
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల కలకలం సృష్టిస్తున్నాయి. పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు నాలుగు రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
బుధవారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్ మానీ బల్లా రోడ్డు, ఫాల్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్ల వాహనంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని డిఫెన్స్ అధికార ప్రతినిథి తెలిపారు.
ఉగ్రవాదుల కాల్పులపై సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని డిఫెన్స్ అధికార ప్రతినిథి వెల్లడించారు. అనంతరం, ఉగ్రవాదుల ఏరివేతకు సెర్చ్ ఆపరేషన్‌ను మొదలు పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం, ఉగ్రవాదుల కోసం సుందర్ బానీ ఏరియా మొత్తాన్ని ఆర్మీ జవాన్లు జల్లెడ పడుతున్నారు.