bus blast
-
అక్టోబర్‌లో అమిత్ షా పర్యటన.. జమ్మూ కశ్మీర్లో జంట పేలుళ్ల కలకలం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో జంట పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉధంపూర్‌లోని పెట్రోల్ బంక్ సమీపంలో డొమిల్ చౌక్ వద్ద పార్క్ చేసిన ఖాళీ బస్సులో బధవారం రాత్రి మొదటి పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బస్సులోని డ్రైవర్ క్యాబిన్లో కూర్చున్న కండక్టర్ సునీల్ సింగ్(27), అతని స్నేహితుడు విజయ్ కుమార్(40)కు గాయాలయ్యాయి. వీరిని ఉధంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 8 గంటల్లో రెండు పేలుళ్లు ఉధంపూర్ జిల్లాలోని పాత బస్టాండ్ వద్ద పార్క్ చేసిన బస్సులో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు మరో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. కాగా 8 గంటల వ్యవధిలో ఉధంపూర్ జిల్లాలో జరిగిన రెండో ప్రమాదం ఇది. మొదటి పేలుడు చోటుచేసుకున్న 4 కిలోమీటర్ల దూరంలోనే ఈపేలుడు జరిగింది. #WATCH | J&K: Investigation underway by Army Bomb Disposal Squad & dog squad at the bus stand in Udhampur. Two blasts occurred within 8 hours in Udhampur; two people got injured in the first blast and are now out of danger, no injury in 2nd blast, says DIG Udhampur-Reasi Range pic.twitter.com/DuCnMngqZq — ANI (@ANI) September 29, 2022 పేలుళ్లకు కారణం? పేలుడు జరిగిన సమీపంలో ఆపి ఉంచిన ఇతర వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన అనంతరం పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే పేలుడుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఉధంపూర్ డీఐజీ తెలిపారు. ఇదిలా ఉండగా ఆరు నెలల తర్వాత ఉధంపూర్ పట్టణంలో ఈ జంట పేలుళ్లు జరిగాయి. చివరగా ఈ ఏడాది మార్చి 9 న స్లాథియా చౌక్‌లో స్టిక్కీ బాంబు పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. వచ్చే నెలలో అమిత్ షా పర్యటన కాగా అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూ కశ్మీర్‌కు రానున్నారు. కత్రా పట్టణానికి సమీపంలో ఉన్న త్రికుటా హిల్స్‌లోని మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, పూజలు చేయనున్నారు. అనంతరం సరిహద్దు జిల్లా రాజౌరి, బరాముల్లాలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించడంతో పాటు, అక్కడే బస చేయనున్నారు. అయితే కేంద్రమంత్రి పర్యటన ముందు ఉధంపూర్ పట్టణంలో రెండు శక్తివంతమైన పేలుళ్లు సంభవించడం కలకలం రేపుతోంది. హోంమంత్రి సందర్శనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. -
బస్సులో బాంబు పేలుడు.. 11 మంది మృతి
కాబూల్: అమెరికా దళాలు వెనుదిరుగుతున్న వేళ ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడిలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 11 మంది మృతి చెందారు. బాంబు పేలిన వెంటనే బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారి ప్రకటించారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని పశ్చిమ ప్రావిన్స్ అయిన బాద్ఘిస్ నగరంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు. కాగా, ఇది తాలిబన్ల పనేనని బాద్ఘిస్ గవర్నర్ హెసాముద్దీన్ షామ్స్ ఆరోపించారు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్థాన్‌లో బస్సుపై బాంబు దాడి జరగడం ఈ వారంలో ఇది రెండోసారి. చదవండి: India: ఆకలి రాజ్యం -
బలగాల బస్సును పేల్చేసిన మావోలు
చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ప్రధాని మోదీ శనివారం పర్యటించనున్న నేపథ్యంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతాబలగాలే లక్ష్యంగా రెండుచోట్ల మందుపాతరలను పేల్చి ఇద్దరు జవాన్లను బలిగొన్నారు. బీజాపూర్ జిల్లాలోని పుట్రు–నమ్మేడ్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న రహదారిని తనిఖీ చేసి తిరిగివస్తున్న భద్రతాబలగాల బస్సే లక్ష్యంగా సోమవారం మధ్యాహ్నం మావోలు శక్తిమంతమైన మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డుల(డీఆర్జీ)కు చెందిన ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రుల్ని రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది జవాన్లు ఉన్నారన్నారు. -
బస్సులో బాంబు పేలుడు : 11 మంది మృతి
క్వెట్టా : పాకిస్థాన్ బెలూచిస్థాన్‌లోని ప్రావెన్స్లో సోమవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. క్వెట్టాలోని సర్యబ్ రహదారి వద్ద బస్టాండ్‌లోని అప్పుడే కదులుతున్న బస్సులో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణీకులు అక్కడికక్కడే మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది దినసరి కూలీలేనని బెలూచిస్థాన్ ప్రావెన్స్ పోలీసు ఉన్నతాధికారి అల్మీష్ ఖాన్ మంగళవారం వెల్లడించారు. నగరంలో దినసరి కూలీ పనులు చేసుకునే వారిని... వారివారి స్వస్థలాలకు తీసుకు వెళ్లేందుకు ప్రతిరోజు రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఓ బస్సు ఉంటుందని తెలిపారు. ఆ క్రమంలో వారిని తీసుకువెళ్లేందుకు అప్పుడే బయలుదేరిన బస్సులో కూలీలు ఉన్నారని చెప్పారు. బస్సుపై భాగంలో బాంబు అమర్చారని చెప్పారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు. ఎనిమిది మంది ప్రయాణీకుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ బాంబు పేలుడును బెలూచిస్థాన్ ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు.