కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువ జంట మృతదేహాలు లభ్యమయ్యాయి.
తాడేపల్లి (గుంటూరు) : కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువ జంట మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదివారం రాత్రి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు మధ్యాహ్నం కొద్దిసేపటి కిందటే మృతదేహాలు లభ్యమయ్యాయి.
మృతులు విజయవాడ సీతానగరానికి చెందిన జక్కల శివప్రసాద్(19), కృష్ణ లంకలోని రాణిగారితోటకు చెందిన బొందవీటి సుచిత్రాదేవి(17)గా గుర్తించారు. వీరిద్దరు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.