న్యూయార్క్ : అమెరికాపై ఆల్‌ఖైదా ఉగ్రవాదులు 2001, సెప్టెంబర్ 11న దాడి చేసిన ఘటనలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్‌లు రెండు ధ్వంసం అయ్యాయి. ఆ రెండు భారీ ఆకాశహర్మ్యాలను రెండు విమానాలు ఢీకొనడంతో ఈ విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌తోపాటు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థలకు చెందిన విమానాలతో ఉగ్రవాదులు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను పేల్చేశారు. అయితే ఇప్పుడు ఆ దాడి కేసులో ఓ సెటిల్‌మెంట్ జరిగింది.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్న లారీ సిల్వర్‌స్టన్ 12.3 బిలియన్ల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా తాము రూ.600 కోట్లు చెల్లించేందుకు రెండు విమాన సంస్థలు అంగీకారాన్ని తెలిపాయి. రెండు భారీ బిల్డింగ్‌లు నేలకూలిన కేసులో ఇప్పటికే ఆయనకు 4.55 బిలియన్ డాలర్ల బీమా అందింది. ఇప్పుడు తాజాగా విమాన సంస్థలు కూడా సిల్వర్‌స్టన్‌తో నష్టపరిహాం కేసులో సెటిల్‌మెంట్ చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం కుదిరిన ఒప్పందానికి అమెరికా కోర్టు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఉగ్రవాదులు ట్విన్ టవర్స్ కూల్చివేసిన ఘటనలో సుమారు 2700 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment