Published
Mon, Aug 22 2016 7:37 PM
| Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
సమస్యల పరిష్కారంలో విఫలం
సూర్యాపేటటౌన్ : పేదలు, వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట్రాములు విమర్శించారు. సోమవారం స్థానిక గాంధీపార్కులో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల ముందు పేదలకు, వ్యవసాయ కార్మికులకు అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, బచ్చలకూరి రాంచరణ్, నల్లమేకల అంజయ్య, శేఖర్, చింతలచెర్వు భిక్షం, సాంబయ్య, బాబు, నర్సిరెడ్డి, బండారు నాగయ్య, రేణుక, పద్మ, సైదులు, బిక్షం, లింగానాయక్, రాంబాబు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.