బెంగళూరులో బ్యాగ్ కలకలం! | Suspicious object found in Cauvery theatre circle in Bengaluru | Sakshi
Sakshi News home page

బెంగళూరులో బ్యాగ్ కలకలం!

Published Fri, Jan 15 2016 1:59 PM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM

బెంగళూరులో బ్యాగ్ కలకలం! - Sakshi

బెంగళూరులో బ్యాగ్ కలకలం!

బెంగళూరు : బెంగళూరులోని కావేరి థియేటర్ సర్కిల్ సమీపంలో అనుమానాస్పదంగా పడిఉన్న ఓ బ్యాగ్  శుక్రవారం కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు.  దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు తనిఖీలు చేపట్టారు.

 

అయితే బ్యాగ్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు లేవని పోలీసులు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓ ఇంటి నుంచి తమకు సమాచారం వచ్చిందని, దాంతో బాంబు నిర్వీర్యం చేసే టీంను పిలిచినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి పేలుడు పదార్ధాలు లేవని తేలిందని, కాకపోతే తాము అప్రమత్తంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement