monika
-
రాజ్యంకోసం మహిళ పోరాటం
మోనికా రెడ్డి ప్రధాన పాత్రలో రాకేష్ రెడ్డి యాస దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయింది. సుధ క్రియేషన్స్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అంజిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, షేడ్స్ స్టూడియో ఫౌండర్ దేవీ ప్రసాద్ బలివాడ క్లాప్ ఇచ్చారు. మోనికా రెడ్డి మాట్లాడుతూ– ‘‘పీరియాడిక్ మైథలాజికల్‌గా రూపొందనున్న చిత్రమిది. కథ అంతా నా పాత్ర చుట్టూ తిరుగుతుంది’’ అన్నారు. ‘‘రాజ్యం కోసం ఓ మహిళ ధైర్యసాహసాలతో ఎలా పోరాడింది? అన్నదే ఈ చిత్రం కథాంశం’’ అన్నారు రాకేష్ రెడ్డి యాస. ‘‘నయనతార, అనుష్కగార్లలా మోనికకు మంచి పేరు రావాలి’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భాస్కర్ రెడ్డి. -
షో నుంచి తప్పుకున్న నటి.. నిర్మాతలపై సంచలన ఆరోపణలు!
హిందీలో పాపులర్ షో అయినా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను కూడా సంపాదించుకుంది తారక్ మెహతా కా ఉల్టా చష్మా. అయితే ఈ షో నుంచి నటీనటులు ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఇప్పటికే మోనికా భదోరియా, ప్రియా అహుజా, శైలేష్ లోధా ఈ షో నుంచి తప్పుకోగా.. తాజాగా మరో నటి దిశా వకాని కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తాజాగా దిశా వకానీ ఉల్టా చష్మా నుంచి నిష్క్రమించడంపై మోనికా సంచలన ఆరోపణలు చేసింది. (ఇది చదవండి: పెళ్లికి ముందే వరుణ్‌కు లావణ్య కండీషన్.. మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్!) దిశా వకానీని కూడా వేధించారు: మోనికా తనలాగే దిశా వకానికి వేధింపులు ఎదురై ఉండవచ్చని మోనికా కామెంట్స్ చేసింది. దిశా వకాని షో నుంచి తప్పుకోవడంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. దిశా వకానీ షోకు తిరిగిరాలేదని ఆమెకు డబ్బులు కూడా చెల్లించకపోయి ఉండొచ్చని తెలిపింది. అందువల్లే తాను కూడా వేధింపులు భరించలేకే షో నుంచి తప్పుకుని ఉంటుందని మోనికా వ్యాఖ్యానించింది. అయితే గతంలో ఈ షో నిర్మాతలపై మోనికా భదోరియా సంచలన కామెంట్లు చేసింది. ఆ షోలో పనిచేస్తున్నప్పుడు తనను హింసించారని.. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తనతో వెట్టి చాకిరి చేయించుకున్నారు అని కానీ చివరకు రావాల్సిన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో మోనికా భదోరియా.. బావ్రీ పాత్రతో మెప్పించింది. అయితే ఇప్పటికే ఈ షో నిర్మాతలు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని మరో నటి జెన్నిఫర్ మిస్త్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. నరకం అనుభవించా: మోనికా భదోరియా ఈ నటి తన షో సెట్లో నరకం అనుభవించానని మోనికా చెప్పుకొచ్చింది. అయితే చివరకు తల్లి క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నప్పుడు కూడా తనకు ఎలాంటి మద్దతు లభించలేదని పేర్కొంది. రాత్రంతా ఆస్పత్రిలో అమ్మ వద్దే ఉండేదాన్ని.. వారంతా కావాలనే షూటింగ్ కోసం ఉదయాన్నే పిలిచేవారని తెలిపింది. నా మానసిక స్థితి బాగా లేకున్నా.. రమ్మని బలవంతం చేసేవారని.. ఎదురు ప్రశ్నించలేక షూట్ కోసం వెళ్తే అక్కడ కూడా నన్ను వెయిట్ చేయించేవారు అంటూ కన్నీరు పెట్టుకుంది నటి. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!) -
Monika Shergill: క్వీన్ ఆఫ్ కంటెంట్
స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో సక్సెస్ అంటే సాధారణ విషయం కాదు. ఏ నిమిషానికి ఏ ట్రెండ్ వస్తుందో తెలియదు. అక్కడి ట్రెండ్ ఇక్కడ వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. సక్సెస్‌కు సవాలక్ష కారణాలు ఉంటాయి. అయితే అవేమీ చీకట్లో దాక్కున్నవి కావు. వెదుక్కుంటూ వెళితే ముందుకు వచ్చి పలకరిస్తాయి. మోనిక చేసిన పని అలా వెదుక్కుంటూ వెళ్లడమే! ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా ప్రయాణం మొదలు పెట్టిన మోనిక షేర్గిల్ ‘వైస్ ప్రెసిడెంట్, కంటెంట్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా’ స్థాయికి చేరుకోవడం అదృష్టం కాదు...తాను పడిన కష్టం. ఆ కష్టమే మోనిక షేర్గిల్ను ‘హై అండ్ మైటీ–50 పవర్పీపుల్’ జాబితాలో చేర్చింది.... నెట్‌ఫ్లిక్స్ ఇండియా స్పీడ్ అందుకొని వ్యూ అవర్స్, రెవెన్యూ పెంచుకొని ప్రపంచస్థాయిలో సక్సెస్ సాధించింది. ‘దీనికి కారణం?’ అనే ప్రశ్నకు ఏకైక జవాబు నలభై తొమ్మిది సంవత్సరాల మోనిక షేర్గిల్. మోనిక చొరవ వల్ల ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ప్రపంచానికి, ప్రతిభావంతులకు మధ్య ‘నెట్‌ఫ్లిక్స్’ను వారధిగా మలచడంలో మోనిక ఘన విజయం సాధించింది. నెట్‌ఫ్లిక్స్ కోసం కంటెంట్‌ను ఎంపిక చేసుకోవడంలో మోనిక అనుసరించే ప్రమాణాల విషయానికి వస్తే...