Army vehicle
-
పూంచ్‌లో జిల్లాలో ఆర్మీ కాన్వాయ్‌పై మరోసారి ఉగ్రదాడి..
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పూంచ్ జిల్లాలో ఖనేటర్ ప్రాంతంలో వెళుతున్న భారత ఆర్మీ కాన్వాయ్‌పై శుక్రవారం సాయంత్రం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. సమీపంలోని కొండపై నుంచి జవాన్లపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సైనిక బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందిన సమాచార మేరకు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలుస్తోంది. సంఘటన స్థలంలో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. కాగా దాడికి గురైన ఆర్మీ కాన్వాయ్‌లో అనేక వాహనాలు ఉన్నట్లు సమాచారం. కాగా నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో సహా ఉన్నత స్థాయి అధికారులు ప్రస్తుతం పూంచ్‌లోనే ఉన్నారు. అక్కడ తరుచూ జరుగుతున్న తీవ్రవాద దాడులను ఎదుర్కొనేందుకు వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరగడం గమనార్హం. గత ఆరు ఏడు నెలల్లో పిర్ పంజాల్ ప్రాంతంలో( రాజౌరీ, పూంచ్) ఉగ్రదాడులు ఎక్కువయ్యాయని, ఈ కాలంలో అధికారులు కమాండోలతో సహా 20 మంది సైనికులు మరణించారు. ఇక నెల రోజుల వ్యవధిలో పూంచ్ జిల్లాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. మూడు వారాల క్రితం పూంచ్ జిల్లాలో భద్రతా బలగాల వాహానాలపై ముష్కరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. ఈ దాడుల వెనక పాకిస్థాన్ - చైనా పన్నిన కుట్ర దాగుందని భారత రక్షణశాఖ వర్గాలు విశ్వసించాయి. -
army vehicles attacked: దాడి వెనుక పాక్, చైనా
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం ఆర్మీ వాహనాలపై దాడి వెనుక పాక్, చైనాల హస్తముందని రక్షణ శాఖ వర్గాలు అంటున్నాయి. లద్దాఖ్ సరిహద్దుల్లో భారీగా మోహరించిన ఆర్మీని మరోవైపు తరలించేలా భారత్‌పై ఒత్తిడి పెంచేందుకే ఆ రెండు దేశాలు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నాయి. కశ్మీర్ లోయలో ముఖ్యంగా పాక్ సరిహద్దుల్లో ఉన్న పూంఛ్, రాజౌరీ సెక్టార్లలో భారత ఆర్మీ లక్ష్యంగా ఇటీవల పెరిగిన ఉగ్ర దాడుల ఘటనలకు చైనా, పాకిస్తాన్ల ఉమ్మడి వ్యూహమే కారణమని చెబుతున్నాయి. ఆర్మీపై దాడుల ద్వారా భారత్‌ను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ఇప్పటికే పూంఛ్ అటవీ ప్రాంతాల్లోకి 25 నుంచి 30 మంది వరకు ఉగ్రవాదులను దొంగచాటుగా పంపించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. కశ్మీర్ వైపు దృష్టి మళ్లించేందుకే.. గల్వాన్ సంక్షోభం అనంతరం భారత్ లద్దాఖ్‌కు భారీగా సైన్యాన్ని తరలించడం చైనాకు రుచించడం లేదు. అందుకే తిరిగి కశ్మీర్ వైపు భారత్ దృష్టిని మళ్లించేందుకే, పాక్‌తో కుమ్మక్కయి పశ్చిమ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని రాజేసేందుకు పూనుకుంది. భారత్ 2020లో ప్రత్యేక శిక్షణ పొందిన రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలను పూంఛ్ నుంచి లద్దాఖ్‌కు భారత్ తరలించింది. ఈ చర్యతో ఎంతో కీలకమైన లద్దాఖ్ ప్రాంతంలో చైనాపై భారత్‌దే పైచేయి అయ్యింది. అయితే, అదే సమయంలో పూంఛ్‌లో ఉగ్రవాదులను నిలువరించే వనరులు తక్కువపడ్డాయి. ఈ విషయం గ్రహించిన చైనా పూంఛ్‌లో పాక్‌కు దన్నుగా నిలుస్తూ ఉగ్ర చర్యలకు ఊతమివ్వసాగిందని రక్షణ రంగ నిపుణుడు కల్నల్ మనోజ్ కుమార్ చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో కడుపుమంట జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుపై చైనా, పాకిస్తాన్‌లు అసంతృప్తితో రగిలిపోతు న్నాయి. అందుకే, కశ్మీర్లో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్న పూంఛ్, రాజౌరీల్లో అశాంతిని ప్రేరేపించేందుకు కాచుక్కూర్చు న్నాయని రిటైర్డు కల్నల్ అజయ్ కొథియాల్ చెప్పారు. తాజాగా, సుప్రీంకోర్టు కూడా రద్దు సరైందేనని తీర్పు ఇవ్వడం ఆ రెండు దేశాలకు పుండుమీద కారం చల్లినట్లయిందన్నారు. ఇకపై జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు అవి ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశాలున్నాయన్నారు. అమెరికా తయారీ రైఫిళ్లు: గురువారం నాటి దాడికి తమదే బాధ్యతంటూ పాక్ కేంద్రంగా పనిచేసే లష్కరేతోయిబా అనుబంధ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. దాడికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో విడుదల చేశారు. వారి చేతుల్లో అమెరికా తయారీ అత్యాధునిక ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిళ్లు కూడా కనిపిస్తున్నాయి. గతంలోనూ ఉగ్రవాదులు వీటిని వాడిన దాఖలాలున్నాయి. హెలికాప్టర్లు.. స్నైపర్ డాగ్స్ పూంచ్ జిల్లాలో అయిదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ముష్కరుల కోసం గాలింపు ముమ్మరమైంది. గురువారం మధ్యాహ్నం సురాన్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధేరా కి గలి– బఫ్లియాజ్ మార్గంలో ఉన్న ధట్యార్ మోర్హ్ సమీపంలోని మలుపులో ఎత్తైన కొండపై ఉగ్రవాదులు పొంచి ఉన్నారు. బలగాలతో వెళ్తున్న రెండు వాహనాల వేగం బ్లైండ్ కర్వ్‌లో నెమ్మదించగానే ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో అయిదుగురు జవాన్లు నేలకొరగ్గా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ముష్కరులు ఇద్దరు జవాన్ల మృతదేహాలను ఛిద్రం చేయడంతోపాటు వారి వద్ద ఉన్న ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు లేదా నలుగురు ముష్కరులు పాల్గొని ఉంటారని ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)అధికారులు తెలిపారు. ఘటన అనంతరం పరారైన ఉగ్రవాదుల కోసం అటవీ ప్రాంతంలో హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. ఉగ్రవాదుల జాడను పసిగట్టేందుకు స్నైపర్ జాగిలాలను రంగంలోకి దించారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసిన బలగాలు శుక్రవారం ఉదయం నుంచి అణువణువూ శోధిస్తున్నాయి. -
డ్రింక్ చేసి.. సీన్ క్రియేట్ చేసిన మోడల్
భోపాల్: తాగి నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వల్ల ఎన్నో నిండు ప్రాణాలు బలైపోతున్న ఘటనలను ఈ మధ్య మనం తరుచు చూస్తున్నాం . వాటిని కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న అవి సఫలం కావటం లేదు. అంతేకాదు మరికొంత మంది డ్రింక్ చేసి రోడ్ల పైకి వచ్చి హల్చల్ చేసి పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడి....ట్రాఫ్రిక్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారవుతోంది. తాజాగా అలాంటి సంఘటనే గాల్వియార్‌లో చోటు చేసుకుంది. (చదవండి: బాలకార్మికుడి స్థాయి నుంచి గురువుగా!) మధ్యప్రదేశ్‌లోని గాల్వియార్‌లో ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల ఒక మోడల్ రద్దీ రహదారి పైకీ వచ్చి ఆర్మీ వాహనాన్ని అడ్డుకుని ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. దీంతో ఆ కారు డ్రైవర్ జోక్యం చేసుకుని ఆమెని వారించటానికీ ప్రయత్నిస్తుంటే ..ఆమె అతన్ని పక్కకు నెట్టేసి వాదనకు దిగింది. ఈ క్రమంలో పోలీసులు వచ్చి ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తర్వాత ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆ ఆర్మీ అధికారి ఆమె పై ఎలాంటి కంప్లయింట్ ఇవ్వలేదని పోలీసు అధికారి చెప్పారు. సదరు మోడల్ గాల్వియార్‌లో పర్యటించటానికి వచ్చినట్టుగా పేర్కొన్నారు.(చదవండి: డాక్టరేట్ గ్రహీత.. మాజీ అథ్లెట్.. మాజీ టీచర్‌కు దయనీయ పరిస్థితి) -
ఆర్మీ వాహనంపై ఉగ్ర దాడి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అరిహల్‌లో ఆర్మీ అధికారుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఈ దాడికి ఉగ్రవాదులు శక్తిమంతమైన ఇంప్రొవైస్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని వినియోగించారు. ఫిబ్రవరి 14న ఓ సూసైడ్ బాంబర్ 40 మంది సీఆర్పీఎఫ్ అధికారులను బలితీసుకున్న ప్రాంతానికి ఇది కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే జరగడం గమనార్హం. 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఈ ఆర్మీ వాహనం బుల్లెట్, మైన్ ప్రూఫ్ కావడంతో సైన్యానికి పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని అరిహల్ లస్సిపురా రోడ్డు మీద ఈ దాడి జరిగింది. అనంతరం పరిస్థితిని అదుపులోకి తేవడానికి మరికొంత మంది సిబ్బందిని రప్పించి, గాల్లోకి కాల్పులు జరిపామని అధికారులు తెలిపారు. చిన్నగాయాలు మినహా ఏ నష్టమూ జరగలేదని, ఉగ్రవాదులు చేసిన దాడి విఫలమైందని కల్నల్ రాజేష్ కలియా అన్నారు. బాంబుదాడి అనంతరం కూడా సోదాలు కొనసాగాయని అన్నారు. అయితే పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేయనున్నారని పాకిస్తాన్ ముందే హెచ్చరించడం గమనార్హం. పాక్ చెప్పడానికి కారణాలేంటి? అల్‌కాయిదాకు అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాది జకీర్ మూసాను చంపినందుకు ప్రతీకారంగా భారత్‌లో దాడులు చేయాలని ఉగ్రవాదులు నిర్ణయించుకున్నట్లు తమకు సమాచారం అందిందని పాక్ ఇటీవల భారత ప్రభుత్వానికి తెలిపింది. ఈ దాడులు అమర్నాథ్ యాత్రకు ముందుగానీ, తర్వాతగానీ దాడులు చేసేందుకు ఉగ్రమూకలు సిద్ధంగా ఉన్నారంది. 2016లో కూడా పాక్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ జాంజువా అప్పటి భారత జాతీయ భద్రతా సలహాదారు ధోవల్‌కు గుజరాత్లో 26/11 లాంటి దాడులు నిర్వహించేందుకు ఉగ్రవాదులు పథకం పన్నారని తెలిపారు. పాక్ ఇలాంటి హెచ్చరికలు చేయడంపై పలు అనుమానాలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ సమాజంలో తాము ఉగ్రవాదానికి వ్యతిరేకులమన్న సందేశాన్ని వ్యాప్తి చేయడమే పాక్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. -
కశ్మీర్లో ఆర్మీ వాహనంపై రాళ్లవర్షం
పుల్వామా/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. గస్తీకి వెళ్లివస్తున్న ఆర్మీ వాహనంపై రాళ్లవర్షం కురిపించారు. దీంతో తొలుత హెచ్చరించిన అనంతరం ఆర్మీ అధికారులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయమై ఆర్మీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..నౌపొరా ప్రాంతంలో రాంగ్ పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆ వాహనాలను పక్కకు తీయాలని కోరేందుకు ఆర్మీ అధికారులు వాహనం దిగారని,ఆందోళనకారులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని ఆర్మీ వాహనంపై రాళ్లదాడికి పాల్పడ్డారని వెల్లడించారు. మరోవైపు కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. శ్రీనగర్‌లోని కక్ సరాయ్ ప్రాంతంలో శుక్రవారం వాహనాల తనిఖీలు చేపడుతున్న భద్రతాబలగాలు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులతో పాటు ముగ్గురు పౌరులు గాయపడినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఆర్మీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
వేగంగా వెళ్తున్న ఆర్మీ వాహనం రోడ్డు దాటుతున్న బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. వేగంగా వెళ్తున్న ఆర్మీ వాహనం ద్విచక్రవాహానాన్ని ఢీకొనడంతో బైక్‌పై ఉన్న మగ్బూల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సుచిత్ర వద్ద ఆర్మీ వాహనం బీభత్సం
హైదరాబాద్ : వేగంగా వెళ్తున్న ఆర్మీ వ్యాను ముందు వెళ్తున్న పల్సర్ వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డు దాటుతున్న మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా .. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నగరంలోని బోయినపల్లి సమీపంలోని సుచిత్రా గార్డెన్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. వివరాలు... సుచిత్ర నుంచి బోయిన్పల్లి వైపు వస్తున్న ఆర్మీ వ్యాను ముందు వెళ్తున్న పల్సర్ బైకును ఢీకొట్టింది. దీంతో దానిపై ప్రయాణిస్తున్న మహిళకు తీవ్రగాయాలు కాగా.. బైకు నడుపుతున్న పురుషుని కాలు విరిగింది. అనంతరం రోడ్డు దాటుతున్న మరో వాహనాన్ని(ప్యాషన్) ఢీ కొట్టింది. దీంతో వాహనం పైన ఉన్న అంబులెన్స్ డ్రైవర్ లక్ష్మణ్ (37) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత అటువైపు నుంచి వస్తున్న స్కూటీని ఢీకొంది. దీంతో ఆ వాహనదారునికి కూడా తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.