సుచిత్ర వద్ద ఆర్మీ వాహనం బీభత్సం | Army vehicle crushes man to death in Hyderabad | Sakshi

సుచిత్ర వద్ద ఆర్మీ వాహనం బీభత్సం

Published Wed, Aug 5 2015 11:42 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

వేగంగా వెళ్తున్న ఆర్మీ వ్యాను ముందు వెళ్తున్న పల్సర్ వాహనాన్ని ఢీకొట్టింది.

హైదరాబాద్ : వేగంగా వెళ్తున్న ఆర్మీ వ్యాను ముందు వెళ్తున్న పల్సర్ వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డు దాటుతున్న మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా .. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ఘటన నగరంలోని బోయినపల్లి సమీపంలోని సుచిత్రా గార్డెన్ వద్ద బుధవారం చోటు చేసుకుంది.

వివరాలు... సుచిత్ర నుంచి బోయిన్‌పల్లి వైపు వస్తున్న ఆర్మీ వ్యాను ముందు వెళ్తున్న పల్సర్ బైకును ఢీకొట్టింది. దీంతో దానిపై ప్రయాణిస్తున్న మహిళకు తీవ్రగాయాలు కాగా.. బైకు నడుపుతున్న పురుషుని కాలు విరిగింది. అనంతరం రోడ్డు దాటుతున్న మరో వాహనాన్ని(ప్యాషన్) ఢీ కొట్టింది. దీంతో వాహనం పైన ఉన్న అంబులెన్స్ డ్రైవర్ లక్ష్మణ్ (37) అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆ తర్వాత అటువైపు నుంచి వస్తున్న స్కూటీని ఢీకొంది. దీంతో ఆ వాహనదారునికి కూడా తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement