హైదరాబాద్: కస్టడీ ముగియటంతో ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసులో ఏ1గా ఉన్న యజ్దానీ, ఏ2 హబీబ్ అహ్మద్ను ఎన్ఐఏ మరో ఎనిమిది రోజుల పాటు కస్టడీ కోరింది. దీంతో మరో ముగ్గురికి న్యాయస్థానం ఈ నెల 26వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇటీవల పాతబస్తీలో అరెస్ట్ చేసిన ఐదుగురిని ఎన్ఐఏ అధికారులు 12 రోజులపాటు విచారణ జరిపి కస్టడీ ముగియటంతో ఇవాళ కోర్టులో హాజరు పరిచారు. వారి వద్ద నుంచి ఎన్‌ఐఏ కీలక విషయాలను రాబట్టింది.
కాగా నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ అధికారులు మరో ఇద్దరు సానుభూతిపరులు యాసిర్ నియమతుల్లా, అత్తావుల్ రెహ్మాన్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అయిదుగురు సానుభూతిపరుల అరెస్ట్ తో వీరిద్దరూ భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకూ ఎన్ఐఏ అధికారులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. కాగా హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)కు చెందిన 11 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఐదుగురిని అరెస్టు చేయగా, మిగిలిన ఆరుగురిని సాక్షులుగా మార్చి విడుదల చేసింది.
మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్
Published Tue, Jul 12 2016 1:55 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
Advertisement