వాషింగ్టన్ : భారీ నరమేధానికి ఐసిస్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నుతున్నట్లు అమెరికా రణ శాఖ వివిధ దేశాలకు సమాచారం అందజేసింది. ముఖ్యంగా యూరప్ దేశాలకు ప్రధాన హెచ్చరికలు జారీ చేస్తూ.. అక్కడ ఉన్న తమ దేశ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలియజేసింది. క్రిస్మస్, కొత్త సవత్సర వేడుకలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉగ్రదాడుల హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
బ్రిటన్, స్పెయిన్, స్వీడన్, రష్యా, ఫిన్ లాండ్ దేశాలతోపాటు పవిత్ర నగరంగా భావించే వాటికన్ సిటీ కూడా ఆ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. దీనికితోడు ఐసిస్ మీడియా వాఫా విడుదల చేసిన ఓ కొత్త పోస్టర్ మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. మత గురువు పొప్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. క్రిస్మస్ బ్లడ్ సో వెయిట్... పేరిట విడుదల చేసిన పోస్టర్‌లో కారులో పక్కనే ఓ తుపాకీతో ఉగ్రవాది దూసుకొచ్చినట్లుగా ఉంది. ఇలాంటివి చాలా కష్టతరమైన దాడులే అయినప్పటికీ.. ఇటీవల వరుసగా జరుగుతున్న ఆత్మాహుతి దాడుల నేపథ్యం పరిశీలిస్తే మాత్రం ఈ హెచ్చరికలను అంత తేలికగా తీసుకోవటానికి వీల్లేదని ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ స్టీవ్ గోమెజ్ చెబుతున్నారు.
గత ఏడాది క్రిస్మస్ పర్వదినానే జర్మనీలోని బెర్లిన్ లో దాడులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. ఇస్తాంబుల్(టర్కీ) కూడా ఓ నైట్ క్లబ్ పై కాల్పులు జరపగా... 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలంటూ యూరప్‌తోపాటు పలు ఆసియా దేశాలకు(భారత్ సహా) కూడా అమెరికా ఏజెన్సీ ఎఫ్‌బీఐ హెచ్చరికలను జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment