‘‘పెద్ద సినిమా చిన్న సినిమా అన్న తేడా లేదు. అన్ని సినిమాలకు ఒకేలా వర్క్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా సినిమానే. ఇప్పటి వరకు దాదాపు 18 సినిమాలకు వర్క్ చేశాం. అన్ని సినిమాలకు ఒకేలా కష్టపడ్డాం. కానీ, ‘రంగస్థలం’ చిత్రం తర్వాత మాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మా బాధ్యత మరింత పెరిగింది. సినీ నిపుణులు, సెలబ్రిటీలు, ఆడియన్స్ ఇచ్చే ప్రోత్సాహాన్నే నిజమైన అవార్డులుగా భావిస్తాం’’ అన్నారు ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనిక. వరుణ్ తేజ్, అదితీరావు హైదరి, లావణ్యా త్రిపాఠి ముఖ్యతారలుగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పిహెచ్’. జాగర్లమూడి క్రిష్ సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 21న విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఆర్ట్ డైరెక్టర్స్‌గా పనిచేసిన రామకృష్ణ, మోనికా చెప్పిన విశేషాలు...
∙‘అంతరిక్షం’లాంటి సినిమాలు సాంకేతిక నిపుణులకు చాలా చాలెంజింగ్‌గా ఉంటాయి. ఎంజాయ్‌మెంట్ కూడా ఉంటుంది. ఇలాంటి సబ్జెక్ట్స్‌కి తెలుగు డైరెక్టర్స్, నిర్మాతలు ముందుకు రావడం హ్యాపీగా ఉంది. ∙సైన్స్ బేస్డ్ సినిమా కాబట్టి తన వంతు పరిశోధనను పూర్తి చేసిన తర్వాత స్టోరీ బోర్డ్ గురించి సంకల్ప్ మాకు వివరించారు. ఆ తర్వాత మా పరిశోధన మొదలైంది. కానీ, ఫ్లోర్ మీద సెట్ వేసి వర్క్ చేయడానికి ఇది రెగ్యులర్ సినిమా కాదు. అందుకే మేం కూడా లోతుగా రీసెర్చ్ చేశాం.
రీసెర్చ్ కోసం ఇస్రోకి అప్లై చేశాం. కుదర్లేదు. స్పేస్ షిప్, శాటిలైట్ లాంచింగ్ స్టేషన్... ఇలా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. ∙‘అంతరిక్షం’ సినిమా సెట్ వేయడానికి 45 రోజులు పట్టింది. ఈ సెట్‌ను తొమ్మిది పార్టులుగా చేశాం. షూటింగ్ జరుగుతున్నప్పుడు కాకుండా మిగిలిన మూడు పార్ట్స్‌ను మా సౌకార్యానికి అనుగుణంగా తీసి వేసేలా ప్రణాళిక వేసుకున్నాం. మూడు నెలలు చాలా కష్టపడ్డాం. మా కెరీర్‌లో ఈ సినిమా చేసినంత స్పీడ్‌గా వేరే ఏ సినిమా చేయలేదు. నిర్మాతలు బాగా సహకరించారు. మేం వేరే సినిమాల రిఫరెన్స్ తీసుకోం. రీసెర్చ్ చేస్తాం. సినిమాలో మా ఇద్దరి కష్టం సేమ్. ‘ప్రొఫెషనల్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తున్న నా వైఫ్ మోనికా గ్రేట్’ అన్నారు రామకృష్ణ. ∙ప్రపంచంలో ఉన్న స్పేస్ ఇండస్ట్రీస్‌తో పోలిస్తే ఇండియాలో ఉన్న స్పేస్ ఇండస్ట్రీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్స్‌కి తృప్తి అంటూ ఏదీ ఉండదు. ఫైనల్ వరకూ ఏదో ఒకటి చేయాలని తపనపడుతూనే ఉంటారు. కానీ, అనుకున్న టైమ్‌లో అనుకున్న బడ్జెట్‌లో మా పని పూర్తి చేశాం. అది సంతృప్తినిచ్చింది. ∙‘యన్.టి.ఆర్’ సినిమాలో ‘దాన వీర శూర కర్ణ’ సెట్ మేమే వేశాం. ఆ తర్వాత డైరెక్టర్ చేంజ్ అవ్వడం, మా కమిట్‌మెంట్స్ వల్ల ఆ సినిమా చేయలేకపోయాం. ప్రస్తుతం ‘యాత్ర, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలు చేస్తున్నాం. సుకుమార్ నెక్ట్స్ చిత్రానికి, విజయ్ దేవరకొండ సినిమాకి, హిరణ్య అనే సినిమాలు కమిట్ అయ్యాం. ఇతర భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ, టైమ్ కుదరడం లేదు.
ఏదైనా సినిమానే
Published Thu, Dec 13 2018 12:20 AM | Last Updated on Thu, Dec 13 2018 12:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment