ఈ తూరి నవ్వించేకి వస్తుండా | Varun Tej comes with a unique Indo Korean horror comedy | Sakshi
Sakshi News home page

ఈ తూరి నవ్వించేకి వస్తుండా

Published Mon, Jan 20 2025 12:15 AM | Last Updated on Mon, Jan 20 2025 12:17 AM

Varun Tej comes with a unique Indo Korean horror comedy

వరుణ్‌ తేజ్‌( Varun Tej ) హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ ఇండో–కొరియన్‌ హారర్‌ కామెడీ చిత్రం రూపొందనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. జనవరి 19 (ఆదివారం) వరుణ్‌ తేజ్‌( Varun Tej ) బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈపోస్టర్‌పై ‘వెన్‌ హంటింగ్‌ టర్న్స్‌ హిలేరియస్‌’ అనే ట్యాగ్‌లైన్‌ ఉంది. ఈ చిత్రం షూటింగ్‌ని మార్చిలోప్రారంభించనున్నట్లుగా మేకర్స్‌ తెలిపారు.

‘‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!’ అంటూ ఈ సినిమాను ఉద్దేశించి, ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు వరుణ్‌ తేజ్‌( Varun Tej ). ఈ మూవీకి తమన్‌ సంగీతం అందించనున్నారు. వరుణ్‌ తేజ్‌( Varun Tej ) కెరీర్‌లోని హిట్‌ మూవీ ‘తొలిప్రేమ’ (2018) తర్వాత మళ్లీ ఈ హీరో సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కథనం రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఈ చిత్రానికి ‘కొరియన్‌ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement