
సార్వత్రిక ఎన్నికలు : ఉగ్రదాడిపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జమ్ము కశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. లష్కరే, జైషే తరహాలో పాకిస్తాన్ ఐఎస్‌ఐ పలు ఉగ్ర సంస్ధలను తయారుచేసిందని, పోలింగ్ బూత్‌లే లక్ష్యంగా ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్ధులపై ఆయా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని పేర్కొంది.
కాగా, కశ్మీర్‌లో ఈ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు సరిహద్దు నుంచి ఆప్ఘనిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులను పంపవచ్చని ఐఎస్‌ఐ అనుమానిస్తోంది. నిఘా వర్గాల సమాచారంతో జమ్మూ కశ్మీర్‌లో బీఎస్‌ఎఫ్ దళాలతో పాటు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల ప్రచారం, పోలింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపింది.