bombs found
-
భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. రెండు బ్యాగుల నిండా బాంబులు స్వాధీనం
శ్రీనగర్: జమ్ము రైల్వే స్టేషన్ వద్ద పేలుళ్లు జరిపేందుకు చేసిన భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోని టాక్సీ స్టాండ్ వద్ద 18 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రెండు బ్యాగుల్లో పేలుడు పదార్థాలను గుర్తించినట్లు చెప్పారు. డిటోనేటర్లతో పాటు రెండు బాక్సుల్లో వైర్లను గుర్తించామని, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘సుమారు 500 గ్రాముల మైనపు రకం పదార్థం బాక్సులో ప్యాక్ చేసి కనిపించింది. వాటిని సీజ్ చేశాం.’ అని ప్రభుత్వ రైల్వే పోలీసు జీఆర్పీ ఎస్ఎస్పీ ఆరిఫ్ రిషూ తెలిపారు. ట్యాక్సీ స్టాండ్‌లో అనుమానిత బ్యాగ్‌ను గుర్తించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. రెండు బాక్సుల్లో డిటోనేటర్లు, వైర్లు ఉన్నాయని చెప్పారు. కొద్ది రోజులుగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు జరుగుతున్న క్రమంలో పేలుడు పదార్థాలు లభించటం ఆందోళనలు పెంచుతోంది. ఇదీ చదవండి: ఆ కేసులో దోషిగా తేలిన సైకిల్ పార్టీ కీలక నేత.. ఎమ్మెల్యే పదవికి ఎసరు! -
ధర్మవరంలో బాంబుల కలకలం
సాక్షి, ధర్మవరం : అనంతపురం జిల్లా ధర్మవరంలో బాంబులు కలకలం సృష్టించాయి. ధర్మవరం పట్టణంలోని బోయవీధి శివారులో శనివారం ఉదయం ఒక బాంబును గుర్తు తెలియని వ్యక్తులి విసరడంతో పేలి పెద్ద శబ్ధం వచ్చింది. దాంతో ఉలిక్కిపడిన పరిసరప్రాంత ప్రజలు పరుగులు తీశారు. దట్టంగా పోగలు కమ్ముకోవడంతో కాసేపు అమోమయం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాంబు పేలిన ప్రాంతంలో తనిఖీ చేయగా పేలని మూడు బాంబులు దొరికాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పెయింటర్ పనిచేస్తున్న చిన్న రాజాతో ఉన్న ఆస్తి గొడవల కారణంగా ఆయన సోదరులే పొగ బాంబులు వేశారని పోలీసుల విచారణలో తేలింది. -
ప్రమాదకర ఐఈడీ, పైప్ బాంబులు స్వాధీనం
బస్తర్: ఆంధ్రా, ఒడిషా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు శుక్రవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కొందగావ్ జిల్లా లోని మార్దాపాల్ ఏరియాలో భారీ సామర్థ్యమున్న బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో 5 కిలోల బరువున్న రెండు ఐఈడీ బాంబులు, 1 పైప్ బాంబు, 500 లీటర్ల సింథటిక్ ట్యాంకుతో పాటు 10 కేజీల వైరు చుట్టను కనుగొన్నట్లు తెలిపారు. ఆ చుట్టుపక్కల ఇంకా ఏమైనా ఆయుధాలు, బాంబులు దొరుకుతాయని భావించి తనిఖీలు చేపట్టినట్లు సమాచారం అందింది. అయితే బాంబులు ఎందుకోసం అమర్చారు, వారి టార్గెట్ ఏంటి, ఈ పని చేసింది ఎవరన్నది తెలియరాలేదు.