ied planted
-
జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
శ్రీనగర్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై ఉగ్రవాదులు అమర్చిన సుమారు 25 నుంచి 30 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసింది సైన్యం. 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఐఈడీని గుర్తించటం భారీ విధ్వంసాన్ని అడ్డుకున్నట్లయిందన్నారు . ‘పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై సుమారు 25-30 కిలోలు ఉన్న ఐఈడీని పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పుల్వామా పోలీసులకు అందిన సమాచారంతో భారీ విధ్వంసాన్ని అడ్డుకోగలిగాం.’ అని తెలిపారు కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్. అంతకు ముందు రోజు ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్న ఓ ఉగ్రవాదిని ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్ పట్టుకుంది. అతడు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఐఈడీలు పేల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు సబౌద్దిన్పై లక్నోలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? -
శ్రీలంకకు తప్పిన మరో ముప్పు
కొలంబో: శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్లు మారణహోమాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తతో మరో పెను ముప్పు తప్పింది. వరుస పేలుళ్లతో చివురుటాకులా వణుకుతున్న కొలంబోలో తాజాగా మరో శక్తివంతమైన బాంబును గుర్తించడం కలకలం రేపింది. కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయం మెయిన్ టెర్మినల్ రోడ్డులో అతిప్రమాదకరమైన ఐఈడీ పేలుడు పదార్థాలను సిబ్బంది తొలగించారు. దీంతో మరో పెద్ద ప్రమాదం తప్పింది. ఆదివారం పేలుళ్ల నేపథ్యంలో కొలంబియా కతునాయకే విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంట్లో భాగంగా అనుమానాస్పద వస్తువులను, వ్యక్తులపై తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీలంక వైమానిక దళం (ఎస్ఎల్ఏ ఎఫ్) సిబ్బంది ఐఈడీ బాంబు (స్థానికంగా తయారు చేసిన పైప్ బాంబు) నిర్వీర్యం చేశారని స్థానిక మీడియా నివేదించింది. హై సెక్యూరిటీ జోన్లో వీటిలో ఎవరు పెట్టారన్న అంశంపై అదనపు భద్రతా బృందం విచారిస్తోంది. సీసీటీవీ ఫుజేట్‌ను పరిశీలిస్తున్నారు. అటు అదనపు భద్రతా చర్యలను దృష్టిలో ఉంచుకుని కనీసం నాలుగు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాల్సిందిగా విమాన ప్రయాణికులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా శ్రీలంక రాజధాని కొలంబో పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 290కి చేరింది. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ఫేక్ న్యూస్‌ను నిరోధించే ఉద్దేశంతో సోషల్ మీడియా సేవలను నిలిపివేయగా, కర్ఫ్యూ కొనసాగుతోంది. -
ఆ శునకం చూడకపోతే.. ఎన్ని ప్రాణాలు పోయేవో!
-
ఆ శునకం చూడకపోతే.. ఎన్ని ప్రాణాలు పోయేవో!
పోలీసు కుక్కలు అంటే వాసన చూసి దేన్నైనా పసిగడతాయి. సీఆర్పీఎఫ్లో కూడా ఇలాగే శిక్షణ పొందిన శునకాలు ఉన్నాయి. సరిగ్గా అలాంటిదే ఓ వీర శునకం.. మావోయిస్టులు అమర్చిన అత్యంత శక్తిమంతమైన ఐఈడీని గుర్తించి.. పలు ప్రాణాలను కాపాడింది. ఒడిసాలోని రాయగడ జిల్లాలోని హతమునిగూడ వద్ద మావోయిస్టులు ఐదు కిలోల ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)ను అమర్చారు. దాన్ని ఆక్సెల్ అనే సీఆర్పీఎఫ్ శునకం గుర్తించింది. అయితే, దాన్ని గుర్తించే సమయంలో దాని కాలికి, కంటి కింద తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత బాంబు నిర్వీర్య దళం వచ్చి... ఆ బాంబును డిఫ్యూజ్ చేసింది. ఈ ఐఈడీని గనక మావోయిస్టులు పేల్చి ఉంటే.. అటువైపుగా కూంబింగ్ కోసం వెళ్లే సీఆర్పీఎఫ్ బలగాలకు చాలా పెద్దమొత్తంలోనే ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు చెప్పారు. ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్ తర్వాత కలహండి, కొంధమాల్, రాయగడ జిల్లాల్లో సీఆర్పీఎఫ్, ఒడిషా పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకోడానికి మావోయిస్టులు ఈ ఐఈడీని అమర్చి ఉంటారని సీఆర్పీఎఫ్ అధికారులు భావిస్తున్నారు. ఏడేళ్ల వయసున్న ఆక్సెల్.. గత నాలుగేళ్ల నుంచి సీఆర్పీఎఫ్కు సేవలు అందిస్తోంది. శంభు ప్రసాద్ అనే ట్రైనర్ దాని బాధ్యతలు చూస్తున్నారు.