terroists attacks
-
USA: న్యూ ఇయర్ వేళ ఉగ్రదాడి.. 15కు చేరిన మరణాలు
వాషింగ్టన్: కొత్త ఏడాది వేడుకల వేళ అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోయిన జనంపైకి ఓ ఆగంతకుడు ట్రక్కుతో ఢీకొట్టి, తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 15 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఇందుకు కారణమైన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపడంతో అతడు చనిపోయాడు. ఘటనపై ఉగ్ర చర్య కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోంది.ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐ కీలక ప్రకటన చేసింది. న్యూ ఆర్లీన్స్‌లో పికప్ ట్రక్‌తో బీభత్సం సృష్టించిన నిందితుడిని షంషుద్దీన్ జబ్బార్(42)గా ఎఫ్‌బీఐ గుర్తించింది. అతడు అమెరికా పౌరుడే. టెక్సాస్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా జబ్బార్ పనిచేస్తున్నాడు. ఏడేళ్లు మిలిటరీలోనూ సేవలు అందించాడు. అయితే, ఆర్థిక కారణాలు ఎదుర్కొంటున్న జబ్బార్‌కు భార్యతో విడాకులు అయ్యాయి. కాగా, ప్రమాదం తర్వాత అతడి వాహనంలో ఐసీస్ ఉగ్రవాద సంస్థ జెండా లభించింది. దీంతో, ఈ ఘటన టెర్రరిస్ట్‌ల పన్నాగమేనని ఎఫ్‌బీఐ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.New video of last night’s terror attack in New Orleans 😡😡 pic.twitter.com/7Zrab642ab— KellyCurrie45 (@KaCurrie_45) January 1, 2025ఇదిలా ఉండగా.. లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూఆర్లీన్స్‌లోని బార్బన్ వీధి కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాదిలాగే ఈసారీ వేల మంది ఈ వేడుకల కోసం తరలివచ్చారు. దీంతోపాటు బుధవారం సాయంత్రం సమీపంలోని స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఉండటంతో మరింత మంది ఈ ప్రాంతానికి ముందుగానే వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3.15 సమయంలో వారంతా సంబరాల కోసం రోడ్డుపై ఉండగా దుండగుడు వాహనంతో వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా.. మరో 35 మంది గాయపడ్డారు. దాడి అనంతరం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో, పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో జబ్బార్ అక్కడికక్కడే మృతిచెందాడు.#ShamsudDinJabbar also Muhammad Shamsuddin Jabbar is the #NewOrleansMassacre terrorist. It looks like he may have some Middle Eastern / South Asian ancestry, desides his dominant black ancestry. #NewOrleansHorror #NewOrleansTerroristAttack #NewOrleansStrong pic.twitter.com/PihoTkf0Qi— Dr. Asim Yousafzai (@asimusafzai) January 2, 2025 బైడెన్ సంతాపం..ఈ ఘటనపై ఉగ్ర కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ప్రతి అంశాన్నీ పరిశీలించి ఏం జరిగిందో తెలుసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించానని పేర్కొన్నారు. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి వచ్చిన వారు విగత జీవులుగా మారడంతో తన హృదయం బరువెక్కిపోయిందని వెల్లడించారు. ఎటువంటి హింసనూ సహించేది లేదని స్పష్టం చేశారు. -
రష్యా మాస్కోలో ఐసిస్ ఉగ్రదాడి
-
చొరబాటుకు యత్నించిన ముగ్గురు పాక్ తీవ్రవాదులు హతం
శ్రీనగర్: బారాముల్లా ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ముగ్గురు పాక్ తీవ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత భూభాగమైన యూరిలోకి చొరబడేందుకు ప్రయత్నించగా భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, గూఢచారి ఏజెన్సీలు చేసిన జాయింట్ ఆపరేషన్‌లో ముగ్గురూ మృతి చెందినట్లు చినార్ కార్ప్స్ ఇండియన్ ఆర్మీ ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించింది. ఇండియన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం బారాముల్లా వద్ద పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ముగ్గురు తీవ్రవాదులు వాస్తవాధీన రేఖను దాటుకుని యురి వైపుగా వస్తుండటాన్ని గమనించి సైనికులు అప్రమత్తమై కాల్పులు జరిపారని దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పాకిస్తాన్ దళాలు మాపై కాల్పులు జరపడంతో మరో మృతదేహాన్ని క్యాప్చర్ చేయడం సాధ్యపడలేదని తెలిపారు. మూడో మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్తుండగా పాక్ దళాలు కాల్పులు జరపడం 2021లో వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు విరమణకు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. యురి సెక్టార్లో ఇప్పటికీ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. Update Op Khanda, #Uri A Joint operation was launched today morning in Uri Sector. Contact established & firefight ensued. 03xTerrorists eliminated. 02xAK Rifles, 01xPistol, 07xHand Grenades, 01xIED and other war like stores along with Pak Currency Notes recovered. Joint… — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) September 16, 2023 ఇది కూడా చదవండి: మాటలు జాగ్రత్త.. విద్వేషాలను రెచ్చగొట్టకూడదు -
మూడు దఫలుగా హైదరాబాద్ మాడ్యూల్ ప్లాన్
-
జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
శ్రీనగర్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై ఉగ్రవాదులు అమర్చిన సుమారు 25 నుంచి 30 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసింది సైన్యం. 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఐఈడీని గుర్తించటం భారీ విధ్వంసాన్ని అడ్డుకున్నట్లయిందన్నారు . ‘పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై సుమారు 25-30 కిలోలు ఉన్న ఐఈడీని పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పుల్వామా పోలీసులకు అందిన సమాచారంతో భారీ విధ్వంసాన్ని అడ్డుకోగలిగాం.’ అని తెలిపారు కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్. అంతకు ముందు రోజు ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్న ఓ ఉగ్రవాదిని ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్ పట్టుకుంది. అతడు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఐఈడీలు పేల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు సబౌద్దిన్పై లక్నోలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? -
New Zealand: ముగ్గురి పరిస్థితి విషమం: ప్రధాని జెసిండా
న్యూజిలాండ్ ఉగ్రదాడిలో గాయపడిన ఏడుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. శనివారం ఉదయం మీడియాను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. భావోద్వేగానికి లోనయ్యారు. దాడి జరిగిన క్షణాల్లోనే తీవ్రవాదిని పోలీసులు మట్టుబెట్టినట్లు ఆమె వివరించారు. ఆక్లాండ్ సీటి న్యూలిన్ షాపింగ్ మాల్లోని కౌంట్‌డౌన్ సూపర్ మార్కెట్లో శుక్రవారం (సెప్టెంబర్ 3న) ఓ తీవ్రవాది కత్తితో విచక్షణరహితంగా జనాలపై దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిలో మొత్తం ఏడుగురు గాయపడగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దాడి సమయంలో అప్రమత్తమైన పోలీసులు తీవ్రవాదిని కాల్చి చంపారు. తీవ్రవాది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌నకు చెందిన ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాది అని, శ్రీలంక నుంచి న్యూజిలాండ్‌కు వచ్చాడని, కోర్టు ఆదేశాల మేరకు ఇంతకు మించి పూర్తి వివరాలను వెల్లడించలేమని జెసిండా అన్నారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపే క్రమంలో ఆమె కంటతడి పెట్టారు. కత్తుల అమ్మకం బంద్ తాజా ఉగ్రదాడి నేపథ్యంలో కౌంట్‌డౌన్ సూపర్ మార్కెట్.. కత్తులను అమ్మకాల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దాడికి పాల్పడే ముందు షాపింగ్ చేసినట్లు నటించిన ఉగ్రవాది.. అక్కడి కత్తితోనే దాడికి పాల్పడడం విశేషం. ఇక దాడికి ముందు ఉగ్రవాది బస చేసినట్లుగా భావిస్తున్న ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చదవండి: తాలిబన్ల సంబరాలు.. అమాయకుల మృతి -
Danish Siddiqui: ఫొటోజర్నలిస్ట్ హత్యలో చేదు నిజాలు
ఇండియన్ ఫొటోజర్నలిస్ట్, పులిట్జర్ గ్రహీత డానిష్ సిద్ధిఖీ(38) మరణం.. జర్నలిస్ట్ ప్రపంచంలో విషాదం నింపిన విషయం తెలిసిందే. కాందహార్ స్పిన్ బోల్దక్ వద్ద అఫ్ఘన్ సైన్యం-తాలిబన్ల మధ్య పోరును కవరేజ్ చేసే టైంలో ఆయన మరణించారు. అయితే ఆయన సాధారణ కాల్పుల్లో మరణించలేదని, తాలిబన్ల చేతుల్లో క్రూరంగా హత్యకు గురయ్యాడని ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. న్యూయార్క్: ఇండియన్ ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ తాలిబన్ల కాల్పుల్లో చనిపోయాడని అఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమ ప్రమేయం లేదని చెబుతూ.. డానిష్ మృతిపై తాలిబన్లు సంతాపం కూడా ప్రకటించారు. అయితే తాలిబన్లు కావాలనే ఆయన్ని హింసించి చంపారని చెబుతూ.. ఈమేరకు వాషింగ్టన్కు చెందిన ఓ మ్యాగ్జైన్ గురువారం ఓ కథనం ప్రచురించింది. ‘‘ఆరోజు మిస్టర్ సిద్ధిఖీ అఫ్ఘన్ సైన్య బలగాలతో బయలుదేరారు. అయితే కొద్దిదూరం వెళ్లాక తాలిబన్ దాడితో వాళ్లంతా చెల్లాచెదురయ్యారు. ఈ దాడిలో సిద్ధిఖీ గాయపడగా, స్థానికంగా ఉన్న ఓ మసీదులోకి వెళ్లి వాళ్లంతా తలదాచుకున్నారు. అక్కడే ఆయనకు ఫస్ట్ ఎయిడ్ కూడా చేశారు. అయితే ఆయన మసీదులో ఉన్న విషయం నిర్ధారించుకున్నాకే తాలిబన్లు.. దాడికి తెగబడ్డారు. ప్రాణాలతో పట్టుకుని.. ఆయన సిద్ధిఖీ అని నిర్ధారించుకున్నాకే ప్రాణం తీశారు. సిద్ధిఖీని కాపాడే క్రమంలోనే అఫ్ఘన్ కమాండర్, మిగతా సభ్యులు మరణించారు’’ అని ఆ కథనం పేర్కొంది. ‘‘భారత ప్రభుత్వ సహకారంతో సిద్ధిఖీ మృతదేహం ఫొటోలు, వీడియోలు నేనూ కొన్ని పరిశీలించా. ఆయన తల చుట్టూ గాయాలున్నాయి. బహుశా ఆయన్ని కొట్టి హింసించి ఆపై కాల్పులు జరిపి చంపి ఉంటార’’ని ఏఈఐ సీనియర్ రైటర్ మైకేల్ రుబెన్ అభిప్రాయపడ్డారు. సిద్ధిఖీని వేటాడి చంపాలన్న ఉద్దేశం వాళ్ల(తాలిబన్ల)లో స్పష్టంగా కనిపిస్తోందని, అంతర్జాతీయ సమాజం-యుద్ధ నిబంధనలు, ఉల్లంఘనలు, శాంతిసామరస్యాలు లాంటివి వాళ్ల పరిధిలో లేవనే విషయం స్పష్టమవుతోందని ఆయన ఆ కథనంలో రాశారు. మరి తమ ప్రమేయం లేదని బుకాయిస్తున్న తాలిబన్లు.. ఈ అమెరికా కథనంపై ఎలా స్పందిస్తారో చూడాలి. ముంబైకి చెందిన డానిష్ సిద్ధిఖీ.. నేషనల్ రూటర్స్ మల్టీమీడియా టీం హెడ్‌గా పని చేశారు. అరుదైన ఫొటోలతో అంతర్జాతీయ గుర్తింపును దక్కించుకున్నారు. రొహింగ్యా శరణార్థుల సంక్షోభాన్ని తన ఫొటోలతో కళ్లకు కట్టినట్లు చూపించి.. 2018లో ఆయన పులిట్జర్ ప్రైజ్‌అందుకున్నాడు. 2021 జులై 15న పాక్ సరిహద్దు వద్ద అఫ్ఘన్ సైన్యానికి-తాలిబన్లకు మధ్య జరిగిన పోరును కవర్ చేయడానికి వెళ్లిన ఆయన దారుణ హత్య గురయ్యారు. జర్మన్ సంతతికి చెందిన రికే ఆయన భార్య. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్ భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం : యూపీ
-
బస్సులో బాంబు పేలుడు.. 11 మంది మృతి
కాబూల్: అమెరికా దళాలు వెనుదిరుగుతున్న వేళ ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడిలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 11 మంది మృతి చెందారు. బాంబు పేలిన వెంటనే బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారి ప్రకటించారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని పశ్చిమ ప్రావిన్స్ అయిన బాద్ఘిస్ నగరంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు. కాగా, ఇది తాలిబన్ల పనేనని బాద్ఘిస్ గవర్నర్ హెసాముద్దీన్ షామ్స్ ఆరోపించారు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్థాన్‌లో బస్సుపై బాంబు దాడి జరగడం ఈ వారంలో ఇది రెండోసారి. చదవండి: India: ఆకలి రాజ్యం -
ఎల్వోసీ వద్ద కాల్పులు; 8 మంది ఉగ్రవాదుల హతం
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్‌లోని కీరన్ సెక్టార్ పరిధిలో ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసి)కు ఎదురుగా ఉన్న దూద్‌నైల్లో ఇండియన్ ఆర్మీ పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టుంది. దూద్‌నైల్‌లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్ల వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులతో పాటు 15 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. అయితే ఈ కాల్పులు ఏప్రిల్10 వ తేదిన జరిగినట్లు వెల్లడించారు. కిషన్‌గంగా నది ఒడ్డున పాక్ ఉగ్రవాదులు కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ దూద్‌నైల్‌పై దాడులు జరిపి ప్రతీకార చర్యలు తీసుకోవాలని భావించింది. అయితే అప్పటికే సమాచారం అందుకున్న భారత మిలటరీ విభాగం కీరన్ సెక్టార్‌కు చేరుకుని ముందుగా 8 మంది ఉగ్రవాదులను కాల్చి చంపారు. మరణించిన వారిలో ముగ్గురు జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారు కాగా మిగతా వారు జైష్-ఇ-మొహమ్మద్ నుంచి శిక్షణ పొందిన వారిగా గుర్తించారు. అయితే ఏప్రిల్ 10న కీరన్ సెక్టార్లో జరిగిన దాడిలో ఉగ్రవాదులతో పాటు 15 మంది పాకిస్తాన్ ఆర్మీ ట్రూపర్లతో కూడా మరణించినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. -
భారత్‌కు ఉగ్రదాడి హెచ్చరికలు..!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో భారీ ఉగ్రదాడికి పాల్పడేందుకు ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత నిఘావర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాద సంస్థలపై గత కొంత కాలం నుంచి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతీకారంగా ఆత్మహుతి దాడికి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు భద్రతాదళాల సమాచారం. పాక్ సరిహద్దులోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై 2016లో భారీ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి దాడికి ఆల్‌ఖైదా వ్యూహాలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పాక్ ప్రేరేపిత సంస్థ జైషే మహ్మద్ చర్యలను భారత్ ఇటీవల తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌పై ప్రతీకారం తీర్చుకేనేందుకు ఆల్‌ఖైదాకు జైషే మహ్మద్ సహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా బలగాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. సరిహద్దు వెంబడి పహారాను పటిష్టంచేసింది. కాగా నేడు దేశ వ్యాప్తంగా రంజాన్ పర్వదినం కావడంతో మసీదుల వద్ద భారీ బందోబస్తులను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను ఏర్పాటు చేశారు. -
9/11 ఉగ్రదాడి కేసు : రూ.600 కోట్ల పరిహారం
న్యూయార్క్ : అమెరికాపై ఆల్‌ఖైదా ఉగ్రవాదులు 2001, సెప్టెంబర్ 11న దాడి చేసిన ఘటనలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్లు రెండు ధ్వంసం అయ్యాయి. ఆ రెండు భారీ ఆకాశహర్మ్యాలను రెండు విమానాలు ఢీకొనడంతో ఈ విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌తోపాటు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థలకు చెందిన విమానాలతో ఉగ్రవాదులు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను పేల్చేశారు. అయితే ఇప్పుడు ఆ దాడి కేసులో ఓ సెటిల్మెంట్ జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్న లారీ సిల్వర్‌స్టన్ 12.3 బిలియన్ల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా తాము రూ.600 కోట్లు చెల్లించేందుకు రెండు విమాన సంస్థలు అంగీకారాన్ని తెలిపాయి. రెండు భారీ బిల్డింగ్లు నేలకూలిన కేసులో ఇప్పటికే ఆయనకు 4.55 బిలియన్ డాలర్ల బీమా అందింది. ఇప్పుడు తాజాగా విమాన సంస్థలు కూడా సిల్వర్‌స్టన్‌తో నష్టపరిహాం కేసులో సెటిల్మెంట్ చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం కుదిరిన ఒప్పందానికి అమెరికా కోర్టు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఉగ్రవాదులు ట్విన్ టవర్స్ కూల్చివేసిన ఘటనలో సుమారు 2700 మంది చనిపోయిన విషయం తెలిసిందే. -
పాక్‌లో ఉగ్రదాడి : 60 మంది పోలీసులు మృతి
-
పాక్‌లో ఉగ్రదాడి : 59 మంది పోలీసులు మృతి
-
పాక్‌లో ఉగ్రదాడి : 59 మంది పోలీసులు మృతి
క్వెట్టా: పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. క్వెట్టాలోని పోలీసుల శిక్షణా శిబిరంపై ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాకెట్లతో శిక్షణా శిబిరంలోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు 59 మంది పోలీసులు దుర్మరణం చెందగా... పలువురు తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. ఉగ్రవాదులు ముందుగా వాచ్ టవర్ సెంట్రీని లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించారనీ, ఆ తరువాత శిక్షణా శిబిరంలోకి ప్రవేశించారని పేర్కొంది. ఈ దాడి సమయంలో పోలీసుల శిక్షణా శిబిరంలో 600మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. భద్రతా సిబ్బంది 250 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాగా, కొంతమంది పోలీసులు ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్నట్టు తెలిసింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయినట్లు పాక్ మీడియా ప్రకటించింది. నిషిద్ధ అల్‌ఖైదాకు అనుబంధంగా ఉండే లష్కరే జంగవి ఉగ్రవాదుల పనేనని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.