Suspicious bag
-
భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. రెండు బ్యాగుల నిండా బాంబులు స్వాధీనం
శ్రీనగర్: జమ్ము రైల్వే స్టేషన్ వద్ద పేలుళ్లు జరిపేందుకు చేసిన భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోని టాక్సీ స్టాండ్ వద్ద 18 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రెండు బ్యాగుల్లో పేలుడు పదార్థాలను గుర్తించినట్లు చెప్పారు. డిటోనేటర్లతో పాటు రెండు బాక్సుల్లో వైర్లను గుర్తించామని, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘సుమారు 500 గ్రాముల మైనపు రకం పదార్థం బాక్సులో ప్యాక్ చేసి కనిపించింది. వాటిని సీజ్ చేశాం.’ అని ప్రభుత్వ రైల్వే పోలీసు జీఆర్పీ ఎస్ఎస్పీ ఆరిఫ్ రిషూ తెలిపారు. ట్యాక్సీ స్టాండ్‌లో అనుమానిత బ్యాగ్‌ను గుర్తించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. రెండు బాక్సుల్లో డిటోనేటర్లు, వైర్లు ఉన్నాయని చెప్పారు. కొద్ది రోజులుగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు జరుగుతున్న క్రమంలో పేలుడు పదార్థాలు లభించటం ఆందోళనలు పెంచుతోంది. ఇదీ చదవండి: ఆ కేసులో దోషిగా తేలిన సైకిల్ పార్టీ కీలక నేత.. ఎమ్మెల్యే పదవికి ఎసరు! -
ఢిల్లీలో బాంబు కలకలం: ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగ్..!!
-
ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం
సాక్షి, బెంగళూరు: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. టికెట్ కౌంటర్ వద్ద అనుమానాస్పద బ్యాగ్‌ను కొనుగొన్నవిమానాశ్రయ పోలీసులు, ఉన్నతా ధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న నగర పోలీసులకు చెందిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీఎస్) ఆ బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు. దీంతో ఆ బ్యాగ్‌ను థ్రెట్ కంటైన్మెంట్ వెహికల్లో ఉంచి, కిలోమీటరు దూరంలో కెంజార్‌లోని బహిరంగ స్థలానికి తీసుకెళ్లి పరిశీలిస్తున్నారు. బ్యాగ్‌లో మెటల్ కాయిన్ బాక్స్ ఉందని, అందులో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు ఉంచారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులను మోహిరింపచేసిన అధికారులు ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు నిందితుడి ఫోటోలను విడుదల చేశారు.అలాగే నిందితుడు వెళ్లిన ఆటోరిక్షాను ఫోటోను కూడా రిలీజ్ చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) డిఐజి అనిల్ పాండే అందించిన సమాచారం ప్రకారం నిందితుడు బ్యాగ్‌ను మంగళూరు విమానాశ్రయంలో ఉంచి, ముఖాన్ని దాచుకుంటూ ఆటోలో అక్కడినుంచి ఉడాయించాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. అలాగే బాంబును నిర్వీర్యం చేసేందుకు సంబంధిత సిబ్బంది పనిచేస్తున్నారని పాండే చెప్పారు. అలాగే అన్ని విమాన సర్వీసులు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని విమానాశ్రయ డైరెక్టర్ వి.వి. రావు ఒక ప్రకటనలో తెలిపారు. Karnataka: Mangaluru Police releases photographs of suspect and the autorickshaw he was seen leaving in, in the CCTV footage. A suspicious bag was found at Mangaluru Airport today. https://t.co/9X3seeADZC pic.twitter.com/NKeak3rwnz — ANI (@ANI) January 20, 2020 -
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగు కలకలం
ఢిల్లీ : న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం తెల్లవారుజామున 2గంటకు టర్మినెల్ 3 దగ్గర అనుమానాస్పదంగా లభించిన బ్యాగు కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీంతో కలిసి పోలీసులు ఎయిరపోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ప్రయాణికులెవరిని లోపలికి అనుమతించలేదు. అనుమానాస్పదంగా దొరికిన బ్యాగును పరిశీలిస్తున్నారు. కాగా, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
రామాలయంలో బ్యాగు కలకలం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఓ భక్తుడు వదిలేసిన బ్యాగుతో కొంత ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడింది. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారి కోవెలకు సమీపంలో ఓ భక్తుడు బ్యాగు వదిలిపెట్టి వెళ్లాడు. అది చాలా సేపు అక్కడే ఉంది. ఆలయ సిబ్బంది దాని ని చూసి, సెక్యూరిటీ వారికి సమాచారం ఇవ్వటం తో వారు దానిని పరిశీలించారు. అయితే బ్యాగు పై అనుమానం కలుగటంతో బాంబ్‌స్క్వాడ్ బృం దానికి సమాచారం ఇచ్చారు. బ్యాగులో ఏదో ఉం దని ప్రచారం జరగడంతో భక్తులు తీవ్ర భయాం దోళనకు గురయ్యారు. బాంబుస్క్వాడ్ బృందం వచ్చి ఆ బ్యాగును నిశితంగా పరిశీలించగా అందు లో భక్తులకు సంబంధించిన కొబ్బరికాయ, బట్ట లు ఉన్నాయి. దీంతో ఆలయ సిబ్బంది ఊపిరి పీ ల్చుకున్నారు. బ్యాగుకు సంబంధించిన భక్తులెవ్వరూ రాకపోవటంతో దానిని ఆలయ సిబ్బంది ఆధీనంలో ఉంచుకున్నారు. -
పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం: హై అలర్ట్..!
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ లో మళ్లీ కలకలం చెలరేగింది. గత రాత్రి పోలీసుల తనిఖీల్లో సైనిక దుస్తులతో కూడిన ఒక బ్యాగ్ దొరకడం అలజడి సృష్టించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు సోమవారం హై అలర్ట్ జారీ చేశారు. ఆర్మీ, స్వాత్ కమాండోల ఆధ్వర్యంలో ఉమ్మడిగా భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మమున్ ఆర్మీ కంటోన్మెంట్‌కు సమీపంలో అనుమానాస్పద బ్యాగ్ దొరకడంతో భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. మూడు సైనిక దుస్తులను కొనుగొన్నామని పోలీసులు తెలిపారు. వీటిపై జమ్మూ అని రాసివుందని సీనియర్ పోలీస్ అదికారి ఒకరు చెప్పారు. వీటిని ఒక గోనె సంచిలో కుక్కి ఉండగా కనుగొన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో సైన్యాన్ని, స్వాత్ కమాండోలను మోహరించామన్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా మే 4న మిలిటరీ బేస్‌కు కూతవేటు దూరంలో అనుమానాస్పదంగా పడివున్న నాలుగు సంచులను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఒక మొబైల్ టవర్ బ్యాటరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జనవరిలో పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో 7గురు జవాన్లు అసువులు బాయగా, దాదాపు 37మంది పౌరులు క్షతగాత్రులైన సంగతి తెలిసిందే -
రాష్ట్రపతి భవన్ వద్ద కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్ద కలకలం రేగింది. రాష్ట్రపతి భవన్ వెలుపల అనుమానిత బ్యాగ్ ఉందన్న వదంతులు దావానంలా వ్యాపించడంతో బలగాలు పరుగులు పెట్టాయి. హుటాహుటిన రాష్ట్రపతి భవన్ వద్ద మోహరించి తనఖీలు ప్రారంభించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఫోన్ చేసి రాష్ట్రపతి భవన్ ఒకటో నెంబర్ గేట్ వద్ద బయట ఏదో గుర్తు తెలియని బ్యాగ్ ఉందని పోలీసులకు చెప్పారు. దీంతో ఉన్నపలంగా పోలీసులు వచ్చి ఆ చుట్టుపక్కల సోదాలు చేస్తుండగా ఏమీ లభించలేదు. ఇంకా బలగాల గాలింపు జరుగుతునే ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీతోపాటు కొన్ని ముఖ్యమైన స్థావరాలపై బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని, పోలీసు విభాగం అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించిన విషయం తెలిసిందే. -
బెంగళూరులో బ్యాగ్ కలకలం!
బెంగళూరు : బెంగళూరులోని కావేరి థియేటర్ సర్కిల్ సమీపంలో అనుమానాస్పదంగా పడిఉన్న ఓ బ్యాగ్ శుక్రవారం కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. అయితే బ్యాగ్‌లో ఎలాంటి పేలుడు పదార్ధాలు లేవని పోలీసులు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓ ఇంటి నుంచి తమకు సమాచారం వచ్చిందని, దాంతో బాంబు నిర్వీర్యం చేసే టీంను పిలిచినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి పేలుడు పదార్ధాలు లేవని తేలిందని, కాకపోతే తాము అప్రమత్తంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు.