రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, చీరాల : ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వీరు వేటపాలెం రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. . చీరాలలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో వీరు బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నారు.
మృతులను ఇంకొల్లు మండలం తిమ్మసముద్రానికి చెందిన బత్తుల సాయిసందీప్ (24), గుంటూరు జిల్లా మోదుకూరుకు చెందిన భోగిరెడ్డి మోనిక (23)గా పోలీసులు గుర్తించారు. అయితే వీరిద్దరూ మంగళవారం విజయవాడ వెళ్లి పెళ్లి చేసుకుని చీరాల వచ్చి ఇంటికి వెళ్లే ధైర్యం లేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కాగా చదువుతో పాటు ఎప్పుడు చలాకీగా ఉండే సాయి సందీప్, మోనిక ఆత్మహత్య చేసుకోవటంతో సహ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.