జిల్లాలో రెండవ దశ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, ఎస్పీ సెంథిల్కుమార్ తెలిపారు. గురువారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో లోకేష్ కుమార్, సెంథిల్కుమార్ మాట్లాడుతూ... రెండు దశ పోలింగ్కు 5 వేల మందితో భద్రత సిబ్బందిని వినియోగించనున్నట్లు చెప్పారు.
జిల్లావ్యాప్తంగా 34 వేల మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. జిల్లాలో 467 గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా, భద్రత పెంచినట్లు చెప్పారు. అందుకోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఎవరైన రెండో సారి ఓటు వేసేందుకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ రోజున నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తామన్నారు.