
నిందితుడు మాటిన్ అజిజీ యరాండ్ (పాత ఫొటో)
టెక్సస్, అమెరికా : ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రియర్ సెంటర్ షాపింగ్‌మాల్‌పై ఉగ్రదాడి చేసేందుకు కుట్ర పన్నిన యువకుడిని అమెరికా పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ప్లానో వెస్ట్ సీనియర్ హైస్కూల్‌లో విద్యను అభ్యసిస్తున్న మాటిన్ అజిజీ యరాండ్(17) ఈ కుట్ర పన్నినట్లు అక్కడి మీడియా పేర్కొంది. యరాండ్‌కు ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నెలలో షాపింగ్‌మాల్‌లో తుపాకులతో దాడికి దిగి నరమేథం సృష్టించాలని నిందితుడు భావించినట్లు వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లో ఎఫ్‌బీఐకు చెందిన నకిలీ ఉగ్రవాదుల యాప్ ద్వారా సంప్రదింపులు ప్రారంభించాడని తెలిపారు. ఇప్పటికే తాను ఆపరేషన్లను ఎలా నిర్వహించాలి, బాంబులు ఎలా తయారు చేయాలనే అంశాలను ఐసిస్ పుస్తకాల ద్వారా నేర్చుకున్నట్లు వెల్లడించాడు.
భవిష్యత్‌లో పాకిస్తాన్ వెళ్లి అక్కడి నుంచి ఆప్ఘనిస్తాన్‌కు వెళ్లి ఐసిస్‌లో చేరుతానని కూడా యారండ్ ఎఫ్‌బీఐ అధికారులకు చెప్పాడు. కాగా, స్టోన్‌బ్రియర్ సెంటర్ షాపింగ్‌మాల్‌పై దాడికి వ్యూహాన్ని రచించిన యారండ్ 1400 డాలర్లు ఖర్చు చేసి తుపాకులను కూడా కొనుగోలు చేశాడు. దీంతో అతనిని టెక్సస్ పోలీసులు అరెస్టు చేసి ఉగ్రవాద కేసును నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment