కడప: టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషాలు శనివారం కడపలో నిప్పులు చెరిగారు. ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తూ మరో ఉద్యమానికి ఉతమిస్తుందని వారు ఆరోపించారు. అప్పట్లో కృష్ణాజలాలు, రాజధానికి తరలించుకుపోయారని విమర్శించారు.
ప్రస్తుతం తరలిస్తున్న సచివాలయ ఉద్యోగుల్లో రాయలసీమ ఉద్యోగుల వాటా ఎంతా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగుల వాటాపై శ్వేతపత్రం విడుదల చేయాలని వారు చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొత్త నియామకాల్లో రాయలసీమకు నష్టం జరగకుండా చూడాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఇక త్యాగాలు చేసే ఓపిక రాయలసీమ వాసులకు లేదని ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, అంజాద్ బాషా స్పష్టం చేశారు.