
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో నలుగురు భారత బాక్సర్లు పసిడి పతకానికి పంచ్ దూరంలో నిలిచారు. పురుషుల విభాగంలో ఆశిష్ (75 కేజీలు), గోవింద్ (48 కేజీలు), వరీందర్ సింగ్ (60 కేజీలు)... మహిళల విభాగంలో మోనిక (48 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు.
సెమీఫైనల్స్‌లో ఆశిష్ 5–0తో ముస్కితా (ఇండోనేసియా)పై, గోవింద్ 4–1తో ఎన్గుయెన్ లిన్ ఫుంగ్ (వియ త్నాం)పై నెగ్గగా... వరీందర్‌కు తన ప్రత్యర్థి అబ్దుల్ (పాలస్తీనా) నుంచి ‘వాకోవర్’ లభించింది. మోనిక 5–0తో ట్రాన్ థి డియెక్ కియు (వియత్నాం)పై గెలిచింది. భారత్‌కే చెందిన అమిత్ (52 కేజీలు), భాగ్యబతి (75 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు.
చదవండి: IPL 2022: కమిన్స్ కమాల్.. ముంబై ఢమాల్.. తిలక్ కొట్టిన సిక్సర్ మాత్రం హైలైట్!
Comments
Please login to add a commentAdd a comment