
కాబూల్: అమెరికా దళాలు వెనుదిరుగుతున్న వేళ ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడిలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 11 మంది మృతి చెందారు. బాంబు పేలిన వెంటనే బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారి ప్రకటించారు.
ఆఫ్ఘనిస్థాన్‌లోని పశ్చిమ ప్రావిన్స్ అయిన బాద్ఘిస్ నగరంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు. కాగా, ఇది తాలిబన్ల పనేనని బాద్ఘిస్ గవర్నర్ హెసాముద్దీన్ షామ్స్ ఆరోపించారు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్థాన్‌లో బస్సుపై బాంబు దాడి జరగడం ఈ వారంలో ఇది రెండోసారి.
చదవండి: India: ఆకలి రాజ్యం