క్రైమ్ షోలలోని సంచలన ధోరణి కనిపించదు. సబ్జెక్ట్‌లో ఉండే బలమే ప్రధాన ప్రమాణం అవుతుంది. దీనికి ఉదాహరణ ఆస్కార్ పురస్కారం గెలుచుకున్న డాక్యుమెంటరీ ఫిల్మ్... ది ఎలిఫెంట్ విష్పరర్స్. ‘‘ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌లో ఎప్పుడూ రిస్క్ పొంచి ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచిని కచ్చితంగా పసిగట్టడం కష్టమే. కరోనా కల్లోల సమయం ప్రేక్షకుల ఆలోచనధోరణిలో మార్పు తీసుకువచ్చింది. కంటెంట్ విషయంలో తమ భాష, ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కంటెంట్‌పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ‘ఏది నిజం? ఏది కల్పన?’ అనే విషయంలో వారికి స్పష్టత ఉంది. వ్యాపార విజయం అనేది వారికి సంబంధం లేని విషయం. వారి దృష్టి మొత్తం కథ పైనే ఉంటుంది’’ అంటున్న మోనిక విజయాల గురించి ఆనందించడమే కాదు నిరాశపరిచిన కంటెంట్ విషయంలో సమీక్ష చేసుకోవడంలో ముందుంటుంది. రొమాంటిక్ హిందీ–కామెడీ ఫిల్మ్ ‘మీనాక్షి సుందరేశ్వర్’ నిరాశపరిచింది. దీనికి కారణం సరిౖయెన నటీనటులను ఎంపిక చేసుకోకపోవడం. కథ సరిగ్గా ఉండగానే సరిపోదు కాస్టింగ్ కూడా సరిగ్గా ఉండాలని, ఎక్కడా రాజీపడకూదనే గుణపాఠాన్ని ఆ చిత్రం నుంచి నేర్చుకుంది మోనిక. పోస్ట్–పాండమిక్ ఆడియెన్స్ ఇంటర్నేషనల్ స్టోరీలను ఇష్టపడుతున్నారు. జర్మన్ షో ‘డార్క్’ మనదేశంలో హిట్ కావడం దీనికి నిదర్శనం. ఆ సమయంలో... ‘వేరే దేశం కథలు మన దగ్గర విజయం సాధించినప్పుడు, మన దేశంలోని ఒక ప్రాంతానికి చెందిన కథలు మరొక ప్రాంతంలో ఎందుకు విజయం సాధించవు’ అంటూ ఆలోచన చేసింది మోనిక. తాను నమ్మింది ‘కాంతార’ హిందీ వెర్షన్ విజయంతో నిజం అయింది. సక్సెస్ ముఖ్యమే కాని వేలం వెర్రి జోలికి వెళ్లదు మోనిక. ‘కొరియన్ భాషలో గ్లోబల్ బ్రేక్ఔట్ షోలు ఉన్నాయి. అలా మనం కూడా సాధించాలి అనుకున్నంత మాత్రాన అది సాధ్యపడదు. ఆ షోలో ఉన్న వినూత్నమైన ఐడియా, దాని చుట్టూ ముడిపడి ఉన్న ఎన్నో అంశాలు గ్లోబల్ బ్రేక్‌ఔట్‌కు కారణం కావచ్చు. మనదైన ఆలోచన చేసి విజయం సాధించాలిగానీ ఫలాన షోలాగా ఉండాలి అని ప్రయత్నిస్తే విజయం మాట ఎలా ఉన్నా నిరాశ మాత్రమే మిగులుతుంది. ర్యాట్రేస్ ఇష్టపడను. ఆ రేసులో పడితే ఆయాసమే మిగులుతుంది తప్ప ఆలోచన మిగలదు’ అంటోంది మోనిక. కొంతకాలం క్రితం ట్రెండ్స్‌కు నిర్దిష్టమైన టైమ్ అంటూ ఉండేది. అర్థం చేసుకోవడానికైనా, అందిపుచ్చుకోవడానికైనా అది బాగా సరిపోయేది. కాని ఇప్పటి పరిస్థితి వేరు. ట్రెండ్స్ వేగంగా మారుతున్నాయి. ఒక దేశంలో ట్రెండ్‌గా ఉన్నది ఇక్కడ వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు....ఇలాంటివి ఎన్నో దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళుతుంది మోనిక షేర్గిల్. అందుకే ఆమె పేరు ముందు ‘క్వీన్ ఆఫ్ కంటెంట్’ అనే విజయధ్వజం రెపరెపలాడుతోంది. -
Boxing Tourney: ‘పసిడి’కి పంచ్ దూరంలో...
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో నలుగురు భారత బాక్సర్లు పసిడి పతకానికి పంచ్ దూరంలో నిలిచారు. పురుషుల విభాగంలో ఆశిష్ (75 కేజీలు), గోవింద్ (48 కేజీలు), వరీందర్ సింగ్ (60 కేజీలు)... మహిళల విభాగంలో మోనిక (48 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో ఆశిష్ 5–0తో ముస్కితా (ఇండోనేసియా)పై, గోవింద్ 4–1తో ఎన్గుయెన్ లిన్ ఫుంగ్ (వియ త్నాం)పై నెగ్గగా... వరీందర్‌కు తన ప్రత్యర్థి అబ్దుల్ (పాలస్తీనా) నుంచి ‘వాకోవర్’ లభించింది. మోనిక 5–0తో ట్రాన్ థి డియెక్ కియు (వియత్నాం)పై గెలిచింది. భారత్‌కే చెందిన అమిత్ (52 కేజీలు), భాగ్యబతి (75 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. చదవండి: IPL 2022: కమిన్స్ కమాల్.. ముంబై ఢమాల్.. తిలక్ కొట్టిన సిక్సర్ మాత్రం హైలైట్! -
భీమ్లా నాయక్ బ్యూటీ ‘మౌనికా రెడ్డి’ (ఫొటోలు)
-
ఏదైనా సినిమానే
‘‘పెద్ద సినిమా చిన్న సినిమా అన్న తేడా లేదు. అన్ని సినిమాలకు ఒకేలా వర్క్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా సినిమానే. ఇప్పటి వరకు దాదాపు 18 సినిమాలకు వర్క్ చేశాం. అన్ని సినిమాలకు ఒకేలా కష్టపడ్డాం. కానీ, ‘రంగస్థలం’ చిత్రం తర్వాత మాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మా బాధ్యత మరింత పెరిగింది. సినీ నిపుణులు, సెలబ్రిటీలు, ఆడియన్స్ ఇచ్చే ప్రోత్సాహాన్నే నిజమైన అవార్డులుగా భావిస్తాం’’ అన్నారు ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనిక. వరుణ్ తేజ్, అదితీరావు హైదరి, లావణ్యా త్రిపాఠి ముఖ్యతారలుగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పిహెచ్’. జాగర్లమూడి క్రిష్ సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 21న విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఆర్ట్ డైరెక్టర్స్‌గా పనిచేసిన రామకృష్ణ, మోనికా చెప్పిన విశేషాలు... ∙‘అంతరిక్షం’లాంటి సినిమాలు సాంకేతిక నిపుణులకు చాలా చాలెంజింగ్‌గా ఉంటాయి. ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఇలాంటి సబ్జెక్ట్స్‌కి తెలుగు డైరెక్టర్స్, నిర్మాతలు ముందుకు రావడం హ్యాపీగా ఉంది. ∙సైన్స్ బేస్డ్ సినిమా కాబట్టి తన వంతు పరిశోధనను పూర్తి చేసిన తర్వాత స్టోరీ బోర్డ్ గురించి సంకల్ప్ మాకు వివరించారు. ఆ తర్వాత మా పరిశోధన మొదలైంది. కానీ, ఫ్లోర్ మీద సెట్ వేసి వర్క్ చేయడానికి ఇది రెగ్యులర్ సినిమా కాదు. అందుకే మేం కూడా లోతుగా రీసెర్చ్ చేశాం. రీసెర్చ్ కోసం ఇస్రోకి అప్లై చేశాం. కుదర్లేదు. స్పేస్ షిప్, శాటిలైట్ లాంచింగ్ స్టేషన్... ఇలా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. ∙‘అంతరిక్షం’ సినిమా సెట్ వేయడానికి 45 రోజులు పట్టింది. ఈ సెట్‌ను తొమ్మిది పార్టులుగా చేశాం. షూటింగ్ జరుగుతున్నప్పుడు కాకుండా మిగిలిన మూడు పార్ట్స్‌ను మా సౌకార్యానికి అనుగుణంగా తీసి వేసేలా ప్రణాళిక వేసుకున్నాం. మూడు నెలలు చాలా కష్టపడ్డాం. మా కెరీర్లో ఈ సినిమా చేసినంత స్పీడ్‌గా వేరే ఏ సినిమా చేయలేదు. నిర్మాతలు బాగా సహకరించారు. మేం వేరే సినిమాల రిఫరెన్స్ తీసుకోం. రీసెర్చ్ చేస్తాం. సినిమాలో మా ఇద్దరి కష్టం సేమ్. ‘ప్రొఫెషనల్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తున్న నా వైఫ్ మోనికా గ్రేట్’ అన్నారు రామకృష్ణ. ∙ప్రపంచంలో ఉన్న స్పేస్ ఇండస్ట్రీస్‌తో పోలిస్తే ఇండియాలో ఉన్న స్పేస్ ఇండస్ట్రీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్స్‌కి తృప్తి అంటూ ఏదీ ఉండదు. ఫైనల్ వరకూ ఏదో ఒకటి చేయాలని తపనపడుతూనే ఉంటారు. కానీ, అనుకున్న టైమ్‌లో అనుకున్న బడ్జెట్లో మా పని పూర్తి చేశాం. అది సంతృప్తినిచ్చింది. ∙‘యన్.టి.ఆర్’ సినిమాలో ‘దాన వీర శూర కర్ణ’ సెట్ మేమే వేశాం. ఆ తర్వాత డైరెక్టర్ చేంజ్ అవ్వడం, మా కమిట్మెంట్స్ వల్ల ఆ సినిమా చేయలేకపోయాం. ప్రస్తుతం ‘యాత్ర, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలు చేస్తున్నాం. సుకుమార్ నెక్ట్స్ చిత్రానికి, విజయ్ దేవరకొండ సినిమాకి, హిరణ్య అనే సినిమాలు కమిట్ అయ్యాం. ఇతర భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ, టైమ్ కుదరడం లేదు. -
ఘనంగా నటుడి చిన్నా కుమార్తె వివాహ రిసెప్షన్
ప్రముఖ సినీ నటుడు చిన్నా కుమార్తె మోనిక వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఫిల్మ్ నగర్ క్లబ్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు , చిన్నా స్నేహితులు హాజరై వధూ వరులను ఆశ్వీరదించారు. వరుడు చైతన్యతో మౌనిక వివాహం ఈ నెల 23 న జరిగిన విషయం తెలిసిందే. తిరుమలలోని కర్ణాటక కల్యాణ మండపంలో పెళ్లి వేడుకను నిర్వహించారు. కాగా చిన్నా కుమార్తె పెళ్లి ఫొటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య.
-
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, చీరాల : ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వీరు వేటపాలెం రైల్వే స్టేషన్లో రైలు కింద పడి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. . చీరాలలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో వీరు బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. మృతులను ఇంకొల్లు మండలం తిమ్మసముద్రానికి చెందిన బత్తుల సాయిసందీప్ (24), గుంటూరు జిల్లా మోదుకూరుకు చెందిన భోగిరెడ్డి మోనిక (23)గా పోలీసులు గుర్తించారు. అయితే వీరిద్దరూ మంగళవారం విజయవాడ వెళ్లి పెళ్లి చేసుకుని చీరాల వచ్చి ఇంటికి వెళ్లే ధైర్యం లేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కాగా చదువుతో పాటు ఎప్పుడు చలాకీగా ఉండే సాయి సందీప్, మోనిక ఆత్మహత్య చేసుకోవటంతో సహ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎస్ఐ కుమార్తెపై కత్తితో దాడి
కేకే.నగర్: ప్రేమించలేదన్న కోపంతో ఎస్ఐ కుమార్తెపై కత్తితో దాడి జరిపిన యువకుడిపై పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తిరుచ్చి సమీపంలోని నెంబర్‌వన్ టోల్గేట్ పిచ్చాండవర్ కోవిల్ పాండురంగన్ అపార్టుమెంట్స్కు చెందిన రవి. తిరుచ్చి ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్. ఇతని భార్య ఫాతిమా. ఈమె కంటోన్మెంట్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తోంది. వీరి కుమార్తె మోనిక(25). సత్రం ప్రాంతంలోని కళాశాలలో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజూ బస్సులో కాలేజీకి వెళ్లి వస్తోంది. పిచ్చాండవర్ కోవిల్ కల్లలర్ వీధికి చెందిన ముత్తుమణి. సిరుకనూర్ సమీపంలోని పాండియపురం ప్రభుత్వ పాఠశాల్లో ప్రధానోపాధ్యాయుడు. ఇతని కుమారుడు బాలా అలియాస్ బాల మురుగన్(26) డిప్లమో చదివి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. బాలా, మోనికా రెండేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసి మోనికా తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో మోనిక, బాలా రెండేళ్ల క్రితం విషం తాగి ఆత్మహత్యకు యత్నించి బతికి బయటపడ్డారని తెలుస్తోంది. తర్వాత మోనిక తల్లిదండ్రుల మాట విని బాలాతో మాట్లాడడం మానేసింది. తనతో ఎందుకు మాట్లాడడం లేదని, తనను ప్రేమించాలంటూ బాలా ఆమె కాలేజీకి వెళ్లే సమయంలో వేధించేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మోనిక చదువుతున్న కళాశాలకు వెళ్లి తనను ప్రేమించాలని బలవంతం చేసి ఆమె సెల్‌ఫోన్ లాక్కున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మోనిక తల్లి ఫాతిమాతో చెప్పడంతో ఆమె బాలాను స్టేషన్‌కు పిలిపించి మందలించింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మోనిక కళాశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. శరీరంపై ఎనిమిది చోట్ల కత్తిగాట్లు తగలడంతో మోనిక రక్తం మడుగులో పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న అరుళ్‌మొళి అనే వ్యక్తి బాలాను పట్టుకున్నాడు. మోనికను అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమెకు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్సలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విషం తాగి ఉన్న బాలాను తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ మతిస్థిమితం కోల్పోయిన వాడిలాగా నటించిన బాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా హింసాత్మక నిరోధక చట్టం, హత్యాయత్నం తదితర మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
దళితుడిని పెళ్లాడిందని మోనికను చంపేశారు!
మాండ్యా: కర్ణాటకలో తాజాగా పరువు హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దళితుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో 19 ఏళ్ల అమ్మాయిని సొంత కుటుంబసభ్యులే కిరాతకంగా చంపేశారు. బాధితురాలిని మోనికగా గుర్తించారు. కర్ణాటక మాండ్యా జిల్లాలో శనివారం రాత్రి ఆమె పంటపొలాల్లో ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. ఈ వ్యవహారం పోలీసులకు తెలియకూడదనే ఉద్దేశంతో ఆదివారం ఉదయమే గుట్టుచప్పుడు కాకుండా ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు. మోనిక కొన్నిరోజుల కిందట తనను ప్రేమించిన దళిత యువకుడితో ఇంటి నుంచి పారిపోయింది. ఆమెను గుర్తించిన కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆమెను భయపెట్టి ఆత్మహత్య లేఖ రాయించారని, ఆ తర్వాత బలవంతంగా ఆమెకు ఉరివేసి చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రిని, అంకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో తమిళనాడులో పట్టపగలే శంకర్ అనే 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణంగా చంపేసిన చంపేసిన సంగతి తెలిసిందే. దళిత యువకుడైన శంకర్ అగ్రకులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఆమె కుటుంబసభ్యులు అతికిరాతకంగా ఈ పరువు హత్యకు పాల్పడ్డారు. -
షికార్ మూవీ స్టిల్స్
-
అమీర్‌పేటలో ఏం జరిగింది?
శ్రీ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అమీర్ పేటలో...’. మోనిక కథానాయిక. మహేష్ నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూ ర్తపు దృశ్యానికి విజయశ్రీ కెమెరా స్విచాన్ చేయగా, సీహెచ్ నాగేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. ‘‘చదువులో ‘సున్నా’ కంటే తక్కువ మార్కులు ఉండవు. ‘వంద’ కంటే ఎక్కువ మార్కులు ఉండవు. కానీ జీవితం అనే చదువులో మనిషి వేసే ప్రతి అడుగు అతణ్ణి ‘సున్నా’ కంటే తక్కువ చేయొచ్చు, ‘వంద’ కంటే ఎక్కువ చేయొచ్చు అని తెలిపే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, వచ్చే నెల 12 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామని, జనవరిలో సినిమాను విడుదల చేస్తామని శ్రీ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: వెంకటేష్ యువ, సంగీతం: మురళి లియోన్.