Published
Sat, Sep 10 2016 8:08 PM
| Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
నెలాఖరులో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు
సూర్యాపేట : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల చివరి వారంలో సూర్యాపేట పట్టణంలో మూడు రోజుల పాటు జరగనున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని ఎంవీఎన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర ఐదు నెలల పాటు 5,500 కిలో మీటర్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో జరుగుతుందని, ఈ కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మూడెకరాల పంపిణీ, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇప్పటికి సక్రమంగా అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వం ఏకమొత్తంలో రైతు రుణమాఫీ చేయాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు స్వాగతిస్తున్నామని, ప్రజల అభిప్రాయాలకనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో విభజన జరగాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం డివిజన్ నెమ్మాది వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి కోట గోపి, జిల్లా కమిటీ సభ్యురాలు బొప్పని పద్మ, వెంపటి గురూజీ, పల్లేటి వెంకన్న, ఎల్గూరి గోవింద్, మట్టిపల్లి సైదులు, వెంకన్న, బొలిశెట్టి యాదగిరిరావు, సత్యం, మామిడి మరియమ్మ, మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.