ప్రమాదకర ఐఈడీ, పైప్ బాంబులు స్వాధీనం | police search operation at AOB border | Sakshi
Sakshi News home page

ప్రమాదకర ఐఈడీ, పైప్ బాంబులు స్వాధీనం

Published Fri, Mar 11 2016 9:01 PM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

ప్రమాదకర ఐఈడీ, పైప్ బాంబులు స్వాధీనం - Sakshi

ప్రమాదకర ఐఈడీ, పైప్ బాంబులు స్వాధీనం

బస్తర్: ఆంధ్రా, ఒడిషా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు శుక్రవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కొందగావ్ జిల్లా లోని మార్దాపాల్ ఏరియాలో భారీ సామర్థ్యమున్న బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో 5 కిలోల బరువున్న రెండు ఐఈడీ బాంబులు, 1 పైప్ బాంబు, 500 లీటర్ల సింథటిక్ ట్యాంకుతో పాటు 10 కేజీల వైరు చుట్టను కనుగొన్నట్లు తెలిపారు. ఆ చుట్టుపక్కల ఇంకా ఏమైనా ఆయుధాలు, బాంబులు దొరుకుతాయని భావించి తనిఖీలు చేపట్టినట్లు సమాచారం అందింది. అయితే బాంబులు ఎందుకోసం అమర్చారు, వారి టార్గెట్ ఏంటి, ఈ పని చేసింది ఎవరన్నది తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement