dharmavaram town
-
విషాదం: ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో శనివారం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతులను అబ్దుల్లా, రేష్మలుగా గుర్తించారు. వీరిద్దరూ కళాశాల నుంచే ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు బ్రాడీపేటలోని రెప్కో హోమ్ ఫైనాన్స్‌లో పనిచేస్తున్నారు. ఈ ప్రేమ జంట బ్యాంక్‌లోనే ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. రేష్మా రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పాత గుంటూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె మొబైల్ నెంబర్‌ను ట్రేస్ చేసిన పోలీసులు బ్రాడీపేటలోని బ్యాంక్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూసేసరికి యువతి యువకుల మృతదేహాలు కనిపించాయి. దీంతో వారి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పెళ్లికి పెద్దలు ఎంత మాత్రం అంగీకరించకపోవడంతో అత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. (‘కలసి బతకలేం.. విడిచి ఉండలేం..’) పెళ్లి వాయిదా; యువతి ఆత్మహత్య మరోవైపు ఆర్థిక సమస్యలతో వివాహం వాయిదా పడిందన్న మనస్తాపంతో యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో కలకలం రేపింది. శాంతి నగర్‌కు చెందిన శంకరయ్య, నారాయణమ్మల కుమార్తె పబ్బతి హేమావతి (25) వివాహం ఈనెల మూడో వారంలో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా డబ్బులు చేతికి రాక వాయిదా పడింది. ఈ విషయంలో తల్లికి బరువు అయ్యాను అని కలత చెందిన హేమవతి బాధతో తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ( నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం ) -
విడాకుల నోటీసు..వివాహిత బలవన్మరణం
ధర్మవరం అర్బన్: అదనపు కట్నం తేలేదని విడాకులు నోటీసు పంపడంతో మనస్తాపానికి గురైన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. రెండు రోజుల కిందట ధర్మవరం చెరువులో తేలిన మహిళ మృతదేహం వనిత (30)దిగా గుర్తించారు. పోలీసులు, మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. హిందూపురానికి చెందిన పూల గుర్రప్ప, చెన్నకేశమ్మ దంపతుల రెండో కుమార్తె వనితను 2017 ఫిబ్రవరి 12న ధర్మవరంలోని మార్కెట్‌వీధికి చెందిన చంద్రమౌళికి ఇచ్చి వివాహం చేశారు. భార్యాభర్తలు బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే కొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం వనితకు వేధింపులు మొదలయ్యాయి. భర్త చంద్రమౌళితోపాటు అత్త కొండమ్మ, మరిది నాగేంద్రలు అదనపు కట్నం కింద రూ.5లక్షలు, ఒక కారు తీసుకురావాలని ఆమెను మానసికంగా హింసించేవారు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి కాపురానికి పంపినా చంద్రమౌళిలో మార్పు రాలేదు. విడాకుల నోటీసుతో మనస్తాపం.. మెట్టినింటి నుంచి విడాకుల నోటీసు అందడంతో వనిత తన భర్తను నిలదీయడానికి హిందూపురం నుంచి ఈ నెల ఏడో తేదీన ధర్మవరం వచ్చింది. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. తన కూతురు కనిపించడం లేదని వనిత తండ్రి గుర్రప్ప హిందూపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తొమ్మిదో తేదీన ధర్మవరం చెరువులో గుర్తు తెలియని మహిళ శవం బయటపడిందని హిందూపురం పోలీసులు గురప్పను ఇక్కడకు తీసుకురాగా.. మృతురాలు తమ కూతురేనని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యాడు. తన కూతురు చావుకు అల్లుడు చంద్రమౌళి, అత్త కొండమ్మ, మరిది నాగేంద్రలు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని గుర్రప్ప ధర్మవరం పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. శనివారం వనిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. -
ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు
సాక్షి, ధర్మవరం: చెరువులో ఈతకు వెళ్లి ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. పీఆర్టీ వీధికి చెందిన విజయ్(25) స్థానిక చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. ఈతగాళ్ల సాయంతో ఇతని కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు. -
ధర్మవరంలో బాంబుల కలకలం
సాక్షి, ధర్మవరం : అనంతపురం జిల్లా ధర్మవరంలో బాంబులు కలకలం సృష్టించాయి. ధర్మవరం పట్టణంలోని బోయవీధి శివారులో శనివారం ఉదయం ఒక బాంబును గుర్తు తెలియని వ్యక్తులి విసరడంతో పేలి పెద్ద శబ్ధం వచ్చింది. దాంతో ఉలిక్కిపడిన పరిసరప్రాంత ప్రజలు పరుగులు తీశారు. దట్టంగా పోగలు కమ్ముకోవడంతో కాసేపు అమోమయం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాంబు పేలిన ప్రాంతంలో తనిఖీ చేయగా పేలని మూడు బాంబులు దొరికాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పెయింటర్ పనిచేస్తున్న చిన్న రాజాతో ఉన్న ఆస్తి గొడవల కారణంగా ఆయన సోదరులే పొగ బాంబులు వేశారని పోలీసుల విచారణలో తేలింది. -
కేతిరెడ్డి 48 గంటల దీక్ష
ధర్మవరం టౌన్/ అర్బన్, న్యూస్‌లైన్ : సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా ధర్మవరం ఎమ్మెల్యే కే తిరెడ్డి వెంకటరామిరెడ్డి బుధవారం పట్టణంలోని పాండురంగ సర్కిల్లో 48 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీలోకి చేరి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ధర్మవరం పట్టణానికి వచ్చిన ఎమ్మెల్యేను ఆ పార్టీ జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ సాదరంగా ఆహ్వానించారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా పోరాడుతోంది ఒక్క వైఎస్సార్‌సీపీనేనని స్పష్టం చేశారు. మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమైక్యాంధ్ర పరిరక్షణకు పాటుపడ్డారని కొనియాడారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారన్నారు. తమ పదవులను సైత ం త్యజించి ఆమరణ దీక్షలు చేపట్టారన్నారు. దీక్షలో ఎమ్మెల్యే కేతిరెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కంచం లీలావతి, మాజీ కౌన్సిలర్ రమాదేవి, నాయకులు శంకర్‌రెడ్డి, రేగాటిపల్లి సురేష్‌రెడ్డి, గొట్లూరు పోతిరెడ్డి, పరంధామరెడ్డి కూర్చొన్నారు. ఈ దీక్షకు పార్టీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, కదిరి నియోజకవర్గ నాయకుడు వజ్ర భాస్కరరెడ్డి, పెనుకొండ నియోజకవర్గ నాయకురాలు సానే ఉమారాణి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యదర్శి పగడాల మల్లికార్జున, ధర్మవరం జేఏసీ నాయకులు రామచంద్రారెడ్డి, భాస్కరరెడ్డి, రామ్మోహన్నాయుడు, శెట్టిపి జయచంద్రారెడ్డి, ఉరుకుందప్ప, నాగార్జునరెడ్డి, చంద్రశేఖరరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. విభజన పాపం చంద్రబాబుదే రాష్ట్ర విభజన పాపం చంద్రబాబుదేనని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నిరవధిక దీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి మరోమారు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సమైక్య రాష్ట్రం విషయంలో మిగతా పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. వైఎస్సార్సీపీ మాత్రమే రాష్ట్ర పరిరక్షణకు పాటుపడుతోందన్నారు. విభజన ప్రకటన వెలువడిన వెంటనే తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని గుర్తు చేశారు. అలాగే వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షలు చేపట్టారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎమ్మెల్యే కేతిరెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం అభినందనీయమన్నారు. ఆయన చేపడుతున్న నిరవధిక దీక్ష మరింత మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఇకనైనా పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులను త్యజించి... ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. దమ్మున్న నాయకుడు జగన్ సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్ అని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య కొనియాడారు. కాంగ్రెస్, టీడీపీ నాయకుల మాదిరి ఓట్లు, సీట్ల కోసం కాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వార్థరాజకీయాలను తిప్పికొడుతున్న దమ్మున్న వ్యక్తి జగన్ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర చేపడతానంటుండడం సిగ్గు చేటన్నారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ధర్మవరం నియోజకవర్గంలో గత 50 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసిన ఘనత కేతిరెడ్డికే దక్కిందని కొనియాడారు. జగన్ దీక్షలకు మద్దతుగా కేతిరెడ్డి దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు.