
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మల్కాస్‌గిరి జిల్లా సరిహద్దు గుజ్జేడు ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. 10 రోజుల వ్యవధిలో ఏవోబీలో మూడు సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్ట్ యాక్షన్ టీములు సంచరిస్తున్నాయనే సమాచారంతో పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment