ధర‍్మవరంలో బాంబుల కలకలం | bombs found in dharmavaram | Sakshi
Sakshi News home page

ధర‍్మవరంలో బాంబుల కలకలం

Published Sat, Dec 23 2017 11:00 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

bombs found in dharmavaram

సాక్షి, ధర‍్మవరం : అనంతపురం జిల్లా ధర‍్మవరంలో బాంబులు కలకలం సృష‍్టించాయి. ధర‍్మవరం పట‍్టణంలోని బోయవీధి శివారులో శనివారం ఉదయం ఒక బాంబును గుర్తు తెలియని వ‍్యక్తులి విసరడంతో పేలి పెద‍్ద శబ‍్ధం వచ్చింది. దాంతో ఉలిక్కిపడిన పరిసరప్రాంత ప్రజలు పరుగులు తీశారు. దట‍్టంగా పోగలు కమ‍్ముకోవడంతో కాసేపు అమోమయం నెలకొంది. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు. బాంబు పేలిన ప్రాంతంలో తనిఖీ చేయగా పేలని మూడు బాంబులు దొరికాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పెయింటర్‌ పనిచేస్తున‍్న చిన‍్న రాజాతో ఉన‍్న ఆస్తి గొడవల కారణంగా ఆయన సోదరులే  పొగ బాంబులు వేశారని పోలీసుల విచారణలో తేలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement