శ్రీనగర్: జమ్ము రైల్వే స్టేషన్ వద్ద పేలుళ్లు జరిపేందుకు చేసిన భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోని టాక్సీ స్టాండ్ వద్ద 18 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రెండు బ్యాగుల్లో పేలుడు పదార్థాలను గుర్తించినట్లు చెప్పారు. డిటోనేటర్లతో పాటు రెండు బాక్సుల్లో వైర్లను గుర్తించామని, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
‘సుమారు 500 గ్రాముల మైనపు రకం పదార్థం బాక్సులో ప్యాక్ చేసి కనిపించింది. వాటిని సీజ్ చేశాం.’ అని ప్రభుత్వ రైల్వే పోలీసు జీఆర్‌పీ ఎస్‌ఎస్‌పీ ఆరిఫ్ రిషూ తెలిపారు. ట్యాక్సీ స్టాండ్‌లో అనుమానిత బ్యాగ్‌ను గుర్తించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. రెండు బాక్సుల్లో డిటోనేటర్లు, వైర్లు ఉన్నాయని చెప్పారు. కొద్ది రోజులుగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు జరుగుతున్న క్రమంలో పేలుడు పదార్థాలు లభించటం ఆందోళనలు పెంచుతోంది.
ఇదీ చదవండి: ఆ కేసులో దోషిగా తేలిన సైకిల్ పార్టీ కీలక నేత.. ఎమ్మెల్యే పదవికి ఎసరు!
Comments
Please login to add a commentAdd a comment