terror attack plan
-
భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. రెండు బ్యాగుల నిండా బాంబులు స్వాధీనం
శ్రీనగర్: జమ్ము రైల్వే స్టేషన్ వద్ద పేలుళ్లు జరిపేందుకు చేసిన భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోని టాక్సీ స్టాండ్ వద్ద 18 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రెండు బ్యాగుల్లో పేలుడు పదార్థాలను గుర్తించినట్లు చెప్పారు. డిటోనేటర్లతో పాటు రెండు బాక్సుల్లో వైర్లను గుర్తించామని, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘సుమారు 500 గ్రాముల మైనపు రకం పదార్థం బాక్సులో ప్యాక్ చేసి కనిపించింది. వాటిని సీజ్ చేశాం.’ అని ప్రభుత్వ రైల్వే పోలీసు జీఆర్పీ ఎస్ఎస్పీ ఆరిఫ్ రిషూ తెలిపారు. ట్యాక్సీ స్టాండ్‌లో అనుమానిత బ్యాగ్‌ను గుర్తించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. రెండు బాక్సుల్లో డిటోనేటర్లు, వైర్లు ఉన్నాయని చెప్పారు. కొద్ది రోజులుగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు జరుగుతున్న క్రమంలో పేలుడు పదార్థాలు లభించటం ఆందోళనలు పెంచుతోంది. ఇదీ చదవండి: ఆ కేసులో దోషిగా తేలిన సైకిల్ పార్టీ కీలక నేత.. ఎమ్మెల్యే పదవికి ఎసరు! -
దశమి రోజు ధ్వంస రచనకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: దసరా రోజున హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి పాకిస్తాన్ కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్రను కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో నగర పోలీసులు భగ్నం చేశా రు. లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఫర్హాతుల్లా ఘోరీ ఆదేశాలతో నగరంలో దసరా ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధ్వంసాలు సృష్టించడంతోపాటు నగరానికి చెందిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల్ని హతమార్చాలనుకున్న ముగ్గురు ముష్కరులను అరెస్టు చేశారు. ఫర్హాతుల్లా ఘోరీ ప్రధా న అనుచరుడైన ముసారాంబాగ్వాసి మహ్మద్ అబ్దుల్ జాహెద్, ఐసిస్ ఉగ్రవాది, హుమాయున్‌నగర్‌లోని రాయల్ కాలనీకి చెందిన మాజ్ హసన్ ఫారూఖ్, సైదాబాద్ పరిధిలోని అక్బర్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సమీదుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమీలను అరెస్టు చేశారు. వారి నుంచి 4 హ్యాండ్ గ్రెనేడ్లు, 5.41 లక్షల నగదు, సెల్ఫోన్లు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టంలోని 18, 18 (బీ), 20 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధాన అనుచరుడి ద్వారా కుట్ర... అబ్దుల్ జాహెద్ 2004లో ఘోరీ ఆదేశాలతో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు జరిగిన కుట్రలో పాలుపంచుకున్నాడు. అప్పట్లో పేలుడు పదార్థాలను దాచి ఉంచిన కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అలాగే 2005 అక్టోబర్ 12న సరిగ్గా దసరా రోజునే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు (బంగ్లాదేశీ డాలిన్) దాడి కేసులోనూ అరెస్టయి 2017 వరకు జైల్లో ఉన్నాడు. అయితే ఈ రెండు కేసులూ సరైన సాక్షా«ధారాలు లేక కోర్టులో వీగిపోవడంతో విడుదలైన జాహెద్.. సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఘోరీతో నిరంతరం టచ్‌లోనే ఉన్నాడు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతోపాటు నగరంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మరోసారి హైదరాబాద్‌లో ఉగ్రదాడులు జరపాలన్న లష్కరే తోయిబా ఆదేశాలతో ఘోరీ జాహెద్‌ను రంగంలోకి దించాడు. జైల్లో పరిచయమైన మాజ్‌తో కలిసి... నగరంలో దాడుల కోసం జాహెద్ తన స్నేహితుడైన మహ్మద్ సమీయుద్దీన్తోపాటు గతంలో ఐసిస్ కేసులో అరెస్టయిన మాజ్ హుస్సేన్ ఫారూఖ్‌ను ఎంచుకున్నాడు. 2015లో ‘ఐసిస్’ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సిరియా వెళ్తూ నాగ్‌పూర్ విమానాశ్రయంలో అబ్దుల్లా బాసిత్ సహా చిక్కిన ముగ్గురు యువకుల్లో మాజ్ హుస్సేన్ ఒకడు. 2016 వరకు జైల్లో ఉన్న అతనికి అక్కడే జావేద్‌తో పరిచయమైంది. ఘోరీ చెప్పిన ఆపరేషన్ పూర్తి చేయడానికి సహకరించాలంటూ జావేద్ కోరడంతో మాజ్ అంగీకరించాడు. ఆరు చోట్ల రెక్కీలు... ఈ ఆపరేషన్‌కు అవసరమైన నగదును ఘోరీ హవాలా రూపంలో పంపాడు. పాక్‌లో తయారైన నాలుగు హ్యాండ్ గ్రెనేడ్స్‌ను తన నెట్వర్క్ సాయంతో హైదరాబాద్‌కు చేర్చాడు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ 6 చోట్ల రెక్కీలు కూడా చేయించాడు. దసరా ఉత్సవాల ఊరేగింపు జరిగే మార్గాలతోపాటు ముగ్గురు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల ఇళ్లు, కార్యాలయాలు వాటిలో ఉన్నాయి. ఈ ముగ్గురూ దసరా రోజున ఎవరికి వారుగా విడిపోయి గ్రెనేడ్స్తో దాడులు చేయాలని పథకం వేశారు. నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలో ట్రయల్ రన్ కోసం ఓ గ్రెనేడ్ వాడాలని భావించారు. ఈ సన్నాహాల్లో ఉండగా కేంద్ర నిఘా వర్గాలకు ఉప్పందింది. వాళ్లు అప్రమత్తం చేయడంతో శనివారం రాత్రి సిటీ సీసీఎస్ అధీనంలోని సిట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రంగంలోకి దిగిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఈ ముగ్గురితోపాటు సైదాబాద్, మాదన్నపేట, పాతబస్తీకి చెందిన మరో నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ప్రమేయం లేని వారిని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురినీ అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఘోరీ... హైదరాబాద్ మాదన్నపేట సమీపంలోని కూర్మగూడకు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్ 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అ/ê్ఞతంలోకి వెళ్లిపోయాడు. 2002లో గుజరాత్‌లోని అక్షర్ధామ్ ఆలయంపై జరిగిన ఉగ్ర దాడితోపాటు దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం వద్ద పేలుడు, అదే ఏడాది ముంబైలోని ఘట్కోపర్ వద్ద జరిగిన బస్సులో పేలుడు, 2004లో సికింద్రాబాద్‌లోని గణేశ్ టెంపుల్ పేల్చివేతకు కుట్ర, అదే ఏడాది బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర, 2005లో నగర కమిషనర్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసుల్లోనూ అతను నిందితుడు. చాలాకాలం దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన అతను ప్రస్తుతం పాక్‌లోని అబోటాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తూ నగర యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నాడు. అతనిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. -
జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
శ్రీనగర్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై ఉగ్రవాదులు అమర్చిన సుమారు 25 నుంచి 30 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసింది సైన్యం. 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఐఈడీని గుర్తించటం భారీ విధ్వంసాన్ని అడ్డుకున్నట్లయిందన్నారు . ‘పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై సుమారు 25-30 కిలోలు ఉన్న ఐఈడీని పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పుల్వామా పోలీసులకు అందిన సమాచారంతో భారీ విధ్వంసాన్ని అడ్డుకోగలిగాం.’ అని తెలిపారు కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్. అంతకు ముందు రోజు ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్న ఓ ఉగ్రవాదిని ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్ పట్టుకుంది. అతడు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఐఈడీలు పేల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు సబౌద్దిన్పై లక్నోలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? -
జవహరీ హతం.. అమెరికన్లూ జాగ్రత్త! బైడెన్ సర్కారు అధికారిక ప్రకటన
వాషింగ్టన్: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీ హత్య తర్వాత అమెరికన్లపై ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది. అల్‌ఖైదా అనుబంధ ఉగ్రసంస్థలు, సానుభూతిపరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరులు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశముందని చెప్పింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అమెరికన్లు, మున్ముందు విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకునే పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉగ్రసంస్థలు వివిధ దేశాల్లో దాడులకు పాల్పడే అవకాశముందని ప్రస్తుతం తమకు అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోందని విదేశాంగ శాఖ చెప్పింది. ఆత్మాహుతి దాడులు, హత్యలు, కిడ్నాప్‌లు, బాంబుపేలుళ్లు ఇలా ఏ రూపంలోనైనా ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించవచ్చని చెప్పింది. పరిస్థితిని అర్థం చేసుకుని అమెరికన్లంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అల్ జవహరీని అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి హతమార్చింది. కాబూల్ ఓ ఇంట్లో తలదాచుకున్న అతడిపై డ్రోన్లతో క్షిపణి దాడులు చేసి అంతం చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. జవహరీ మృతితో 9/11 ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. మరోవైపు ఈ దాడిని తాలిబన్లు ఖండించారు. అమెరికా అంతర్జాతీయ నిబంధనలను అతిక్రమించిందని, 2000 సంవత్సరంలో కుదిరిన ఒప్పందాలను విస్మరించిందని ఆరోపించారు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
ఉగ్ర దాడికి జైషే భారీ కుట్ర..
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య తీర్పు నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు తెగబడవచ్చని నిఘా సంస్థల హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. మిలటరీ ఇంటెలిజెన్స్, రా, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి నిఘా సంస్థలు పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిపై ప్రభుత్వాన్ని హెచ్చరించడం పొంచి ఉన్న ఉగ్రముప్పు తీవ్రతను స్పష్టం చేస్తోందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అయోధ్య తీర్పు ఏ క్షణంలోనైనా వెలువడవచ్చనే దృష్టిలో ఉగ్ర సంస్ధల భారీ విధ్వంస రచనపై నిఘా సంస్ధలు గత పదిరోజులుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉగ్ర హెచ్చరికలు డార్క్ వెబ్‌లో పోటెత్తడంతో వీటి గుట్టుమట్లను తేల్చడం భద్రతా దళాలకు సంక్లిష్టంగా మారిందని అన్నారు. నిఘా సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికలను బేరీజు వేసిన భద్రతా దళాలు ఉగ్ర మూకల ప్రతిపాదిత టార్గెట్లను పసిగట్టి ముప్పును నిరోధించేందుకు పలు చర్యలు చేపడుతున్నారు. ఉగ్ర మూకలు ఢిల్లీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు, నగరాలపై ఉగ్రదాడులతో విరుచుకుపడతారిని భావిస్తున్నారు. కాగా ఆర్టికల్ 370 రద్దు చేపట్టినప్పటి నుంచి భద్రతా దళాలు ఉగ్ర ముప్పును నియంత్రించేందుకు శ్రమిస్తున్నారు. -
భారత్‌లోకి 10మంది జైషే ఉగ్రవాదులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్‌లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. అమెరికా మాదిరే భారత్‌లో కూడా 26/11 తరహా దాడులు చేసేందుకు పథకం పన్నుతున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లో ఆత్మాహుతి దాడితోపాటు దేశవ్యాప్తంగా 30 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది జైషే ఉగ్రవాదులు భారత్‌లో చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇంటిలెజన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పఠాన్ కోట్, జమ్మూకశ్మీర్, శ్రీనగర్‌లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. రాష్ట్రాలను అప్రమత్తం చేయడమే కాక.. భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించాయి. -
ప్రసాదంలో విషం కలిపి..
