‘దివీస్’ అనుమతులు రద్దు చేయాలి
తీరప్రాంత ప్రజల జోవనోపాధికి హాని కలిగించే దివీస్ మందుల పరిశ్రమ మంజూరు చేసిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ప్రకాశం రోడ్డులోని సాదీఖానాలో దివీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ, సీపీఐ(ఎంఎల్), వ్యవసాయ కూలీ సంఘం, గిరిజన సంఘం, బాధిత గ్రామాలకు చెంది
తుని : తీరప్రాంత ప్రజల జోవనోపాధికి హాని కలిగించే దివీస్ మందుల పరిశ్రమ మంజూరు చేసిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ప్రకాశం రోడ్డులోని సాదీఖానాలో దివీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ, సీపీఐ(ఎంఎల్), వ్యవసాయ కూలీ సంఘం, గిరిజన సంఘం, బాధిత గ్రామాలకు చెందిన పెద్దలు హాజరయ్యారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దువ్వా శేషు బాబ్జి మాట్లాడుతూ దానవాయిపేట పంచాయతీ పరిధిలో దివీస్ లాబొరిటీస్ నిర్మాణం చేపట్ట కూడదని హైకోర్టు స్టేటస్ కో జారీ చేసినా పట్టించుకోకుండా పనులు చేపడుతున్నారన్నారు. తక్షణమే పనులు నిలిపివేయాలన్నారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా కొనసాగిస్తున్న 144 సెక్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యవర్గం సభ్యుడు బుగతా బంగార్రావు, రాష్ట్ర రైతు కూలి సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ దివీస్ పరిశ్రమను తరలించాలని ఈ నెలాఖరున సంతకాల సేరకణ చేపట్టి సీఎం, గవర్నర్‌లకు అందజేస్తామన్నారు. రెవెర్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. బాధిత గ్రామాల నుంచి వచ్చిన నాయకులు మట్ల ముసలయ్య, తొండంగి మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీవిశ్వేశ్వరరావు ప్రజల కష్టాలను వివరించారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేసుకట్ల సింహాచలం, రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి మాను లచ్చ బాబు, కె. జనార్దన్, రాపా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.