అధికారుల తీరుపై న్యాయపోరాటం చేస్తా
అధికారుల తీరుపై న్యాయపోరాటం చేస్తా
Published Mon, Feb 13 2017 10:58 PM | Last Updated on Fri, Sep 28 2018 4:30 PM
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
దివీస్ బాధిత రైతులు చేపట్టిన దీక్షకు మద్దతు
తొండంగి : దివీస్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తానని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులకు, ప్రజలకు భరోసా ఇచ్చారు. సాగు భూముల్లో దివీస్ యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందిం చకపోవడం దారుణమన్నారు. కొత్తపాకలు గ్రామంలో దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొత్తపాకలు, పంపాదిపేట, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే రాజా పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, నాయకులు కొయ్య శ్రీనుబాబు, పేకేటి సూరిబాబు, మద్దకూరి చిన్నబ్బులు తదితరులు సోమవారం మద్దతు పలికారు. దీక్షలో కూర్చున రైతులు, మహిళలు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వాశేషుబాబ్జితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దివీస్ యాజమాన్యం బలప్రయోగానికి దిగుతుందన్నారు. బాధిత రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకూ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.
ప్రజల ఆరోగ్యం గుర్తురాలేదా?
ప్రజల ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో యనలమ ఫౌండేషన్‌ను స్థాపించామని చెబుతున్న ఆర్థిక మంత్రి యనమలకు కోన ప్రజలు, రైతుల ఆరోగ్యం గుర్తురాలేదా అని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. దీర్ఘకాలం ఈ ప్రాంత ప్రజల మద్దతుతో రాజకీయంగా ఎదిగిన యనమల ఇప్పుడా ఆ ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారేలా వ్యవహరించడం తగదన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, నాయకులు మద్దుకూరి వెంకటరామయ్య చౌదరి, మేరుగు ఆనందహరి, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, పెరుమాళ్లలోవరాజు, కాలిన అప్పారావు, కొంజెర్ల వీరబ్బాయి, మేడిశెట్టి సుబ్బారావు, వెల్నాటి బుజ్జి, కందాబాబ్జి, చొక్కా కోదండం, చొక్కా రామచంద్రరావు, గాబురాజు, మేడిÔð ట్టి ఈశ్వరరావు, మేడిశెట్టి దారబాబు ఉన్నారు.
రైతులను అడ్డుకున్న పోలీసులు
దివీస్ చేపట్టిన అక్రమ నిర్మాణాలు జరిగిన ప్రాంతానికి బాధిత రైతులు, ప్రైవేటు సర్వేయర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి తదితరులు వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో కొంత వాగ్వివాదం జరిగింది. దీంతో శాంతియుతంగా చేపట్టిన దీక్షల నేపథ్యంలో రైతులంతా చట్టపరంగానే పోరాటం చేస్తామంటూ దీక్షాబిరానికి చేరుకున్నారు. బాధిత రైతులు లేకుండా కేవలం గంటలోనే ఆదివారం అధికారులు సర్వే పూర్తి చేసి ఎటువంటి ఆక్రమణలు దివీస్ యాజమాన్యం నిర్మించలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వాశేషుబాబ్జి అన్నారు. బాధిత రైతులకు న్యాయం జరిగేంత వరకూ తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేఎస్ శ్రీనివాసరావు, జిల్లా నాయకుడు కె.సింహాచలం, కొవిరి అప్పలరాజు, సీఐటీయూ మండల నాయకుడు బద్ది శ్రీను ఉన్నారు.
Advertisement
Advertisement