హైదరాబాద్ : ఐసిస్ సానుభూతిపరుల కస్టడీ పిటిషన్పై శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. 30 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా కస్టడీపై అభ్యంతరాలు ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని, నిందితుల తరఫు న్యాయవాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)కు చెందిన 11 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఐదుగురిని అరెస్టు చేయగా, మిగిలిన ఆరుగురిని సాక్షులుగా మార్చి నిన్న విడుదల చేశారు.
అరెస్టు చేసిన మహ్మద్ ఇబ్రహీం అలియాస్ ఇబ్బు, హబీబ్ మహ్మద్ అలియాస్ సిర్, మహ్మద్ ఇలియాస్, అబ్దుల్ బిన్ అహ్మద్ అమౌదీ అలియాస్ ఫహద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ లను ఎన్‌ఐఏ అధికారులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జూలై 14 వరకు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. తదుపరి విచారణ కోసం ఆ ఐదుగురినీ తమ కస్టడీకి అనుమతించాలని కోర్టులో ఎన్‌ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరుగుతోంది.
30 రోజులు కస్టడీ కోరిన ఎన్ఐఏ
Published Fri, Jul 1 2016 2:35 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
Advertisement
Advertisement