ముంబై : ముంబ్రేశ్వర్ ఆలయంలో భక్తులకు ఇచ్చే మహా ప్రసాదంలో విషం కలిపి 400 మందిని చంపాలనే ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ ఏడాది జనవరిలో ముంబై సమీపంలోని ముంబ్రాలో అరెస్టయిన ఉగ్రవాదుల బృందం ఈ మేరకు పథకరచన చేసిందని మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఐఎస్‌తో పాటు ఇస్లాం ప్రబోధకుడు జకీర్ నాయక్‌ల ప్రేరణతో వారు ఈ ఘాతుకానికి తెగబడినట్టు చార్జిషీట్లో పేర్కొన్నారు. నిందితుల సోషల్ మీడియా ప్రొఫైల్‌లో జకీర్ నాయక్‌కు సంబంధించిన పలు వీడియోలు ఉండటం గమనార్హం. 400 మంది హిందూ భక్తులను చంపే ఉద్దేశంతో ప్రసాదంలో విషం కలిపేందుకు వారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ముంబ్రేశ్వర్ ఆలయాన్ని వారు ఎంపిక చేసుకున్నారు. థానే జిల్లా ముంబ్రా బైపాస్ వద్ద వారు బ్లాస్ట్ ట్రయల్స్‌ను చేపట్టారని ఏటీఎస్ అధికారులు తెలిపారు. పేలడు పదార్ధాలు, విషపూరిత పదార్ధాల తయారీలో శిక్షణ కూడా తీసుకున్నట్టు వెల్లడైంది. ఐఎస్‌తో సంబంధాలు కలిగిన ఉమ్మాతే మహ్మదీయ గ్రూపునకు చెందిన 10 మంది సభ్యులను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేసి భారీ ఉగ్ర కుట్రలను నిలువరించింది. -
కౌంటింగ్ రోజు భారీ ఉగ్రదాడికి స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతటా ఉత్కంఠ రేపిన సార్వత్రిక సమరంలో విజేతలు ఎవరో తేలనున్న మే 23న అదును చూసి ఉగ్రదాడితో విరుచుకుపడాలని ఉగ్రమూకలు సంసిద్ధమైనట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రరిస్టులు తమ టార్గెట్లుగా ఎంచుకున్న వాటిలో శ్రీనగర్, అవంతిపుర వైమానిక స్ధావరాలు ఉన్నట్టు సమాచారం. సొపియాన్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాదుల్లో ఒక మృతదేహం నుంచి ఓ స్కెచ్‌ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. శ్రీనగర్, అవంతిపుర ఎయిర్‌బేస్‌లపై దాడికి ఉగ్ర మూకలు ప్రణాళిక రూపొందించినట్టు ఈ స్కెచ్ వెల్లడించింది. కాగా, ఈనెల 14న పుల్వామాలో ఉగ్ర కమాండర్ల భేటీలో హిజ్బుల్ ముజహిదీన్‌కు చెందిన రియాజ్ నైకూ, ఇద్దరు జైషే టెర్రరిస్టులు, లష్కరే తోయిబా ఉగ్రవాది రియాజ్ దర్లు పాల్గొని భద్రతా, సాయుధ దళాలపై దాడికి వ్యూహం రూపొందించినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. రంజాన్ మాసంలో ముఖ్యంగా ఓట్ల లెక్కింపు చేపట్టే మే 23న భారీ ఉగ్రదాడిపై ఈ సమావేశంలో చర్చించారని వెల్లడించాయి. -
భారత్‌లో దాడులకు జైషే, ఐఎస్‌ల భారీ కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో జైషే మహ్మద్, ఐఎస్ ఉగ్రవాద సంస్థలు మూకుమ్మడిగా తాజా దాడులతో విరుచుకుపడవచ్చని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ రెండు ఉగ్రసంస్ధలతో పాక్‌కు చెందిన ఐఎస్ఐ టచ్‌లో ఉందని నిఘా సంస్థలు హోంమంత్రిత్వ శాఖకు పంపిన నివేదికలో స్పష్టం చేశాయి. ఆప్ఘనిస్తాన్‌లో జైషే, ఐఎస్ సభ్యుల మధ్య ఐఎస్ఐ రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, భారత్‌లో మరిన్ని పుల్వామా తరహా దాడులను ఐఎస్ఐ ప్రోత్సహిస్తోందని ఈ నివేదికలో నిఘా సంస్ధలు పేర్కొన్నాయి. కాగా జైషే మహ్మద్, తాలిబాన్ టెర్రరిస్టులు దీర్ఘకాలంగా ఆప్ఘనిస్తాన్‌లో నాటో సైనిక దళాలతో తలపడుతున్నారని, తాము ఈ పరిణామాలను చాలాకాలంగా గమనిస్తున్నామని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఐఎస్, జైషే మహ్మద్ ఉగ్రవాదులను కలపడం ద్వారా భారత్‌లో భారీ కుట్రకు ఐఎస్ఐ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు. మరోవైపు బాలాకోట్ వైమానిక దాడులతో భంగపడ్డ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరోసారి చురుకుగా మారినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారత్‌లో మెరుపు దాడులు చేపట్టేందుకు సుశిక్షితులైన ఉగ్రవాదులనే ఎంచుకోవాలని అజర్ జైషే టాప్ కమాండర్లకు సూచించినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. జైషే టాప్ కమాండర్లతో భేటీ సందర్భంగా భారత్‌లో మరిన్ని పుల్వామా తరహా దాడులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని కోరినట్టు తెలిపాయి. -
సార్వత్రిక సమరంపై ఉగ్ర నీడ..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జమ్ము కశ్మీర్లో భారీ ఉగ్రదాడి జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. లష్కరే, జైషే తరహాలో పాకిస్తాన్ ఐఎస్ఐ పలు ఉగ్ర సంస్ధలను తయారుచేసిందని, పోలింగ్ బూత్‌లే లక్ష్యంగా ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్ధులపై ఆయా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని పేర్కొంది. కాగా, కశ్మీర్లో ఈ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు సరిహద్దు నుంచి ఆప్ఘనిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులను పంపవచ్చని ఐఎస్ఐ అనుమానిస్తోంది. నిఘా వర్గాల సమాచారంతో జమ్మూ కశ్మీర్లో బీఎస్ఎఫ్ దళాలతో పాటు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల ప్రచారం, పోలింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపింది. -
దసరా వేడుకలపై ఉగ్ర పంజా..?
