Published
Tue, Aug 9 2016 6:28 PM
| Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలి
సూర్యాపేట : పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులకు ఇవ్వాలని సీపీఎం డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు నూకల మధుసూదన్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి కోట గోపిలు డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ సమావేశం ఎంవీఎన్ భవన్‌లో వల్లపుదాసు సాయికుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కాకముందే అధికార పార్టీ కౌన్సిలర్లు పంచుకొని అమ్ముకుంటున్నారని ప్రచారం జోరుగా సాగుతుందన్నారు. అనేకమంది ఇళ్లు లేక ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో నివసిస్తున్నారన్నారు. దరఖాస్తులు గతంలో పెట్టిన వారిని పరిశీలించి అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పెంటయ్య, భాస్కర్, వెంకన్న, లక్ష్మయ్య, వెంకటరెడ్డి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.