీ అధిష్టానాన్ని నిలదీసి విభజనను ఆపగల స్థాయిలో ఉండి కూడా ఆ రోజు అడ్డుకోకుండా ఇప్పుడీ డ్రామాలేమిటి?’’ అంటూ ధ్వజమెత్తారు. విభజన జరగనీయబోమంటూ కిరణ్, కేంద్ర మంత్రులు, మంత్రులు, ఎంపీలంతా కలసి ప్రజల్ని మభ్యపెట్టారని మండిపడ్డారు. కిరణ్ ముఖ్యమంత్రిలా వ్యవహరించడంలేదన్నారు. ఆయన డ్రామాలు ప్రజలకు అర్థం కావడం లేదనుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం చేతగాదని కిరణ్, కేంద్ర మంత్రులు ఆ రోజే చెప్పి ఉంటే ప్రజలే ఆపగలిగి ఉండేవారన్నారు. నిజాయితీగా పోరాడుతున్నది వైఎస్సార్ సీపీనే సమైక్యాంధ్రకు మద్దతుగా ముందుగా స్పందించిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెసేనని శోభ గుర్తు చేశారు. ‘‘ఏపీ ఎన్జీవోలు డిమాండ్ చేయక ముందే మేం రాజీనామాలు చేశాం. ఇంతవరకూ ఏ పార్టీ అధ్యక్షుడూ రాజీనామా చేయలేదు. కానీ సమైక్యోద్యమానికి మద్దతుగా మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. అంతేగాక సమైక్యాంధ్రకు మద్దతుగా వారిద్దరూ వారం రోజుల పాటు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఇన్ని చేసిన మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఏ పార్టీకీ లేదు’’ అని ఆమె స్పష్టం చేశారు.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటే సమర్థుడైన నాయకుడు కావాలన్నారు. అలాంటి నాయకుడు జగనేనని ప్రజలంతా నమ్ముతున్నారని చెప్పారు. రెండు పార్టీలు ద్రోహులు రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్ అయితే, లేఖలిచ్చి అందుకు సంపూర్ణ సహకారం అందించింది చంద్రబాబని శోభ దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ సీమాంధ్రకు తీరని ద్రోహం తలపెట్టాయని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు టీడీపీలోని తెలంగాణ నేతలతో ఒకమాట, సీమాంధ్ర నేతలతో మరో మాట మాట్లాడిస్తున్నారు. పైగా ఢిల్లీకి తీసుకెళ్లి డ్రామాలాడిస్తున్నారు. ఇక్కడేమో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చామంటారు. విభజనకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇవ్వడం వల్లే ఆ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలతో అంటారు. కాబట్టి తెలంగాణలో అదే నినాదంతో వెళ్లి ఓట్లు సంపాదించాలని వారికి చెబుతారు. సీమాంధ్రకు వచ్చి, సమైక్యోద్యమంలో ముందున్న మాపై పడి ఏడుస్తున్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ దొందూ దొందే’’ అని ధ్వజమెత్తారు.