కోల్‌కతా : దసరా వేడుకల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని దుర్గా మంటపాలపై ఉగ్రమూకలు దాడులతో విరుచుకుపడవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఉత్తర బెంగాల్‌లోని జల్పాయిగురి, కూచ్‌బెహర్, అలీపుర్దూర్, సిలిగురి ప్రాంతాల్లో దాడులకు బంగ్లాదేశ్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జమాతుల్ ముజహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) దాడులకు పాల్పడవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. నలుగురు జేఎంబీ ఉగ్రవాదులు దుర్గా పూజ సందర్భంగా అలజడి సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించారని, అలీపుర్దూర్, జల్పాయిగురి, సిలిగురిల్లో భీకర దాడులను చేపట్టాలన్నది వీరి లక్ష్యమని ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. ఇద్దరు జేఎంబీ ఉగ్రవాదులు ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్ జిల్లా దిన్హత ప్రాంతంలో ఉన్నారని, రెండ్రోజుల్లో మరో ఇద్దరు భారత భూభాగంలోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని నిఘా వర్గాల నివేదిక స్పష్టం చేసింది. నేపాల్ నుంచి జేఎంబీ ఉగ్రవాదులు పేలుడు పదార్ధాలను సేకరించారని నివేదిక అంచనా వేసింది. గతంలో 2014లో బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో దుర్గా పూజ వేడుకల్లో జరిగిన పేలుడుతో రాష్ట్రంలో జేఎంబీ స్లీపర్ సెల్స్ చురుకుగా పనిచేస్తున్నట్టు వెల్లడైంది. -
ఉగ్రమూకల టార్గెట్ పంద్రాగస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి దాడుల ముప్పు పొంచిఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్గర్ మాజీ బాడీ గార్డ్ మహ్మద్ ఇబ్రహీం దాడిని చేపట్టేందుకు ఢిల్లీలో ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు భద్రతా దళాలకు సమాచారం అందించాయి. ఇబ్రహీంతో పాటు జైషే కేడర్ గురించి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక సమాచారం చేరవేశాయి. మే తొలివారంలో తొలుత జమ్మూ కశ్మీర్లో ప్రవేశించిన ఇబ్రహీం ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుని ఆ ప్రాంతంలోని జైషే శ్రేణులతో దాడులతో విరుచుకుపడేందుకు ధ్వంసరచనకు పూనుకున్నాడని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జైషే సీనియర్ సభ్యుడు ఉమర్ సైతం 72వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో విధ్వంసం సృష్టించేందుకు అవసరమైన రవాణా సదుపాయాలను సమకూర్చుతున్నట్టు నిఘా వర్గాలు భద్రతా దళాలకు సమాచారం అందించాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో మొత్తం ఆపరేషన్‌ను మసూద్ అజర్ డిప్యూటీ, భారత వ్యతిరేక కార్యకలాపల ఆపరేషనల్ కమాండర్ అస్గర్ పర్యవేక్షిస్తున్నాడు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు భారత భూభాగంలోకి 600 మంది ఉగ్రవాదులను పంపేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉందని ఓ నివేదిక వెల్లడైన క్రమంలో నిఘా వర్గాల తాజా హెచ్చరికతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. -
టెక్సస్‌లో ఉగ్రదాడి కుట్ర భగ్నం
టెక్సస్, అమెరికా : ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రియర్ సెంటర్ షాపింగ్‌మాల్‌పై ఉగ్రదాడి చేసేందుకు కుట్ర పన్నిన యువకుడిని అమెరికా పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ప్లానో వెస్ట్ సీనియర్ హైస్కూల్లో విద్యను అభ్యసిస్తున్న మాటిన్ అజిజీ యరాండ్(17) ఈ కుట్ర పన్నినట్లు అక్కడి మీడియా పేర్కొంది. యరాండ్కు ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెలలో షాపింగ్‌మాల్‌లో తుపాకులతో దాడికి దిగి నరమేథం సృష్టించాలని నిందితుడు భావించినట్లు వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో ఎఫ్‌బీఐకు చెందిన నకిలీ ఉగ్రవాదుల యాప్ ద్వారా సంప్రదింపులు ప్రారంభించాడని తెలిపారు. ఇప్పటికే తాను ఆపరేషన్లను ఎలా నిర్వహించాలి, బాంబులు ఎలా తయారు చేయాలనే అంశాలను ఐసిస్ పుస్తకాల ద్వారా నేర్చుకున్నట్లు వెల్లడించాడు. భవిష్యత్‌లో పాకిస్తాన్ వెళ్లి అక్కడి నుంచి ఆప్ఘనిస్తాన్‌కు వెళ్లి ఐసిస్‌లో చేరుతానని కూడా యారండ్ ఎఫ్‌బీఐ అధికారులకు చెప్పాడు. కాగా, స్టోన్‌బ్రియర్ సెంటర్ షాపింగ్‌మాల్‌పై దాడికి వ్యూహాన్ని రచించిన యారండ్ 1400 డాలర్లు ఖర్చు చేసి తుపాకులను కూడా కొనుగోలు చేశాడు. దీంతో అతనిని టెక్సస్ పోలీసులు అరెస్టు చేసి ఉగ్రవాద కేసును నమోదు చేశారు. -
హెచ్చరిక : భారీ నరమేధానికి కుట్ర!
వాషింగ్టన్ : భారీ నరమేధానికి ఐసిస్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నుతున్నట్లు అమెరికా రణ శాఖ వివిధ దేశాలకు సమాచారం అందజేసింది. ముఖ్యంగా యూరప్ దేశాలకు ప్రధాన హెచ్చరికలు జారీ చేస్తూ.. అక్కడ ఉన్న తమ దేశ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలియజేసింది. క్రిస్మస్, కొత్త సవత్సర వేడుకలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉగ్రదాడుల హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. బ్రిటన్, స్పెయిన్, స్వీడన్, రష్యా, ఫిన్ లాండ్ దేశాలతోపాటు పవిత్ర నగరంగా భావించే వాటికన్ సిటీ కూడా ఆ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. దీనికితోడు ఐసిస్ మీడియా వాఫా విడుదల చేసిన ఓ కొత్త పోస్టర్ మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. మత గురువు పొప్ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. క్రిస్మస్ బ్లడ్ సో వెయిట్... పేరిట విడుదల చేసిన పోస్టర్లో కారులో పక్కనే ఓ తుపాకీతో ఉగ్రవాది దూసుకొచ్చినట్లుగా ఉంది. ఇలాంటివి చాలా కష్టతరమైన దాడులే అయినప్పటికీ.. ఇటీవల వరుసగా జరుగుతున్న ఆత్మాహుతి దాడుల నేపథ్యం పరిశీలిస్తే మాత్రం ఈ హెచ్చరికలను అంత తేలికగా తీసుకోవటానికి వీల్లేదని ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ స్టీవ్ గోమెజ్ చెబుతున్నారు. గత ఏడాది క్రిస్మస్ పర్వదినానే జర్మనీలోని బెర్లిన్ లో దాడులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. ఇస్తాంబుల్(టర్కీ) కూడా ఓ నైట్ క్లబ్ పై కాల్పులు జరపగా... 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలంటూ యూరప్‌తోపాటు పలు ఆసియా దేశాలకు(భారత్ సహా) కూడా అమెరికా ఏజెన్సీ ఎఫ్‌బీఐ హెచ్చరికలను జారీ చేసింది. -
ఐసిస్ సానుభూతిపరుడికి ముగిసిన కస్టడీ
హైదరాబాద్: ఐసిస్ సానుభూతిపరుడు అతావుల్ రెహమాన్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో పోలీసులు అతన్ని నాంపల్లి కోర్టులో హజరుపర్చగా.. ఈ నెల 26 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం రెహమాన్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే కస్టడీ ముగిసిన మరో ముగ్గురు ఐసిస్ సానుభూతిపరులు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. -
మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్
-
మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్
హైదరాబాద్: కస్టడీ ముగియటంతో ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసులో ఏ1గా ఉన్న యజ్దానీ, ఏ2 హబీబ్ అహ్మద్‌ను ఎన్ఐఏ మరో ఎనిమిది రోజుల పాటు కస్టడీ కోరింది. దీంతో మరో ముగ్గురికి న్యాయస్థానం ఈ నెల 26వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇటీవల పాతబస్తీలో అరెస్ట్ చేసిన ఐదుగురిని ఎన్ఐఏ అధికారులు 12 రోజులపాటు విచారణ జరిపి కస్టడీ ముగియటంతో ఇవాళ కోర్టులో హాజరు పరిచారు. వారి వద్ద నుంచి ఎన్ఐఏ కీలక విషయాలను రాబట్టింది. కాగా నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ అధికారులు మరో ఇద్దరు సానుభూతిపరులు యాసిర్ నియమతుల్లా, అత్తావుల్ రెహ్మాన్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అయిదుగురు సానుభూతిపరుల అరెస్ట్ తో వీరిద్దరూ భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకూ ఎన్ఐఏ అధికారులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. కాగా హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)కు చెందిన 11 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఐదుగురిని అరెస్టు చేయగా, మిగిలిన ఆరుగురిని సాక్షులుగా మార్చి విడుదల చేసింది. -
30 రోజులు కస్టడీ కోరిన ఎన్ఐఏ
హైదరాబాద్ : ఐసిస్ సానుభూతిపరుల కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. 30 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా కస్టడీపై అభ్యంతరాలు ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని, నిందితుల తరఫు న్యాయవాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)కు చెందిన 11 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఐదుగురిని అరెస్టు చేయగా, మిగిలిన ఆరుగురిని సాక్షులుగా మార్చి నిన్న విడుదల చేశారు. అరెస్టు చేసిన మహ్మద్ ఇబ్రహీం అలియాస్ ఇబ్బు, హబీబ్ మహ్మద్ అలియాస్ సిర్, మహ్మద్ ఇలియాస్, అబ్దుల్ బిన్ అహ్మద్ అమౌదీ అలియాస్ ఫహద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ లను ఎన్ఐఏ అధికారులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జూలై 14 వరకు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. తదుపరి విచారణ కోసం ఆ ఐదుగురినీ తమ కస్టడీకి అనుమతించాలని కోర్టులో ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరుగుతోంది. -
ఉగ్ర టార్గెట్.. హైదరాబాద్, బెంగళూరు!
అతి త్వరలోనే హైదరాబాద్, బెంగళూరు నగరాలు టార్గెట్‌గా మూడు బృందాలతో విధ్వంసానికి పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలిసింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్(ఏయూటీ)కు చెందిన అనుమానిత ఉగ్రవాదులను బుధవారం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని, విచారించినప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను నాంపల్లి కోర్టులో ప్రవేశపెడతారు. వీరిని పూర్తిగా విచారించేందుకు గాను తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరనుంది. అవసరమైతే పీటీ వారెంటు మీద ఢిల్లీకి కూడా తీసుకెళ్లి విచారిస్తామని చెబుతున్నారు. అనుమానిత ఉగ్రవాదులకు విదేశాల నుంచి భారీగా హవాలా మార్గంలో డబ్బులు అందినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వీరు పెద్ద ఎత్తును ఆయుధాలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. క్రూడ్ బాంబులను తయారుచేయడంలో వీళ్లు నిపుణులని, బ్రసెల్స్ తరహా దాడులకు వీరు కుట్రపన్నారని అంటున్నారు. వీళ్లు తయారుచేసే బాంబులను బ్యాగేజి స్కానర్లతో సైతం గుర్తించలేమని చెబుతున్నారు. కొద్దిరోజుల్లోనే భారీ పేలుళ్లకు వీళ్లు కుట్ర పన్నారని తెలుస్తోంది.