సాక్షి, గుంటూరు: ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో శనివారం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతులను అబ్దుల్లా, రేష్మలుగా గుర్తించారు. వీరిద్దరూ కళాశాల నుంచే ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు బ్రాడీపేటలోని రెప్కో హోమ్ ఫైనాన్స్‌లో పనిచేస్తున్నారు. ఈ ప్రేమ జంట బ్యాంక్‌లోనే ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. రేష్మా రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పాత గుంటూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె మొబైల్ నెంబర్‌ను ట్రేస్ చేసిన పోలీసులు బ్రాడీపేటలోని బ్యాంక్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూసేసరికి యువతి యువకుల మృతదేహాలు కనిపించాయి. దీంతో వారి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పెళ్లికి పెద్దలు ఎంత మాత్రం అంగీకరించకపోవడంతో అత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. (‘కలసి బతకలేం.. విడిచి ఉండలేం..’)
పెళ్లి వాయిదా; యువతి ఆత్మహత్య
మరోవైపు ఆర్థిక సమస్యలతో వివాహం వాయిదా పడిందన్న మనస్తాపంతో యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో కలకలం రేపింది. శాంతి నగర్‌కు చెందిన శంకరయ్య, నారాయణమ్మల కుమార్తె పబ్బతి హేమావతి (25) వివాహం ఈనెల మూడో వారంలో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా డబ్బులు చేతికి రాక వాయిదా పడింది. ఈ విషయంలో తల్లికి బరువు అయ్యాను అని కలత చెందిన హేమవతి బాధతో తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. (నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం)
Comments
Please login to add a commentAdd a comment