అమరవీరుల స్ఫూర్తితో పోరాడాలి | Inspired by the fight martyrs | Sakshi
Sakshi News home page

అమరవీరుల స్ఫూర్తితో పోరాడాలి

Aug 28 2016 8:06 PM | Updated on Aug 13 2018 8:12 PM

అమరవీరుల స్ఫూర్తితో పోరాడాలి - Sakshi

అమరవీరుల స్ఫూర్తితో పోరాడాలి

సూర్యాపేట మున్సిపాలిటీ : విద్యుత్‌ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఎం డివిజన్‌ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

సూర్యాపేట మున్సిపాలిటీ : విద్యుత్‌ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఎం డివిజన్‌ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎంవీఎన్‌ భవన్‌లో విద్యుత్‌ పోరాట అమరవీరుల వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాలు పోరాటం చేశాయని.. ఆ పోరాటంలో బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి, రామకృష్ణ వంటి నాయకులను కాల్పులు చేసి చంపిందన్నారు. నేడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్‌ చార్జీలను పెంచి పేద,మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్‌ పోరాట అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, గురూజీ, మట్టిపల్లి సైదులు, కొలిశెట్టి యాదగిరిరావు, పెంటయ్య, రాంచరణ్, మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement