శ్రీనగర్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై ఉగ్రవాదులు అమర్చిన సుమారు 25 నుంచి 30 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసింది సైన్యం. 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఐఈడీని గుర్తించటం భారీ విధ్వంసాన్ని అడ్డుకున్నట్లయిందన్నారు .
‘పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై సుమారు 25-30 కిలోలు ఉన్న ఐఈడీని పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పుల్వామా పోలీసులకు అందిన సమాచారంతో భారీ విధ్వంసాన్ని అడ్డుకోగలిగాం.’ అని తెలిపారు కశ‍్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్. అంతకు ముందు రోజు ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు ఉన్న ఓ ఉగ్రవాదిని ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్ పట్టుకుంది. అతడు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఐఈడీలు పేల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు సబౌద్దిన్‌పై లక్నోలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రాహుల్ గాంధీ పోటీ చేస్తారా?
Comments
Please login to add a commentAdd a comment