ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
Published Mon, Aug 8 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
ఆరెగూడెం(చిట్యాల)
మండలంలోని పెద్దకాపర్తి గ్రామ పంచాయతీ పరిధి ఆరేగూడెం గ్రామంలో సోమవారం ఉదయం ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన బల్వరీ సోమనర్సయ్య(50) తొమ్మిదేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం మండలంలోని ఆరేగూడెం గ్రామానికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం కొంత అప్పు చేసి గ్రామంలోనే ఇంటిని నిర్మించుకుని, మూడెకరాల వ్వవసాయ భూమిని కొనుగోలు చేసి వ్వవసాయం చేసుకుంటున్నాడు. ఇటీవల పొలంలో బోరు వేయగా నీరు పడలేదు. దీనికి తోడు గతంలో చేసిన సుమారు ఐదు లక్షల అప్పులతో ఇబ్బందులు పడుతూ మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం తన వ్వవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. గుర్తించిన స్థానికులు సోమనర్సయ్యను అస్పత్రికి తరలించే లోపు మృతిచెందాడు. మృతుడికి భార్య, వివాహం అయిన కూతురు, కుమారుడు ఉన్నారు.
Advertisement
Advertisement